బెల్లీ ఫ్యాట్ ను సులువుగా తగ్గించే చిట్కాలు మీకోసం
బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలనుకుంటున్నారా..? అయితే కొన్ని సులువైన చిట్కాలు మీకోసం.. ఇవి మీ బెల్లీ ఫ్యాట్ ను వేగంగా తగ్గిస్తాయి తెలుసా..
ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బందులు పడుతున్న వారు ప్రస్తుతం చాలా మందే ఉన్నారు. అందులోనూ తాజా వెల్లడించిన ఓ సర్వే ప్రకారం.. మగవాళ్లతో పోల్చితే ఆడవారే ఊబకాయం బారిన పడుతున్నారట. ఇకపోతే ఈ బరువును తగ్గించడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. మంచి ఆహారపు అలవాట్ల వల్ల బెల్లీ ఫ్యాట్ ను, ఓవర్ వెయిట్ ను సులువుగా తగ్గించుకోవచ్చు. బెల్లీ ఫ్యాట్ ను సులువుగా తగ్గించుకోవడానికి మీకోసం కొన్ని చిట్కాలు..
యోగా
ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. బరువు కూడా తగ్గుతారు. వెయిట్ ను, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి ఎన్నో ఆసనాలు మీకు సహాయపడతాయి.
ఉస్త్రాసనం, నౌకాసనం, ధనురాసనం, భుజంగాసనం, కుంభకాసనం వంటి కొన్ని ఆసనాలను రెగ్యులర్ గా చేయడం వల్ల కచ్చితంగా బరువును తగ్గడంతో పాటుగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.
చక్కెరను తీసుకోవడం మానేయండి
తీపి పదార్థాలను, తియ్యని పానీయాలను తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే షుగర్ బరువు పెరగడానికి దారితీస్తుంది. దీని కారణంగానే చాలా మంది విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. అందుకే సోడాలు, బయటి పండ్ల రసాలకు, తియ్యని పానీయాలకు బాయ్ బాయ్ చెప్పండి. అలాగే క్యాండీలు, చాక్లెట్లు, డెజర్ట్‌లను కూడా తీసుకోవడం తగ్గించండి. వీటికి బదులుగా పండ్లనే తినండి.
protein rich foods
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి
బరువును తగ్గించడంలో ప్రోటీన్ ఫుడ్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉండే ఆహారపదార్థాలను తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఆకలి కోరికలు కూడా తగ్గుతాయి. అందుకే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే గింజలు, ఉడకబెట్టిన గుడ్లు, చికెన్ వంటి ఆహారాలను మీ ఆహారాల్లో చేర్చండి. బరువు తగ్గేందుకు ఈ ప్రోటీన్ ఫుడ్స్ మీకు శక్తిని అందించడానికి కూడా సహాయపడతాయి.
మార్నింగ్ డ్రింక్స్
బరువు తగ్గేందుకు మార్నింగ్ డ్రింక్స్ కూడా ఎంతో సహాయపడతాయి. అందులోనూ కొన్ని పానీయాలను ఉదయం పరిగడుపున తాగితే ఫాస్ట్ గా బరువు తగ్గడంతో పాటుగా.. బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఇందుకోసం మీరు జీలకర్ర వాటర్ లేదా, పుదీనా ఆకులతో తయారుచేసిన గ్రీన్ టీ, తేనె, నిమ్మకాయ నీరును తాగండి.
పిండి పదార్థాలను తక్కువగా తినాలి
పిండి పదార్థాలనుు ఎక్కువగా తీసుకుంటే కూడా బరువు విపరీతంగా బరువు పెరగడంతో పాటుగా బెల్లీ ఫ్యాట్ కూడా బాగా పెరుగుతుంది. అందుకే కార్భ్ ను తక్కువగా తీసుకోవాలని నిపుణులు సలహానిస్తున్నారు. ముఖ్యంగా శుద్ధి చేసిన పిండి పదార్థాల జోలికి మొత్తమే వెళ్లకపోవడం బెటర్. వీటికి బదులుగా కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. కార్భ్ వినియోగాన్ని తగ్గిస్తేనే మీ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.