Health Tips: గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఏమౌతుందో తెలుసా?
Health Tips: కలుషిత వాతావరణం, రసాయనాలతో నిండిన ఫుడ్, ఇంటిలో క్రిమికీటకాలు ఉండకుండా చేసే క్లీనింగ్ కెమికల్స్ , గాలి కాలుష్యం.. ఇలా ఎన్నో రకాల కారణాలతో మన బాడీలో ఎన్నో Harmful substances పేరుకుపోయి ఉంటాయి. వీటి వల్ల అనేక రోగాల బారిన పడే ప్రమాదముంది. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. అటువంటి సమయంలో మన శరీరానికి Detoxification ఎంతో అవసరం.
Health Tips: కలుషిత వాతావరణం, కల్తీ ఫుడ్, కలుషితమైన గాలి, కెమికల్స్ వాడకం వల్ల మన బాడీలో ఎన్నో విషవాయువులు నిండిపోయి ఉంటాయి. ఈ కారణంగా మనం తీవ్రమైన ఒత్తిడికి గురవ్వడమే కాదు, అనేక రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంది. ఇటువంటి సమయంలో మనం మన శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపాల్సిన అవసరం చాలా ఉంది. మన శరీరంలోని హానికరమైన పదార్థాలను ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
అవసరానికి మించి తింటే పొట్టను ఇబ్బంది పెట్టడమే అవుతుంది. అంతేకాదు హెవీగా తినడం వల్ల జీర్ణాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇలా కాకూడదంటే హెవీగా ఎప్పుడూ తినకూడదు. ముఖ్యంగా రసాయనాలు వాడని కూరగాయలనే వాడాలి. వీటితో ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. కూరగాయల్లో ముల్లంగి, బీట్ రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను ఎక్కువగా తినడం మంచిది. అందులో మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నిమ్మకాయ మరీ మంచిది. ఈ సిట్రస్ ఫ్రూట్ లో ఫ్రీ రాడికల్స్ ను చంపే గుణం ఉంటుంది. ఈ నిమ్మరసం మన రక్తంలోని PH విలువలు బ్యాలెన్స్ గా ఉండేలా చూస్తుంది. బాడీలోని ట్యాక్సిన్సు పోవాలంటే ప్రతి దినం గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం వేసుకుని తాగాలి.
శరీరంలోని ట్యాక్సిన్లు బయటకు పోవాలంటే తాజా పండ్లను తరచుగా తింటూ ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
1 दिन में कितना पानी पिएं
ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలంటే తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఖనిజ లవణాలు ఎక్కువ మొత్తంలో ఉండే నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళతాయి.
ఖర్చులేకుండా డీటాక్సిఫికేషన్ అంటే ఒకే మార్గం ఉంది. అదే వ్యాయామం. వేళకు తింటూ, నిద్రపోతూ, వ్యాయామం చేస్తే సరి. ముఖ్యంగా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలు కరుగుతాయి. అంతేకాదు వ్యాయామాలు చేస్తున్న సమయంలో చెమట విపరీతంగా పడుతుంది. ఈ చెమట ద్వారానే మన శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ తొలగిపోతాయి.
వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఆహారంలో తీసుకోవడంతో మన శరీరంలో ఉండే హానీకరమైన పదార్థాలు చనిపోతాయి. అంతేకాదు వెల్లుల్లి White blood cells ను కాపాడుతుంది. ఈ వెల్లుల్లిని పచ్చిదిగానే తిన్నా ఆరోగ్యానికి మంచిదే. అలా తినలేమ అనేవాళ్లు కూరల్లో వేసుకుని తిన్నా మంచిదే. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియా, యాంటి వైరల్ గుణాలు ఉంటాయి.
ముఖంపై మేకప్ ఎక్కువగా వేసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే అందం కోసం వేసుకునే మేకప్ వల్ల మన ముఖ చర్మంపై ఉండే అతి సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోతాయి. వీటి వల్ల శరీరంలో అనవసరంగా ట్యాక్సిన్ ఎక్కువవుతాయి. కాబట్టి బ్యూటీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు.