MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Air Cooler Tips: కూలర్‌.. ఏసీలా పనిచేయాలంటే ఇలా చేయండి!

Air Cooler Tips: కూలర్‌.. ఏసీలా పనిచేయాలంటే ఇలా చేయండి!

రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడుతుంటారు. ఏసీలు కొనుక్కోలేని వాళ్లు ఎక్కువగా కూలర్లు వాడుతుంటారు. అయితే రకరకాల కారణాల వల్ల ఎయిర్ కూలర్లో గాలి చల్లగా రావడం తగ్గిపోతుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? కూలర్లను ఏసీల్లాగా ఎలా మార్చుకోవాలో ఇక్కడ చూద్దాం.  

1 Min read
Author : Kavitha G
Published : Apr 23 2025, 06:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వేసవిలో ఎయిర్ కూలర్ వాడకం ఎక్కువగా ఉంటుంది. కొన్ని కూలర్లు పాతవి కావడం వల్లనో లేక ఇతర కారణాల వల్లనో వాటినుంచి పెద్దగా చల్లగాలి రాదు. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే కూలర్.. ఏసీలా పనిచేస్తుంది. ఆ చిట్కాలెంటో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కూలర్ నుంచి చల్లగాలి రావాలంటే ఏం చేయాలి?

కూలర్ నుంచి చల్లగాలి రావాలంటే ఏం చేయాలి?

ఏసి ఖరీదైంది. కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది. సామాన్యులు కొనుక్కోవడం కష్టం. అందుకే చాలామంది వేసవిలో ఎయిర్ కూలర్ వాడుతుంటారు. దీనికి ఖర్చు తక్కువ. కొన్ని చిట్కాలు పాటిస్తే ఏసి కంటే చల్లగాలి వస్తుంది. అవెంటో చూద్దాం.

36
కర్టెన్లు వేసుకోవాలి

కర్టెన్లు వేసుకోవాలి

వేసవిలో ఎండవేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గదిలోకి ఎండ రాకుండా కర్టెన్లు వేసుకోవాలి. థర్మోకోల్ కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల బయటి ఎండ లోపలకు రాదు. ఇంట్లో చల్లదనం బయటకు పోకుండా ఉంటుంది. వేడి ఉండదు కాబట్టి గాలి మరింత చల్లగా అనిపిస్తుంది.

46
కూలింగ్ ప్యాడ్స్

కూలింగ్ ప్యాడ్స్

కూలర్ వెనుక లేదా పక్కన ఉన్న కూలింగ్ ప్యాడ్స్ ను అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవాలి. 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి వాటిని మార్చుకోవాలి. అప్పుడే కూలర్ నుంచి చల్లగాలి వస్తుంది.

56
కిటికీ దగ్గర పెట్టండి

కిటికీ దగ్గర పెట్టండి

సాధారణంగా కూలర్ ని బెడ్ దగ్గర అలా పెట్టుకుంటూ ఉంటాం. కానీ కూలర్ ని పెట్టేటప్పుడు వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం రాత్రి పడుకునేటప్పుడు కూలర్‌ని కిటికీ దగ్గర పెడితే చల్లగాలి గది అంతా వ్యాపిస్తుంది. ఏసీ వేసుకున్న ఫీలింగ్ వస్తుంది.

66
చల్లటి వాటర్

చల్లటి వాటర్

ఎయిర్ కూలర్‌లో వాటర్ పోసినప్పుడు ట్యాంక్ లెవెల్ కి అనుగుణంగా నింపాలి. తక్కువ నింపకూడదు. కూలింగ్ ప్యాడ్స్ ని కూడా ముందుగా తడిపి పెట్టుకుంటే చల్లగాలి వస్తుంది. దాంతో పాటు చల్లని నీరు పోస్తే మరింత చల్లగాలి వస్తుంది. ఏసి వేసుకున్న అనుభూతి పొందవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
యుటిలిటీ
Latest Videos
Recommended Stories
Recommended image1
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Coconut Water: కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఏమవుతుంది?
Recommended image3
Lockets: మీ చైన్ కు ఇలాంటి లాకెట్స్ జత చేస్తే అదరహో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved