MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Cooling Paint: ఈ కొత్తరకం కూలింగ్ పెయింట్ వేస్తే ఇల్లు కూల్.. ఏసీ అవసరమే ఉండదు

Cooling Paint: ఈ కొత్తరకం కూలింగ్ పెయింట్ వేస్తే ఇల్లు కూల్.. ఏసీ అవసరమే ఉండదు

Cooling Paint: ఎండలు వచ్చాయంటే చాలు ప్రతి ఇంట్లో ఏసీ పనిచేయాల్సిందే. లేకుంటే ఎండలకు ఉక్కపోతతో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు కొత్త రకం కూలింగ్ పెయింట్ ను శాస్త్రవేత్తలు సృష్టించారు. ఇది వేసుకుంటే ఏసి కూడా అవసరం లేదు.  

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 01 2026, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇంటిని చల్లగా ఉంచే కూలింగ్ పెయింట్
Image Credit : Chat gpt

ఇంటిని చల్లగా ఉంచే కూలింగ్ పెయింట్

మండే ఎండల్లో ఏసీ లేకుండా ఉండలేము. ఏసీలను అధికంగా వాడితే కరెంట్ బిల్లు అధికంగా వస్తాయి. దీనికి మంచి చక్కటి పరిష్కారాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. కొత్తగా కూలింగ్ పెయింట్ ను సృష్టించారు. ఈ స్మార్ట్ పెయింట్ ఇంటి పైన, ఇంటి గోడలకు వేసుకుంటే చాలు ఇల్లు చల్లగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ప్రత్యేక పెయింట్ 97 శాతం వరకు సూర్య కిరణాలను తిరిగి పరావర్తనం చెందేలా చేస్తుంది. అంటే ఇంటి గోడలు, పైకప్పు ఆ వేడిని గ్రహించలేవు. దీనివల్ల ఇంటి లోపల ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గే ఉంటుంది. అంటే ఏసీల అవసరం తగ్గిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ పెయింట్ ఎలా పనిచేస్తుంది?
Image Credit : Getty

ఈ పెయింట్ ఎలా పనిచేస్తుంది?

ఈ స్మార్ట్ కూలింగ్ పెయింట్ చాలా ప్రత్యేకమైనది. ఈ కూలింగ్ పెయింట్ లో సూక్ష్మరంధ్రాలు కలిగిన ప్రత్యేక పాలిమర్ నిర్మాణాలను ఉపయోగించారు. ఇది సూర్య రశ్మిని గ్రహించకుండా తిరిగి పరావర్తనం చెంది ఆకాశంలోకి వెళ్లేలా చేస్తుంది. ఇంటిపై ఉన్న వేడిని కూడా బయటకు పోయేలా చేస్తుంది. ఇప్పటికే ఈ స్మార్ట్ పెయింట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం ట్రయల్స్ చేశారు. ఆ ట్రయల్స్ లో ఈ పెయింట్ పూసిన ఇంటి పైకప్పులు సాధారణ పైకప్పులతో పోలిస్తే 25 డిగ్రీల సెల్సియల్స్ వరకు చల్లగా ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు.

34
గాలి నుంచి నీరు తయారీ
Image Credit : Getty

గాలి నుంచి నీరు తయారీ

ఈ కూలింగ్ పెయింట్ గాలిలోని తేమను కూడా నీటి బిందువులుగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. విద్యుత్ అవసరం లేకుండానే గాలి నుంచి నీరు తయారుచేసే ప్రక్రియ చేసేస్తుంది. దీని వల్ల కూడా ఇల్లు చల్లగా మారుతుంది. ఆస్ట్రేలియాలోని సిడ్ని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అక్కడ జరిగిన ప్రయోగాల్లో చదరపు మీటరుకు... రోజుకు 390 మిల్లీలీటర్ల వరకు నీటిని సేకరించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. అంటే గాలిలోని తేమను నీటి బిందువులుగా మారిన తర్వాత ఆ నీటిని సేకరించారు శాస్త్రవేత్తలు.

44
మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది?
Image Credit : Getty

మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది?

అయితే ఈ కూలింగ్ పెయింట్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారా? ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. తీవ్రమైన ఎండలు, విద్యుత్ ఖర్చులు, నీటి కొరత వంటి సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో దీన్ని అతి త్వరగా మార్కెట్లోకి విడుదల చేయాలని శాస్త్రవేత్తలు కూడా ఎదురుచూస్తున్నారు. ఎండలకు ఏసీ ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ కూలింగ్ పెయింట్ అద్భుతమైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతదేశం వంటి వేడి ఎక్కువగా ఉండే దేశాలకు ఇది చాలా ప్రయోజనకరమైనది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Moral Story: కర్మ ఈజ్ బూమరాంగ్.. పక్కవారిపై నింద వేసి సంతోషపడుతున్నారా? మీ కళ్లు తెరిపించే కథ ఇది
Recommended image2
Gold Saree: పండగ వేళ బంగారంలా మెరిసిపోయే గోల్డెన్ శారీ డిజైన్లు..
Recommended image3
Anklet Designs: పాదాలకు రాయల్ లుక్ ఇచ్చే అందమైన పట్టీలు.. ఇవిగో!
Related Stories
Recommended image1
Rahu Effects: రాహువు దెబ్బకు ఆగస్టు వరకు విలవిలలాడే 4 రాశులు ఇవే
Recommended image2
TV Unit Design: చిన్న హాల్ కోసం అదిరిపోయే వాల్ టీవీ యూనిట్ డిజైన్లు.. అది కూడా తక్కువ ధరలో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved