MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cooking Oil: పాడైన వంటనూనెను ఇలా గుర్తించండి.. దీన్ని వాడడం చాలా ప్రమాదకరం

Cooking Oil: పాడైన వంటనూనెను ఇలా గుర్తించండి.. దీన్ని వాడడం చాలా ప్రమాదకరం

Cooking Oil:  ప్రతి ఇంట్లో వంట నూనె ఉంటుంది. షాపు నుంచి వంట నూనె తెచ్చి ఎన్ని రోజుల్లో దాన్ని వాడాలి? నూనె ఎక్స్ పైరీ డేట్ ఉంటుందా? అనే విషయాలు తెలుసుకోండి. వంటనూనె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 21 2026, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నూనె ఎప్పుడు పాడవుతుంది?
Image Credit : AI Image

నూనె ఎప్పుడు పాడవుతుంది?

నూనె తాజాగా ఉందా లేదా? అనే విషయాన్ని ఎంతో మంది పట్టించుకోరు. పాలు, బ్రెడ్ లాగా నూనెకు కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. కాకపోతే ఇది రెండు మూడు రోజుల్లో పాడవ్వదు. అలాగని నూనెను నెలల తరబడి వాడకూడదు. గాలి, వెలుతురు, వేడి తగలడం వల్ల నూనెలో ఆక్సిడేషన్ ప్రక్రియ జరుగుతుంది. కొన్ని రోజులకు అది పాతగా మారి వాసన రావచ్చు.  పాతబడిన నూనె వాడితే వెంటనే ప్రభావం కనిపించదు. దీర్ఘకాలంలో ఫ్రీ రాడికల్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నూనె ఎక్స్ పైరీ డేట్
Image Credit : Getty

నూనె ఎక్స్ పైరీ డేట్

నూనెకు కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. అయితే వేర్వేరు నూనెల రకాన్ని బట్టి వాటి  జీవితకాలం మారుతూ ఉంటుంది. రిఫైన్డ్ వెజిటబుల్ లేదా కెనోలా ఆయిల్ మూత తెరవకపోతే 1-2 ఏళ్లు వాడొచ్చు. తెరిచాక 6-12 నెలల్లో వాడేయాలి. ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ప్యాక్‌లో 24 నెలలు నిల్వ ఉంవచ్చు. అదే మూత  తెరిచాక 3-6 నెలలు తాజాగా ఉంటుంది. కొబ్బరి నూనెను సుమారు 2 ఏళ్లు వాడొచ్చు. నువ్వుల నూనె మూత తెరిచాక 6 నెలలు, అవిసె గింజల (ఫ్లాక్స్‌సీడ్) నూనె ప్యాక్ తెరిస్తే 6-8 నెలలు వాడొచ్చు. తెరిచిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. అవకాడో నూనె తెరిచాక 6 నెలల వరకు వాడుకోవచ్చు.

33
పాడైన నూనెను ఎలా గుర్తుపట్టాలి?
Image Credit : Getty

పాడైన నూనెను ఎలా గుర్తుపట్టాలి?

నూనె పాడైందో లేదో తెలుసుకునేందుకు చిన్ని చిట్కాలు పాటించాలి.  ముందుగా నూనె వాసన చూడండి. పుల్లగా లేదా వింత వాసన వస్తే అది పాడైనట్లే. రుచి చేదుగా, పుల్లగా లేదా సబ్బులా అనిపించినా వాడొద్దు. నూనె రంగు మారడం, అడుగున ముక్కలు చేరడం లేదా మామూలు కంటే చిక్కగా మారడం కూడా నూనె పాడైందనడానికి సంకేతాలే. నూనె కొనేటప్పుడు ప్యాకెట్‌పై ఉన్న 'Best Before' లేదా 'Use By' తేదీని తప్పకుండా చెక్ చేయండి. బాటిల్ మూత తెరిచిన తేదీని గుర్తుపెట్టుకుంటే, సరైన సమయం వరకు నూనెను సురక్షితంగా వాడుకోవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
DMart vs Reliance Smart vs More: డీమార్ట్, రిలయన్స్ స్మార్ట్, మోర్.. నెలవారీ సరుకులకు ఏది బెస్ట్?
Recommended image2
Bangles: చేతుల అందాన్ని పెంచే బ్యాంగిల్స్ కి మ్యాచింగ్ జ్యూవెలరీ సెట్
Recommended image3
Gold Studs: రెండు గ్రాముల్లోనే డైలీ వేర్ చెవిపోగులు.. డిజైన్లు ఇవిగో
Related Stories
Recommended image1
Mobile Tower: సెల్ టవర్‌కు దగ్గరలో నివసిస్తే ప్రమాదమా? ఎలాంటి నష్టాలు కలుగుతాయి?
Recommended image2
Sweet Corn: ఇంట్లోనే కుండీలో స్వీట్ కార్న్ మొక్కలు ఇలా పెంచేయండి.. మొక్కజొన్న కండెలు పండుతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved