- Home
- Life
- Cancer: మగాళ్లకు మాత్రమే వచ్చే క్యాన్సర్ ఇది.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టు చేయించుకోండి
Cancer: మగాళ్లకు మాత్రమే వచ్చే క్యాన్సర్ ఇది.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టు చేయించుకోండి
Cancer: క్యాన్సర్ వచ్చిందంటే జీవితం మొత్తం వెంటాడుతూనే ఉంటుంది. మగాళ్లకు మాత్రమే వచ్చే క్యాన్సర్.. టెస్టిక్యులర్ క్యాన్సర్. అంటే మగవారి వృషణాల్లో మొదలయ్యే క్యాన్సర్ ఇది. ఇది వస్తే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.

మగవాళ్లకు మాత్రమే వచ్చే క్యాన్సర్
ఎన్నో రకాల క్యాన్సర్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి మాత్రం కేవలం పురుషులకు మాత్రమే వస్తుంది. పురుషుల వృషణాలకు వచ్చే క్యాన్సర్‌ను టెస్టిక్యులర్ క్యాన్సర్ అంటారు. వృషణాలు స్పెర్మ్, టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది చికిత్స చేయడానికి వీలైన క్యాన్సర్లలో ఒకటి. ఇది సాధారణంగా 15 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న పురుషులకు వచ్చే అవకాశం ఎక్కువ.
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెబుతున్న ప్రకారం అమెరికాలో సుమారు 9,810 కొత్త టెస్టిక్యులర్ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి ప్రతి ఏడాది నమోదవుతున్నాయి. ఈ క్యాన్సర్ వల్లఏటా దాదాపు 630 మంది మరణిస్తున్నారు. యూఎస్‌తో పాటు అనేక ఇతర దేశాలలో దశాబ్దాలుగా టెస్టిక్యులర్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని ముందుగానే గుర్తిస్తే, చికిత్స చేయడం చాలా సులువు.
టెక్టిక్యులర్ క్యాన్సర్ లక్షణాలు
పురుషులలో టెస్టిక్యులర్ క్యాన్సర్ వస్తే వారి టెస్టికల్స్ లో నొప్పి లేని గడ్డలు కనిపిస్తాయి. వృషణంలో నొప్పి లేకుండా ఉండే గడ్డ లేదా కణితి ఏర్పడుతుంది. ఇది చర్మం కింద బఠానీ గింజలా అనిపిస్తుంది. వృషణం సాధారణంగా నునుపుగా, గుడ్డు ఆకారంలో ఉంటుంది.. కాబట్టి ఈ గడ్డ స్పష్టంగా చేతిలో టచ్ చేస్తే తెలిసేలా ఉంటుంది. ఇది సాధారణంగా ఒక వృషణంలోనే వస్తుంది. నెమ్మదిగా పెరుగుతుంది.
వృషణ సంచిలో వాపు వస్తుంది. దీని వల్ల వృషణాలు వాచినట్టు కనిపిస్తాయి. కణితి పెరిగి చుట్టుపక్కల కణజాలాలపై ఒత్తిడి పెంచుతోందనడానికి ఈ వాపును సంకేతంగా భావించవచ్చు. దీనివల్ల రెండు వృషణాల సైజులో తేడా కనిపిస్తుంది. ఒకటి పెద్దదిగా, ఒకటి చిన్నదిగా ఉంటుంది.
పొత్తికడుపులో నొప్పితో పాటూ
వృషణంలో క్యాన్సర్ కణితి ఏర్పడితే నొప్పితో పాటూ అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈ నొప్పి నిరంతరంగా ఉంటూ క్రమంగా తీవ్రమవుతుంది. పొత్తికడుపులో నొప్పి కూడా టెస్టిక్యులర్ క్యాన్సర్ లక్షణమే. పొత్తికడుపు, గజ్జలు లేదా నడుములో నిరంతరం ఉండే నొప్పి తరచుగా వృషణం నుండి వ్యాపిస్తుంది. కణితి పెరిగినప్పుడు లేదా సమీపంలోని లింఫ్ నోడ్స్‌ను ప్రభావితం చేసినప్పుడు ఇది జరుగుతుంది. చాలామంది పురుషులు దీనిని జీర్ణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు.
ఈ లక్షణాలు కూడా
ఈ క్యాన్సర్ ఊపిరితిత్తులకు లేదా లింఫ్ నోడ్స్‌కు వ్యాపించినప్పుడు అలసట, ఆకస్మిక బరువు తగ్గడం, తీవ్రమైన నడుము నొప్పి, శ్వాస ఆడకపోవడం, దగ్గులో రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పైన చెప్పిన లక్షణాలలో ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన టెస్టులు చేయించుకోవాలి.

