- Home
- Life
- Blood poisoning: ఈ తెల్లని ఫుడ్స్ బ్లడ్ పాయిజన్ కు దారితీస్తాయి.. వీటిని తినకపోవడమే మంచిది..
Blood poisoning: ఈ తెల్లని ఫుడ్స్ బ్లడ్ పాయిజన్ కు దారితీస్తాయి.. వీటిని తినకపోవడమే మంచిది..
Blood poisoning: మనం తినే ఆహారం ద్వారా బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించినప్పుడు blood poisoning అవుతుంది. బ్లడ్ పాయిజనింగ్ ను వైద్య పరిభాషలో Septicemia అంటారు. అంటే బ్యాక్టీరియా రక్తాన్ని చేరుకోవడం ద్వారా.. అది ఇకపై స్వచ్ఛంగా (Purity) గా ఉండదు. ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. సెప్టిసేమియాను Sepsis అని కూడా పిలుస్తారు. ఇది శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేస్తుంది. ప్రతిచర్య జరిగినప్పుడు వాపుతో పాటుగా రక్తం గడ్డకట్టడం కూడా మొదలవుతుంది. ఇది తీవ్రమైన అస్వస్థతకు దారితీస్తుంది. రక్తం 'విషపూరితం' కావడానికి కారణమయ్యే 5 ఆహారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వెన్న (Butter).. వెన్నలో కొవ్వు మరియు సోడియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిని అతిగా తీసుకోవడం వల్ల రక్తం (Blood), గుండె (Heart)సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు ఇది కొలెస్ట్రాల్ (Cholesterol)ను కూడా పెంచుతుంది. అలాగే ఊబకాయాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి పాలతో చేసిన వెన్న వాడకాన్ని తగ్గించాలి.
sugar
చక్కెర (Sugar).. ఆహారంలో చక్కెర వాడకాన్ని తగ్గించాలని వైద్యులు చెబుతుంటారు. CDC ప్రకారం.. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. ఇది అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. అంతేకాదు.. ఇది రక్తాన్ని సరఫరా చేసే నాళాలను దెబ్బతీస్తుంది. ఇది మూత్రపిండాల వ్యాధి, స్ట్రోక్, గుండె జబ్బులు వంటి అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. అందుకే మీరు చక్కెరకు బదులుగా బెల్లం లేదా తేనెను ఉపయోగించండి. కానీ వీటి పరిమాణం కూడా తక్కువగా ఉండాలి.
పాల ఉత్పత్తులు (Dairy products).. జున్ను, పాలు వంటి పాల ఉత్పత్తుల్లో కూడా కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఎన్సీబీఐలో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. అధిక మొత్తంలో కొవ్వు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు (High blood pressure) ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
ఉప్పు (salt): ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్త సంబంధిత వ్యాధులు ఎక్కువ వస్తాయి. ఉప్పు శరీరంలోని నీటిని పెంచుతుంది. ఇది రక్తం యొక్క సిరలపై ఒత్తిడిని కలిగిస్తుంది. రక్తపోటు, మూత్రపిండాల సంబంధిత వ్యాధి ప్రమాదాలను కూడా పెంచుతుంది. అందుకే మీరు ఉప్పును ఉక్కువగా ఉపయోగించకండి. వైట్ సాల్ట్ కు బదులుగా సెంథా సాల్ట్ వాడాలి.
మైదా .. మైదా కూడా రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎక్కువ చేస్తుంది. అంతేకాదు ఇది రసాయన ప్రతిచర్యకు (Chemical reaction)దారితీస్తుంది. ఈ కారణంగా బ్లడ్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ పిండిని ఎక్కువగా ఉపయోగించకండి. సెప్సిస్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. జ్వరం, జలుబు, వేగంగా శ్వాస తీసుకోవడం, వేగంగా గుండె కొట్టుకోవడం, మైకము, గందరగోళం, వాంతులు , వికారం వంటివి దీని లక్షణాలు. ఇవన్నీ మీకు కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.