MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Uric Acid Symptoms: రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయిందని అర్థం

Uric Acid Symptoms: రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయిందని అర్థం

శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం యూరిక్ యాసిడ్. ఇది శరీరంలో అధికంగా పేరుకుపోతే ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయి. మీ శరీరంలో యూరిక్ ఆమ్లం అధికంగా ఉంటే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. అది కూడా రాత్రిపూటే అధికంగా ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 11 2025, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూరిక్ ఆమ్లం ఎక్కువైతే కనిపించే లక్షణాలు
Image Credit : Getty

యూరిక్ ఆమ్లం ఎక్కువైతే కనిపించే లక్షణాలు

యూరిక్ యాసిడ్ ప్రతి ఒక్కరి శరీరంలో విడుదలయ్యే ఒక ఆమ్లం. ఇది ప్యూరిన్ విచ్ఛిన్నం వల్ల ఏర్పడుతుంది. దీన్ని కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటికి పంపేస్తాయి. కానీ శరీరంలో అత్యధికంగా యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అయితే మూత్రపిండాలు దాన్ని ఫిల్టర్ చేయలేవు. అలాంటప్పుడు అది శరీరంలోనే పేరుకుపోతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతే కొన్ని లక్షణాల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రివేళల్లోనే లక్షణాలు కనిపిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కీళ్ల నొప్పులు
Image Credit : Getty

కీళ్ల నొప్పులు

రాత్రిపూట మీకు తరచూ కీళ్ల నొప్పులు వస్తూ ఉంటే తేలికగా తీసుకోకండి. మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉందనడానికి ఇది ఒక లక్షణమని చెప్పుకోవాలి. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు అది కీళ్లలో స్ఫటికాలుగా పేరుకుపోతుంది. దీని ఫలితంగా చీలమండ, మోచేతులు, మోకాళ్లలో నొప్పి వస్తుంది. అదీ ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. 

35
కీళ్ల గట్టిదనం
Image Credit : Getty

కీళ్ల గట్టిదనం

కీళ్లలో నొప్పి, వాపు, ఎరుపు, దురద ఇవన్నీ కూడా యూరిక్ యాసిడ్ శరీరంలో అధికంగా పేరుకుపోవడం వల్ల కనిపించే లక్షణాలు ఇవి. ఈ సమస్య ఉన్నవారు ఒకే పొజిషన్‌లో నిద్రపోకూడదు. అలా నిద్రపోతే  కీళ్లలో రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. అప్పుడు గట్టిదనం పెరుగుతుంది. తర్వాత ఉదయం లేచేటప్పుడు కాలు కదపలేనంత ఇబ్బంది కలుగుతుంది. ఈ వాపు, గట్టిదనం మోకాళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది.

45
తరచుగా మూత్రవిసర్జన
Image Credit : Freepik

తరచుగా మూత్రవిసర్జన

అధిక యూరిక్ యాసిడ్ వల్ల కిడ్నీలపై అధిక ఒత్తిడి పడుతుంది.  శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు మూత్రపిండాలు అదనంగా కష్టపడాలి. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.  ఆ సమయంలో మూత్రం చాలా తక్కువగానే వస్తుంది. 

55
చెమటలు పట్టడం
Image Credit : our own

చెమటలు పట్టడం

యూరిక్ యాసిడ్ వల్ల శరీరంలో పేరుకుపోత శరీరమంతా విపరీతంగా చెమటలు పడతాయి. వాపు, నిరంతర నొప్పి నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల రాత్రిళ్లు ఎలాంటి కారణం లేకుండా అసౌకర్యం, ఆందోళనగా అనిపిస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Recommended image3
Bangles Set: ఎంత చూసినా తనివితీరని యాంటిక్ గాజుల కలెక్షన్
Related Stories
Recommended image1
Uric Acid: ఈ సూపర్ ఫుడ్ తింటే.. యూరిక్ యాసిడ్‌ సమస్య దూరం..
Recommended image2
యూరిక్ యాసిడ్ ని కంట్రోల్ లో ఉంచాలా? ఇవి తాగితే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved