MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కీళ్ల నొప్పులతో నడవలేకపోతున్నారా? ఇదిగో వీటిని తినండి.. నొప్పులు ఫాస్ట్ గా తగ్గుతాయి..

కీళ్ల నొప్పులతో నడవలేకపోతున్నారా? ఇదిగో వీటిని తినండి.. నొప్పులు ఫాస్ట్ గా తగ్గుతాయి..

పెద్దవయసు వారిలో కీళ్ల నొప్పులు రావడం చాలా కామన్. కానీ ఈ నొప్పుల వల్ల నడవడం, కూర్చోవడం పడుకోవడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 13 2022, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

వయసు పెరుగుతున్న కొద్దీ ఎన్నో రోగాలు వస్తుంటాయి. అందులో కీళ్ల నొప్పులు ఒకటి. ఈ కీళ్ల నొప్పుల వల్ల ఏ పని చేయలేరు. అంతెందుకు సరిగ్గా కూర్చోవడానికి, నడవడానికి, నిలబడటానికి ఆఖరికి పడుకోవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ నొప్పులను తగ్గించుకోవడానికి ఎన్నో ముందులను వేసుకునే వారు చాలా మందే ఉన్నారు. ట్యాబ్లెట్స్ వల్ల అప్పటిమందం నొప్పులు తగ్గినా.. వాటిని వాడటం ఆపేసిన మరుక్షణం నుంచి నొప్పులు షురూ అవుతాయి. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు నొప్పులను తగ్గిస్తాయి. అంతేకాదు ఇవి మీ బరువును కూడా తగ్గించడానికి సహాయపడతాయి. కీళ్ల నొప్పులను తగ్గించి ఆర్థరైటిస్ పూర్తిగా తగ్గిపోయేందుకు ఎలాంటి ఆహరాలను తీసుకోవాలో తెలుసుకుందాం పదండి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిండెంట్, శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఒలియోకాంథాల్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఆలివ్ ఆయిల్ లో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆస్టియో ఆర్థరైసిట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలు ఉన్న వారు తినే వంటలు ఆలివ్ ఆయిల్ తో తయారుచేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 
 

38

బ్రోకలీ

ఇతర ఏ కూరగాయలో లేనటువంటి పోషకాలు ఒక్క బ్రోకలీలోనే పుష్కలంగా కనిపిస్తాయి. నిజానికి బ్రోకలీ మంటను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బ్రోకలీలో ఉండే ముఖ్యమైన పోషకాలు ఆర్థరైటిస్ లక్షణాలను, సంకేతాలను తగ్గిస్తాయి. బ్రోకలీలో సల్ఫోరాఫేన్ లాగా ఉండే ఒక పదార్థం రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య పెరగకుండా నిరోధిస్తుంది. 
 

48

అల్లం

అల్లం మంటకు కారణమయ్యే రసాయాలను శరీరం ఉత్పత్తి చేయకుండా నిరోధిస్తుంది. అల్లం సారం ఆర్థరైటిస్ సమస్యను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పచ్చి అల్లం లేదా శొంఠిని తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ లక్షణాలు తగ్గుతాయి. ఇది మంటను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

58

ఉల్లిపాయలు

ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్ క్వెర్సెటిన్, బయోఫ్లవనాయిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను తగ్గిస్తాయి. అంతేకాదు ఆర్థరైటిస్ కీళ్ల నొప్పుల నుంచి ఫ్రీరాడికల్స్ ను సమర్థవంతంగా తొలగిస్తాయి. ఉల్లి ప్రోటీన్లను విచ్చిన్నం చేసే ఎంజైమ్ల విడుదలను నియంత్రిస్తుంది. 
 

68

అరటి

అరటిపండులో విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే పొటాషియం ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు దీనిలో ఎముకలను ఆరోగ్యంగా ఉంచే యాంటీ కాల్సిపికేషన్ లక్షణాలు కూడా ఉంటాయి. 

78

వెల్లుల్లి

ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించేందుకు సహాయపడే శోథ నిరోధక లక్షణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఈ వెల్లుల్లి మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెల్లుల్లి ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంతో పాటుగా మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

88

కొవ్వు చేపలు

ట్యూనా, సాల్మన్ చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బలమైన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయని పలు పరిశోధనలో వెల్లడైంది. ఈ కొవ్వు చేపల్లో విటమిన్ డి కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. నిజానికి విటమిన్ డి తక్కువగా ఉండేవారికి కూడా ఆర్థరైటిస్ సమస్య వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 
  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Tulsi Plant: నాటకుండానే మీ ఇంట్లో తులసి మొక్క పెరిగిందా? ఇది దేనికి సంకేతమూ తెలుసా?
Recommended image2
Tulsi Plant Care : మీ ఇంటిముందు తులసి మొక్క వాడిపోతోందా? కేవలం 2 రూపాయల ఖర్చుతో మళ్లీ పచ్చగా మార్చేయండి
Recommended image3
Silver Earrings: సూది దారం స్టైల్ వెండి చెవిపోగులు.. ఓ లుక్కేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved