MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Tulsi Plant Care : మీ ఇంటిముందు తులసి మొక్క వాడిపోతోందా? కేవలం 2 రూపాయల ఖర్చుతో మళ్లీ పచ్చగా మార్చేయండి

Tulsi Plant Care : మీ ఇంటిముందు తులసి మొక్క వాడిపోతోందా? కేవలం 2 రూపాయల ఖర్చుతో మళ్లీ పచ్చగా మార్చేయండి

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో తులసి కోటను పెట్టి రోజూ పూజలు చేస్తారు. కానీ వేసవి రాగానే చాలా ఇళ్లలో తులసి మొక్క ఎండిపోతుంది. అయితే కేవలం రూ.2 ఖర్చుతో తులసి మొక్కను మళ్లీ పచ్చగా మార్చుకోవచ్చు.

1 Min read
Author : Arun Kumar P
| Updated : May 26 2026, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ ఎండల్లో మీ తులసి మొక్కను కాపాడుకునే చిట్కాలు..
Image Credit : Gemini AI

ఈ ఎండల్లో మీ తులసి మొక్కను కాపాడుకునే చిట్కాలు..

ఎండాకాలంలో సాధారణంగానే మొక్కలు వాడిపోతుంటాయి… ఇక మే, జూన్ నెలల్లో ఎండ తీవ్రత, వేడి గాలులు ఎక్కువ కావడంతో ఎండిపోతుంటాయి. ఇలా సున్నితమైన తులసి మొక్కలు కూడా వాడిపోవడం, ఎండిపోవడం జరుగుతాయి. ఆకులు పసుపు రంగులోకి మారి మొక్క బలహీనపడుతుంది.. కొన్నిసార్లు పూర్తిగా చనిపోయినట్లు కనిపిస్తుంది.

అయితే హిందువులు ఇంటిముందు పెట్టి పూజించే తులసి మొక్క ఎండిపోవడాన్ని అశుభంగా భావిస్తారు. అందుకే చాలామంది ఎండల్లో ఈ మొక్కను బ్రతికించుకునేందుకు ఖరీదైన ఎరువులు, రసాయనాలు వాడుతుంటారు. కానీ ఎలాంటి రసాయానాలు వాడకుండానే ఇంట్లోని వస్తువులతోనే తులసి మొక్కను మళ్లీ పచ్చగా మార్చవచ్చు. ఈ సింపుల్ ట్రిక్ ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కేవలం రూ.2 ఖర్చుతో తులసిమొక్క సేఫ్..
Image Credit : Gemini AI

కేవలం రూ.2 ఖర్చుతో తులసిమొక్క సేఫ్..

ఒక గిన్నెలో అర లీటరు నీళ్లు తీసుకోండి. దానికి కొద్దిగా కాఫీ పొడి, అర టీస్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలపండి. ఈ మిశ్రమాన్ని తులసి మొక్క వేర్ల దగ్గర మట్టిలో నెమ్మదిగా పోయాలి. ఇలా చేశారో మీ తులసిమొక్క మునుపటిలా పచ్చగా మారుతుంది. 

 కాఫీ పొడిలోని నైట్రోజన్ మట్టికి పోషకాలను ఇస్తుంది… దీంతో తులసిమొక్క బలంగా మారుతుంది. ఇక ఎప్సమ్ సాల్ట్‌లోని మెగ్నీషియం, సల్ఫేట్ ఆకులు పచ్చగా మారడానికి సాయపడతాయి. ఇది ఎండకు దెబ్బతిన్న మొక్కలకు టానిక్‌లా పనిచేస్తుంది.

Related Articles

Related image1
Tulsi Water: ప్రతిరోజూ తులసి నీళ్లు తాగితే మన శరీరంలో వచ్చే మార్పులు ఇవే
Related image2
Tulsi Plant: తులసి మొక్క పచ్చగా చిగురించాలంటే వారానికి ఒక్కసారి ఈ పొడి చల్లండి చాలు!
34
కాఫీ పొడి, ఎప్సమ్ సాల్ట్ తో తులసిమొక్కకు పనరుజ్జీవం..
Image Credit : AI Image

కాఫీ పొడి, ఎప్సమ్ సాల్ట్ తో తులసిమొక్కకు పనరుజ్జీవం..

మధ్యాహ్నం ఎండలో ఈ మిశ్రమాన్ని తులసిచెట్టుకు వేయరాదు. ఉదయం లేదా సాయంత్రం వేయడం మంచిది. మట్టిని కొద్దిగా గుల్లగా చేశాకే ఈ ద్రావణాన్ని పోయాలి. ఆ తర్వాత మొక్కను నేరుగా ఎండలో కాకుండా, కొద్దిగా నీడ ఉన్న చోట ఉంచండి. నీళ్లు ఎక్కువగా పోయొద్దు, మట్టిలో తేమ ఉంటే చాలు.

44
తులసిమొక్కకు కొత్తచిగుళ్లు..
Image Credit : chat GPT

తులసిమొక్కకు కొత్తచిగుళ్లు..

ఇలా వారానికి ఒకసారి చేస్తే, కొన్ని రోజుల్లోనే తులసి మొక్కకు కొత్త చిగుళ్లు వస్తాయి. ఎండాకాలంలో కూడా తులసిమొక్క వాడిపోకుండా పచ్చగా ఉంటుంది… ఇంటిముందు అందంగా కనిపిస్తుంటుంది. ఇలా ఖరీదైన ఎరువులు కొనాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో దొరికే వాటితోనే మీ తులసి మొక్కను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు..  ఎలాంటి అశుభ సంకేతాలు లేకుండా జాగ్రత్తపడవచ్చు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తోటపని
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
Recommended image2
వాషింగ్ మెషీన్లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ 7 తప్పులు చేస్తే మెషీన్ పోతుంది
Recommended image3
Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!
Related Stories
Recommended image1
Tulsi Water: ప్రతిరోజూ తులసి నీళ్లు తాగితే మన శరీరంలో వచ్చే మార్పులు ఇవే
Recommended image2
Tulsi Plant: తులసి మొక్క పచ్చగా చిగురించాలంటే వారానికి ఒక్కసారి ఈ పొడి చల్లండి చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved