MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • పనీర్ అంటే ఎంత ఇష్టమున్నా.. వీళ్లు మాత్రం దీన్ని అసలే తినకూడదు.. తింటే గుండెపోటు, అలెర్జీ వంటి సమస్యలొస్తయ్..

పనీర్ అంటే ఎంత ఇష్టమున్నా.. వీళ్లు మాత్రం దీన్ని అసలే తినకూడదు.. తింటే గుండెపోటు, అలెర్జీ వంటి సమస్యలొస్తయ్..

మాంసాహారులైనా.. శాఖాహారులైనా పనీర్ ను ఇష్టంగా తింటుంటారు. నిజానికి పనీర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. కానీ కొంతమంది మాత్రం పనీర్ ను అస్సలు తినకూడదు.. తింటే ఈ సమస్యలు వస్తాయి..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 13 2022, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇంట్లో పండుగైనా.. పార్టీ అయినా పక్కాగా పనీర్ తో చేసిన వంటకాలు గుమగుమలాడుతుంటాయి. పనీర్ తో చేసిన ఎలాంటి వంటకమైనా ఎంతో టేస్టీగా అవుతుంది. పనీర్ లో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫాస్పరస్,  కాల్షియం, ఫైబర్లు కూడా ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. పనీర్ ను తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. పనీర్ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం దీనిని తినకపోవడమే మంచిది. పనీర్ ను ఎవరెవరు తినకూడదు? ఎందుకు తినకూడదో తెలుసుకుందాం పందండి.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డయేరియా

పనీర్ లో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ ప్రోటీన్ శరీరంలో ఎక్కువైతే  వాంతులు, విరేచనాలు అవుతాయి. అందులోనూ మీకు అప్పటికే విరేచనాల సమస్య ఉంటే.. ఆ సమయంలో జున్ను తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది సమస్యను మరింత పెంచుతుంది. అందుకే మోషన్స్ పెట్టినప్పుడు మర్చిపోయి కూడా పనీర్ ను తినకండి. 
 

36

రక్తపోటు

అధిక రక్తపోటు సమస్య  ఉంటే కూడా పనీర్ ను తినకూడదు. ఎందుకంటే దీనివల్ల రక్తపోటు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

46

అలెర్జీలు

ఒక వేళ మీకు పాలు గానీ.. పాల ఉత్పత్తులను  వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉందా? అయితే మీరు పనీర్ ను తినకపోవడమే మంచిది. ఎందుకంటే పనీర్ ను తింటే కూడా అలెర్జీ సమస్య వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

56

గుండె జబ్బులు

పనీర్ లో కొవ్వు పరిమాణం ఎక్కువుంటుంది. దీనిని ఎక్కువ మొత్తంలో తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీనివల్ల గుండె పోటు, స్ట్రోక్ వంటి గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 
 

66

జీర్ణ సమస్యలు

ఇప్పటికే మీకు ఎసిడిటీ, మలబద్దకం, గ్యాస్ వంటి జీర్ణక్రియ సమస్యలు ఉన్నట్టైతే పనీర్ ను తినడం మానేయండి. ముఖ్యంగా వీళ్లు రాత్రి సమయంలో పనీర్ ను అసలే తినకూడదు. ఒకవ వేళ తింటే అజీర్థి, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Coconut: కొబ్బ‌రికాయ‌లోకి నీరు ఎలా వ‌స్తుంది.? అంత తియ్య‌గా ఎందుకుంటాయి
Recommended image2
Dishwasher: గిన్నెలు తోమేందుకు తక్కువ ధరలో చిన్న డిష్ వాషర్.. ఇది కిచెన్ ప్లాట్‌ఫారంపై పట్టేస్తుంది
Recommended image3
Fashion: పార్టీలకు తమన్నాలా ఇలాంటి డ్రెస్సులు వేస్తే అదరహో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved