జాగ్రత్త.. వీళ్లు సైకిల్ ను ఎట్టిపరిస్థిలో తొక్కకూడదు..
ఒకప్పుడు సైకిల్ లేని ఇల్లు ఉండేది కాదు. ఇప్పుడు చూద్దామన్నా సైకిల్ కనిపించడం లేదు. కానీ సైకిల్ తొక్కడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం. వ్యాయామంతోనే శరీరం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ బిజీ లైఫ్ కారణంగా జిమ్ముల్లోకి వెళ్లి ఎక్సర్ సైజ్లు చేసేంత సమయం లేని వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు ఒక అరగంటైనా సైక్లింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న పనులను బయటకు వెళ్లేవారు, దగ్గరలో ఉన్న షాపుకు వెళ్లేవారు సైకిల్ పై వెళ్లడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. ఈ సైక్లింగ్ అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందా? అంటే ఉండదనే చెప్పాలి. కొందరు పొరపాటున కూడా సైకిల్ ను తొక్కకూడదంటాన్నారు ఆరోగ్య నిపుణులు.
సైక్లింగ్ ప్రయోజనాలు
గుండెకు ప్రయోజనకరంగా ఉంటుంది
ప్రతిరోజూ అరగంట అయినా సైకిల్ తొక్కడం వల్ల గుండె ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. స్లైక్లింగ్ అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. దీంతో గుండె పోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
బరువు తగ్గడం
సైక్లింగ్ బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్లైకింగ్ తొక్కడం వల్ల తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వు చాలా వరకు కరిగిపోతుంది. నడుము సైజు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా సైక్లింగ్ వల్ల కాళ్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఖచ్చితంగా బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.
మెదడు పదును అవుతుంది
సైక్లింగ్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రెగ్యులర్ గా సైకిల్ తొక్కడం వల్ల ఒత్తిడి, ఆంధోళన, డిప్రెసన్ వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. స్లైక్లింగ్ వల్ల హిప్పోకాంపస్ లో కణాలు ఏర్పడుతాయి. ఇవి మీ జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడతాయి. అలాగే కండరాలను బలంగా చేస్తాయి.
ఎవరు సైకిల్ తొక్కకూడదు
ఈ రోజుల్లో కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. కానీ కీళ్ల నొప్పులు ఉన్నవారు సైకిల్ అసలే తొక్కకూడదు. ఒక వేళ తొక్కితే సమస్య ఎక్కువవుతుంది. ఎందుకంటే సైకిల్ తొక్కుతున్నప్పుడు గాలిని పీల్చి వదిలినప్పుడు మీ హృదయ స్పందన రేటు పెరిగిపోతుంది. ఇది ఆస్తమాకు దారితీస్తుంది.