MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pressure Cooker: ప్రెషర్ కుక్కర్‌లో ఈ పదార్థాలు వండకూడదు... అయినా ఎంతో మంది వండేస్తున్నారు

Pressure Cooker: ప్రెషర్ కుక్కర్‌లో ఈ పదార్థాలు వండకూడదు... అయినా ఎంతో మంది వండేస్తున్నారు

Pressure Cooker: వంట త్వరగా అయిపోవాలని చాలామంది ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారు. కొందరు అన్ని రకాల వంటకాలు ప్రెషర్ కుక్కర్లో వండేస్తారు. కానీ, కొన్ని రకాల ఆహార పదార్థాలను కుక్కర్‌లో వండటం మంచిది కాదు.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 03 2026, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పాస్తా, మ్యాకరోనీ
Image Credit : Pixabay

పాస్తా, మ్యాకరోనీ

ప్రెషర్ కుక్కర్లో సులువుగా అయిపోతుందని చాలా మంది పాస్తా లేదా మ్యాకరోనీ వండేస్తుంటారు. కుక్కర్‌లో వండితే అవి మరీ మెత్తగా అయిపోతాయి. వీటిలో ఉండే స్టార్చ్ వల్ల నురగ వచ్చి కుక్కర్ వాల్వ్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే పాస్తాను ఎప్పుడూ విడిగా గిన్నెలో నీళ్లు మరిగించి వండుకోవడం మంచిది.

అన్నం

ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండే వారి సంఖ్య చాలా ఎక్కువ. నిజానికి ప్రెషర్ కుక్కర్లో అన్నం వండడం మంచిది కాదు. విడిగా గిన్నెలో వండి గంజి వార్చడం వల్ల అన్నంలోని అదనపు స్టార్చ్ పోతుంది. కుక్కర్‌లో వండితే అన్నం మరీ మెత్తగా ముద్దలా మారే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పాలతో చేసే వంటకాలు
Image Credit : Pixabay

పాలతో చేసే వంటకాలు

పాలు మరగబెట్టడం, పాయసం లాంటివి ప్రెషర్ కుక్కర్‌లో చాలా మంది చేసేస్తూ ఉంటారు. కానీ అవి వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలు పొంగి కుక్కర్ వాల్వ్ లేదా విజిల్ దగ్గర ఇరుక్కుపోతాయి. దీనివల్ల ప్రెషర్ బయటకు రాక ప్రమాదం జరగొచ్చు. ఇలాంటివి మందపాటి గిన్నెలో వండుకోవడమే అన్ని విధాలా మంచిది

ఆకుకూరలు

ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే పాలకూర, మెంతికూర లాంటి ఆకుకూరలను కుక్కర్లో వండడం పద్ధతి కాదు. వాటిని ఎక్కువ వేడి మీద వండితే వాటి రంగు, రుచి మారిపోతాయి. పోషకాలు కూడా నశిస్తాయి. అందుకే ఆకుకూరలను తక్కువ సమయంలో ఉడికించడం లేదా ఫ్రై చేసుకోవడం మంచిది.

33
టమాటా, పులుపు పదార్థాలు
Image Credit : Pixabay

టమాటా, పులుపు పదార్థాలు

ప్రెషర్ కుక్కర్లో టమాటా, చింతపండు లాంటి పుల్లటి పదార్థాలు వండకూడదు. అల్యూమినియం కుక్కర్‌లో ఎక్కువసేపు వీటిని వండితే, ఆ లోహంతో రియాక్షన్ జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి వంటకాలకు స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా వేరే గిన్నెలు వాడటం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Upma rava Vs Idli Rava: ఉప్మా రవ్వకు ఇడ్లీ రవ్వకు మధ్య తేడా ఏంటి? వీటిని దేనితో తయారుచేస్తారో తెలుసా?
Recommended image2
Biryani Pickle: ఈ పచ్చడి అన్నంలో కలిపి తింటే బిర్యానీలా ఉంటుంది.. ఎక్కడ దొరుకుతుందంటే..!
Recommended image3
Necklace Designs: లైట్ వెయిట్ లో వచ్చే నెక్లెస్ లు.. ఎంత బాగున్నాయో!
Related Stories
Recommended image1
Broccoli Dosa: పిల్లల కోసం హెల్తీ, క్రిస్పీ బ్రొకోలీ దోశ రెసిపీ... ఒక్కసారి తింటే వదల్లేరు
Recommended image2
Upma rava Vs Idli Rava: ఉప్మా రవ్వకు ఇడ్లీ రవ్వకు మధ్య తేడా ఏంటి? వీటిని దేనితో తయారుచేస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved