గుండె జబ్బులు రాకూడదంటే.. ఈ పండ్లను, కూరగాయలను రోజూ తినాల్సిందే..!
పోషకాహారం తీసుకుంటేనే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఆరోగ్యకరమైన ఆహారమే కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలంటే..

మన దేశంలో రోజు రోజుకు హార్ట్ పేషెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చెడు లైఫ్ స్టైలే దీనికి ప్రధాన కారణం. అయితే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి..
క్యాబేజీ
క్యాబేజీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో క్యాబేజీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ సి, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, సోడియం, ఐరన్ వంటి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
ఆపిల్
రోజూకు ఒక ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదనే మాట అందరికీ తెలుసు. ఈ పండులో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి1,విటమిన్ బి2 విటమిన్ ఇ, విటమిన్ కె వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
బ్రోకలి
బ్రోకలీలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ఇతర ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా అవసరం. ఎందుకంటే ఇవి గుండెపనితీరును మెరుగుపరుస్తాయి. అందుకే దీన్ని కూడా మా రోజు వారి ఆహారంలో చేర్చుకోండి.
టమాటాలు
టమాటాలో ఎన్నో ఔషదగుణాలున్నాయి. దీనిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అందుకే టమాటాలను రోజూ తినండి.
ఆరెంజ్
సిట్రస్ పండ్లలో ఒకటైన ఆరెంజ్ లో విటమిన్ సి కి కొదవే ఉండదు. దీనిలో ఫైబర్ కంటెంట్ , యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.
స్ట్రాబెర్రీ
హార్ట్ షేప్ లో ఉండే స్ట్రాబెర్రీల్లో ఎన్నో ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. వీటిలో విటమిన్లతో పాటుగా ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే వీటిని మీ రోజ వారి ఆహారంలో చేర్చండి.
బీట్ రూట్
బీట్ రూట్ ను ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు. వీటిలో ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో పోషకాలుంటాయి. బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
avocado
అవొకాడో
అవొకాడోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. రోజూ ఒక అవొకాడోను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.