Avoid Reheating: ఈ ఆహారాలను వేడి చేసి అస్సలు తినకూడదు.. తింటే మీ పని అంతే ఇక..
Avoid Reheating: కొన్ని రకాల ఆహార పదార్థాలను వేడి చేసి తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్రిజ్ లో పెట్టి వాటిని వేడి చేసి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Avoid Reheating: కొంతమందికి మిగిలిపోయిన ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసుకునే తినే అలవాటు ఉంటుంది. అందులోనూ ఒకేసారి ఎక్కువగా వండేసి కొంతమొత్తాన్ని ఫ్రిజ్ లో పెట్టేసి.. మళ్లీ వాటిని సాయంత్రం పూట వేడి చేసుకుని తినేస్తుంటారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
ఫ్రిజ్ లో పెట్టిన ఆహార పదార్థాలను అస్సలు వేడి చేయకూడదు. ఏయే ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తర్వాత వేడి చేసి తినకూడదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
గుడ్లు: ఉడకబెట్టిన గుడ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచకూడదు. ఉడకబెట్టిన గుడ్లను అప్పటికప్పుడే లేదా కొంత సమయం తర్వాతనన్నా తినేయాలి. కానీ మార్నింగ్ ఉడకబెట్టిన గుడ్లను మధ్యాహ్నమో లేకపోతే సాయంత్రమో తినడం చేస్తే మీ ఆరోగ్యాన్ని మీ చేతులారా నాశనం చేసుకున్నవారవుతారు. ఇలా తింటే ప్రమాదరకమైన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే గుడ్డును మళ్లీ హీట్ చేయడం వల్ల అందులో ఉండే ప్రోటీన్ల నుంచి క్యాన్సర్ కారకమైన carcinogenic పుట్టుకొస్తుందట. కాబట్టి గుడ్డును ఎప్పుడూ వేడి చేయకండి.
అన్నం: చాలా మందికి అన్నాన్ని వేడి చేసుకుని తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అన్నాన్ని రాత్రి పూటనే ఎక్కువగా వేడిచేసుకుని తింటుంటారు. అన్నాన్ని మళ్లీ వేడిచేసుకుని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందని Food Standards Agency పేర్కొంటోంది.
చికెన్: ఆదివారాలు వస్తే చాలు ప్రతి ఇంట్లో చికెన్ స్మెల్ గుమగుమలాడుతూ వస్తుంటుంది. అయితే చికెన్ మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కాగా ఫ్రిజ్ లో పెట్టిన కోడి కూరను మళ్లీ వేడి చేయడం వల్ల అందులో ఉండే ప్రోటీన్లు వేరే రూపాన్ని దాల్చుతాయి. ముఖ్యంగా చికెన్ ను బాగా ఉడికించపోతే అందులో బ్యాక్టీరియా అలాగే ఉంటుందట. దీనివల్ల దీన్ని వేడిచేయడం ద్వారా అందులో ఉండే బ్యాక్టీరియా అంతా చికెన్ న్ను పాడుచేస్తుంది. దాన్ని తినడం వల్ల మనకు జబ్బు చేస్తుంది.
ఆలుగడ్డలు: ఆలుగడ్డల్లో మిటమిన్ B6,C, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అయితే బంగాళ దుంపల కూరను రీ హీట్ చేస్తే అందులో బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాదు ఈ బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి హానీ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కూరగాయలు: ఏ కూరగాయలతో కూర వండినా.. అది చల్లబడ్డాక మళ్లీ వేడి చేయకూడదు. అందులో క్యారెట్ కూరను అస్సలు వేడి చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వన్స్ చల్లబడిన కూరలను వేడి చేస్తే వాటిల్లో ఉండే నైట్రేట్ nitrosamine గా మారి జీర్ణాశయ సమస్యలు తలెత్తుతాయి.
కాబట్టి మీకు అవసరమైనంత మేరకే కూరలను వండుకుని తినండి. ఒకవేళ అది మిగిలిపోతే అలాగే తినండి. కానీ ఫ్రిజ్ లో పెట్టి మళ్లీ దాన్నీ రీ హీట్ చేసి మాత్రం తినకండి.