ఈ ఆహారాలు కొలెస్ట్రాల్ కు బద్ద శత్రువులు.. వీటిని తింటే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే.. గుండెపోటు నుంచి డయాబెటీస్ వరకు ఎన్నో ప్రాణాంతకరోగాలొచ్చే అవకాశం ఉంది. అందుకే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

cholesterol
మన రక్తంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి మంచిది. రెండోది చెడుది. మన శరీరానికి మంచి కొలెస్ట్రాల్ చాలా అవసరం. ఇది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అదే చెడు కొలెస్ట్రాల్ అయితే ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అందుకే దీన్ని నిశ్శబ్ద కిల్లర్ అని కూడా అంటారు. దీనివల్లే ఎంతో మంది గుండెపోటుతో మరణిస్తున్నారు.
cholesterol
మన శరీరంలోని ప్రతి కణంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో, హార్మోన్లను తయారుచేయడంలో, విటమిన్ డిని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అయితే మన శరీరం దీన్ని ఆహారం ద్వారే ఉత్పత్తి చేస్తుంది.
మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎంత ఉండాలి
మన శరీరంలో ఎంత కొలెస్ట్రాల్ ఉందో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఎల్డిఎల్ (చెడు కొలెస్ట్రాల్) లెవెల్స్ 100 కంటే తక్కువగా ఉంటే ఎలాంటి భయం అక్కర్లేదు. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. అయితే గుండె జబ్బులు ఉన్నవారికి మాత్రం ఈ స్థాయిలు ప్రమాదకరం. అయితే కొన్ని ఆహారాలను తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి..
బార్లీ: బార్లీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారికి. ఎందుకంటే వీటిలో సోలబుల్ ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను ఫాస్ట్ గా తగ్గిస్తుంది.
వంకాయ: వంకాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ కూరగాయలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు వీటిని తరచుగా తినాలి.
ఫ్యాటీ ఫిష్: కొవ్వు చేపలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వీటిద్వారా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. తున ఫిష్, సాల్మన్ వంటి చేపట్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
ఆపిల్స్: రోజుకో ఆపిల్ పండును తింటే ఎన్నో రోగాల ప్రమాదం తగ్గుతుంది. అందులో కొలెస్ట్రాల్ ఒకటి. దీన్ని తినడం వల్ల రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గడం మొదలవుతుంది. ఎందుకంటే దీనిలో కొలెస్ట్రాల్ ను కరిగించే పెక్టిన్ అనే ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
వాల్ నట్స్: వాల్ నట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. బాదం, పల్లీలు వంటి నట్స్ ను తిన్నా కొలెస్ట్రాల్ ఫాస్ట్ గా కరిగిపోతుంది.
ఉల్లిపాయ: ఉల్లి కూడా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఉల్లిలో ఉండే ప్రత్యేకమైన ఫెవనాయిడ్లు ధమనుల్లో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇకపోతే ఉల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేలా చేస్తాయి.
వీటితో పాటుగా ఓట్స్, చిక్కుళ్లు, గ్రీన్ టీ, ఓక్రా, సోయా ఆధారిత ఆహారం, తృణధాన్యాలు వంటి ఆహారాలు కూడా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.