ఉల్లిపాయ నుంచి పెరుగు వరకు.. మధుమేహులకు ఈ ఆహారాలు చాలా మంచివి..
డయాబెటీస్ పెషెంట్లు పిండి పదార్థాలు తక్కువగా.. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే వాటినే తినాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ఛాన్స్ ఉంది.

నేడు ఎంతో మంది టైప్ 2 డయాబెటీస్ తో బాధపడున్నారు. గతితప్పిన లైఫ్ స్టైల్ యే దీనికి కారణం. డయాబెటీస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. టైం కు నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. డాక్టర్లు చెప్పినట్టు మందులు వాడాలి. మానసిక స్థితి బాగుండేలా చూసుకోవాలి.
diabetes diet
మధుమేహాన్ని నియంత్రించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. అయితే మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే పిండి పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. పోషకాహారం ఎక్కువగా తినాలి. అలాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) ఉన్న ఆహారాలనే ఎంచుకోవాలి. అయితే మధుమేహుల ఆరోగ్యానికి ఏయే ఆహారాలు మంచివో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉల్లిగడ్డ
ఉల్లిగడ్డలు ఒక్క మధుమేహులకే కాదు ఇతరుల ఆరోగ్యానికి కూడా మంచివి. ఉల్లిపాయల్లో 'అల్లియం సెపా' ఉంటుంది. ఇది మధుమేహుల రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
బచ్చలికూర
బచ్చలికూరలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు బచ్చలికూరలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్న బచ్చలికూర మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన ఆహారం.
బ్రోకలి
బ్రోకలీ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్లు వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అందుకే మధుమేహులు బ్రోకలీని తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బెర్రీలు
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ పండలను షుగర్ పేషెంట్లు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా తినొచ్చు. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయ. వీటిలో ఉండే సమ్మేళనాలు మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. దాల్చిన చెక్క నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీనిని బరువు తగ్గేందుకు కూడా ఉపయోగిస్తారు.
papaya
బొప్పాయి
బొప్పాయి మధుమేహులు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఏపూటైనా తినేయొచ్చు. ఎందుకంటే ఈ పండును తినడం వల్ల వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. బొప్పాయిని జ్యూస్ గా తాగడం వల్ల కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
టమాటాలు
టమాటాలు బరువును తగ్గించడం నుంచి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం వరకు ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటాయి. టమాటాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) 30 ఉంటుంది. అందుకే టమాటాలను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినగలిగే ఉత్తమ ఆహారం అంటారు. టమోటాలు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
కివి
కివిల్లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీర శక్తి స్థాయిలను కూడా పెంచుతుంది. ఈ పండు మధుమేహులకు ఔషదంతో సమానం. ఎందుకంటే కివి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి.