- Home
- Life
- రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా? వీటిని తింటే.. ఇలా పడుకోగానే.. అలా నిద్రలోకి జారుకుంటారు తెలుసా..
రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా? వీటిని తింటే.. ఇలా పడుకోగానే.. అలా నిద్రలోకి జారుకుంటారు తెలుసా..
కొందరు బెడ్ పై ఇలా ఒరగగానే అలా నిద్రలోకి జారుకుంటుంటారు. ఇంకొంతమంది బెడ్ పై అటు ఇటూ దొర్లుతూ ఎప్పుడో అర్థరాత్రికి నిద్రపోతారు. కంటినిండా నిద్రలేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

మనం ఆయురారోగ్యాలతో ఉండాలంటే ఖచ్చితంగా 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలంటారు నిపుణులు. మీకు తెలుసా.. నిద్రలోనే మనకున్న రోగం సగం తగ్గిపోతుందట. అందుకే హెల్త్ బాలేనప్పుడు ఎక్కువ విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు సలహానిస్తుంటారు. మనం నిద్రపోతున్నపుడు మన శరీరం ఎన్నో విధులను నిర్వర్తిస్తుంది. నిద్రతోనే శరీరం శక్తివంతంగా తయారవుతుంది. అందుకే మన ఆరోగ్యానికి నిద్ర అవసరం కాదు.. అత్యవసరం.
పొట్టలో ఖాళీ లేకుండా తినడం, ఒత్తిడి, ఆందోళన వంటి ఇతర కారణాల వల్ల కూడా నిద్రపోవడానికి ఇబ్బంది కలుతుంది. అయితే రాత్రిపూట జంక్ ఫుడ్ ను తినేవారున్నారు. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. కెఫిన్ కూడా అంతే. కెఫిన్ మెదడును చురుగ్గా చేస్తుంది. దీంతో నిద్ర అసలే పట్టదు. ఇక జంక్ ఫుడ్ రాత్రిళ్లు సరిగ్గా అరగదు. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే రాత్రిళ్లు వీటి జోలికి వెల్లకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు మీరు రాత్రిపూట హాయిగా, ప్రశాంతంగా పడుకోవడానికి సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి..
గోరు వెచ్చని పాలు
గ్లాస్ గోరు వెచ్చని పాలలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. హాయిగా నిద్రపోవడానికి కూడా సహాయపడతాయి. ముఖ్యంగా వృద్ధులు ప్రతిరోజూ పడుకునే ముందు గ్లాస్ గోరువెచ్చని పాలను తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాలలో ఉండే ఆమైనో ఆమ్లం సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో వీరు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోతారు.
డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ మీ జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాదు.. మీరు హాయిగా నిద్రపోవడానికి కూడా సహాయపడతాయి. అందుకే రాత్రి భోజనం తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ ను తినాలని నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పులు, బాదం, వాల్ నట్స్ మీరు ప్రశాంతంగా పడుకోవడానికి సహాయపడతాయి.
chamomile tea
చామంతి టీ
చామంతి టీ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ చామంతి టీ శరీరాన్ని రిలాక్స్ చేస్తుందని ఎన్నో పరిశోధనలు తెలిపాయి. ఈ టీ ఒత్తిడిని నుంచి ఉపశమనం పొందడానికి కూడా సహాయపడుతుంది. రాత్రిళ్లు దీన్ని తాగడం వల్ల మీరు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోతారు.
అల్లం, తులసి నీరు
ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని తులసి ఆకులను నీటిలో బాగా మరిగిస్తే.. తులసి, అల్లం నీరు రెడీ అయినట్టే. ఈ పానీయాన్ని తాగడం వల్ల జీర్ణక్రియ కు ఎలాంటి అంతరాయం కలగదు. అలాగే ఈ పానీయం మీరు ప్రశాంతంగా పడుకోవడానికి కూడా సహాయపడుతుంది.