తినడం, తాగడం, వంట అలవాట్లు రొమ్ము క్యాన్సర్ వచ్చేలా చేస్తాయి.. జర జాగ్రత్త..
పలు అధ్యయనాల ప్రకారం.. మనం ఫుడ్ హాబిట్స్, డ్రింకింగ్, వంట చేసే పద్దతులు కూడా క్యాన్సర్ బారిన పడేలా చేస్తాయని వెల్లడిస్తున్నాయి.

రొమ్ము క్యాన్సర్ ప్రాణాంతక జబ్బు. దీన్ని స్టార్టింగ్ లోనే గుర్తిస్తే ఎలాంటి అనర్థం జరగదు. రోగం ముదిరి పోయాక గుర్తిస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ రొమ్ము క్యాన్సర్ పురుషులకు కూడా వచ్చినా.. వీళ్లతో పోల్చిచే ఆడవారికే ఎక్కువగా వస్తుంది. అందులోనూ ప్రస్తుత కాలంలో రొమ్ముక్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
పలు అధ్యయనాల ప్రకారం.. బ్రెస్ట్ క్యాన్సర్ ను నిరోధించే లేదా కలిగించే నిర్ధష్ట ఆహారం అంటూ ఏది లేదు. అయినప్పటికీ.. మీరు తినే విధానం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సరైన ఆహారం తింటే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రొమ్ము క్యాన్సర్ బారిన పడేసే ఆహరపు అలవాట్లేంటో తెలుసుకుందాం పదండి..
రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఉన్నవారికి ఆరోగ్యకరమైన ఆహారం
లీన్ ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలను, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను అసలే తినకూడదు.
మొక్కల ఆధారిత ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీప్రొలిఫెరేటివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు డిఎన్ఎ నష్టాన్ని కూడా తగ్గిస్తాయి. దీంతో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
పండ్లు, కూరగాయలు, ఆలివ్ ఆయిల్ లేదా చేపనూనె వంటి పాలీ అనాశ్చురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉన్న అధిక ఫైబర్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి ఫుడ్స్ ఈస్ట్రోజెన్, ఇన్సులిన్ వంటి హార్మోన్లను తగ్గిస్తాయి. ఇవి మంటను కలిగించే ఇతర కారకాలను కూడా తగ్గిస్తాయి.
ఆల్కహాల్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది
ఆల్కహాల్ ను ఎక్కువ తాగేవారికి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం.. మద్యం ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది. ఇది రొమ్ము కణజాలం పెరుగుదలకు దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ , యుఎస్ ప్రకారం.. తేలిక పాటి మద్యం తాగేవారికి రొమ్ము క్యాన్సర్ ప్రమాదం కొద్దిగా పెరుగుతుందని వెల్లడించింది. మితంగా తాగేవారికి ఈ ప్రమాదం 1.23 రెట్లు ఎక్కువగా ఉంటే.. విచ్చలవిడిగా తాగేవారికి 1.6 శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వారానికి మూడు లేదా అంతకంటే తక్కువ సార్లు మద్యాన్ని తాగాలని వైద్యులు చెబుతున్నారు.
కొన్ని వంట పద్దతులు కూడా డేంజరే..
ఆహారాలను వండే విధానం కూడా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం.. మాంసం, పౌల్ట్రీ, చేపలను కాల్చి వండుకుని తింటే వాటిలో హెటిరోసైక్లిక్ అమైన్లు లేదా హెచ్ సీఎలు ఏర్పడతాయి. ఇవి క్యాన్సర్ కు దారితీస్తాయి. అందుకే వీటిని కాల్చడానికి బదులుగా ప్రోటీన్లు పోకుండా.. మోతాదు మంటపై ఉడికించి తినండి.
breast cancer
బరువు పెరిగే రొమ్ముక్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందా..?
బరువు పెరిగితే గుండె పోటు, స్ట్రోక్, వంటి గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి సమస్యలే కాదు.. రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి.
ఆహారం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుందా? అనే శీర్షికతో 2004 లో జరిగిన ఒక అధ్యయన ప్రకారం.. బరువు పెరగడం వల్ల రొమ్ము క్యాన్సర్ రిస్క్ ప్రమాదం పెరుగుతుంది. బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమెటిక్ గా రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
వ్యాయామం చేయడం
వ్యాయామం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. బరువు ఎక్కువున్న వాళ్లు రోజూ వ్యయామం చేయాలి. బరువు తగ్గడంతో పాటుగా మీకు రొమ్ము క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది.
మీరు ఓవర్ వెయిట్ లేకపోయినా.. రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఉంటే మాత్రం శారీరక శ్రమ తప్పనిసరి. దీనివల్ల రక్త ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.
ఒక పరిశోధన ప్రకారం.. రెగ్యులర్ గా వ్యాయామం చేసే మహిళలు.. వ్యాయామం చేయని మహిళలతో పోల్చితే వాళ్లకు రొమ్ము క్యాన్సర్ ప్రమాదం 10 నుంచి 20 శాతం తక్కువగా ఉంటుందట. రుతుక్రమం ఆగిపోయిన ఆడవారికి రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంది.