- Home
- Life
- snacks for weight loss: ఎలా బరువు తగ్గాలో తెలియడం లేదా? ఈ స్నాక్స్ ను తినండి.. వేగంగా బరువు తగ్గుతారు..
snacks for weight loss: ఎలా బరువు తగ్గాలో తెలియడం లేదా? ఈ స్నాక్స్ ను తినండి.. వేగంగా బరువు తగ్గుతారు..
snacks for weight loss: బరువు తగ్గాలని ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో బరువు తగ్గాలనుకునే వారు స్నాక్స్ జోలికి అసలే పోరు. మీకు తెలియని విషయం ఏమిటంటే కొన్ని రకాల స్నాక్స్ బరువును వేగంగా తగ్గిస్తాయి.

ప్రస్తుత కాలంలో అధిక బరువు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ చేయకపోవడం, ఆయిలీ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు.
weight loss
అధిక బరువు వల్ల గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన జబ్బులొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. బరువు తగ్గాలని చాలా మంది గంటల తరబడి జిమ్ముల్లో కసరత్తులు చేస్తుంటారు. మోతాదులోనే ఆహారాలను తీసుకుంటారు. కొందరైతే స్నాక్స్ ను మొత్తమే తీసుకోరు. ఎక్కడ వాటిని తింటే బరువు పెరిగిపోతామేమోనని. ఇది నిజమే కానీ.. కొన్ని రకాల స్నాన్స్ బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడతాయి. అవేంటంటే
పానీపూరీ (Panipuri)
పానీపూరీ అంటే ఇష్టపడని వారుండరు. వేడి వేడిగా వీటిని లాగింస్తుంటే వచ్చే ఆ మజాయే వేరబ్బా. అందులోనూ దీనికి పిల్లలు, యువతే కాదు, పెద్దవారు సైత్యం ఫ్యాన్స్ యే. సాయంత్రం అయితే చాలు ఎక్కడ పానీపూరి బండి ఉన్నా.. వెతుక్కుంటూ వెళ్లి మరీ తింటుంటారు. పానీ నోటికి రుచిగానే కాదు దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అధిక బరువుతో బాధపడేవారు సాయంత్రం పానీపూరీ తింటే వేగంగా బరువు తగ్గుతారు. అయితే పానీపూరీ తిన్న తర్వాత పడుకునే ముందు ఖచ్చితంగా 7 నుంచి 10 గ్లాసుల నీళ్లను తాగాల్సి ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా పోతాయి.
మఖానా (Makhana)
మఖానా బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో కార్భోహైడ్రేట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బరువు తగ్గేందుకు వీటిని రోజు వారి ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటిని స్నాక్స్ గా తీసుకుంటే బరువు తగ్గడంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
మొలకలు (sprouts)
మొలకల్లో పోషకాలకు ఏ కొదవా ఉండదు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. మొలకల్లో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి బెల్లీ ఫ్యాట్ ను వేగంగా కరిగిస్తాయి. ఈ హెల్తీ స్నాక్స్ ను రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే మంచి మేలు జరుగుతుంది.
డ్రై ఫ్రూట్స్ (Dry fruits)
డ్రై ఫ్రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. వీటి ద్వారా శరీరానికి ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్లు, మినరల్స్ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. వీటిని నానబెట్టుకుని తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
చిలగడదుంప చాట్ (Sweet potato chat)
చిలగడదుంప మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఇది రుచిగా ఉండటమే కాదు.. హెల్తీ ఫుడ్ కూడా. దీనిని స్నాక్స్ గా తీసుకుంటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే వేగంగా బరువును కూడా తగ్గిస్తుంది.