MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Women Food: మహిళలు తప్పనిసరిగా ప్రతిరోజూ తినాల్సిన ఫుడ్స్ ఇవే

Women Food: మహిళలు తప్పనిసరిగా ప్రతిరోజూ తినాల్సిన ఫుడ్స్ ఇవే

Women Food: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుంది. వారు జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మంచి ఆహారం, సరైన నిద్ర ఎంతో అవసరం. అందుకే మహిళలు తినాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. 

1 Min read
Author : Haritha Chappa
Published : May 21 2026, 02:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మహిళలు తినాల్సిన ఫుడ్స్
Image Credit : Getty

మహిళలు తినాల్సిన ఫుడ్స్

మహిళలు శరీరంలో సున్నితంగా ఉంటుంది. అందుకే వారు బలమైన ఆహారం తీసుకోవాలి. వారు ఎంత ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది. మగవారితో పోలిస్తే కొన్ని రకాల పోషకాలు మహిళలకు అత్యధికంగా అవసరం పడతాయి. వాటిలో ప్రోటీన్లు ఒకటి. ప్రోటీన్  కండరాలను బలంగా ఉంచుతుంది. హార్మోన్ల ఉత్పత్తి సరిగ్గా జరిగేలా చేస్తుంది. దీనికోసం  గుడ్లు, పనీర్, చేపలు, పెరుగు, పప్పు ధాన్యాలు తీసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఐరన్
Image Credit : Getty

ఐరన్

మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా వస్తుంది. దీనివల్ల  అలసట, నీరసం వస్తుంది. రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఐరన్ కోసం మహిళలు పాలకూర, బచ్చలి కూర, తోటకూర, పప్పులు, శెనగలు, రాజ్మా, సోయాబీన్ష్, కొమ్ము శెనగలు, డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు, అవిసెగింజలు, బ్రౌన్ రైస్ వంటివి తినాలి. కోడిగుడ్డు, చికెన్ లివర్, రొయ్యలు వంటివాటిలో కూడా ఐరన్ అధికంగా ఉంటుంది.

34
కాల్షియం, విటమిన్ డి
Image Credit : Getty

కాల్షియం, విటమిన్ డి

ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి చాలా అవసరం. పాలు, పెరుగు, రాగులు వంటివి తినడం వల్ల శరీరంలో ఈ రెండింటి స్థాయిలు పెరుగుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా కావాలి. ఇవి హార్మోన్ల పనితీరుకు సపోర్ట్ చేస్తాయి. అలాగే మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.

44
ఫైబర్
Image Credit : Getty

ఫైబర్

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పండ్లు, కూరగాయలు, గింజలు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. శరీరానికి సరిపడా నీరు అందుతోందని నిర్ధారించుకోవాలి. డీహైడ్రేషన్ బారిన పడితే అది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ఎక్కువగా తినడం తగ్గించాలి. ఇలా చేయడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
మహిళలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Bangles: డైలీవేర్ కోసం బంగారు గాజుల డిజైన్లు ఇవే!
Recommended image2
Gold Haaram: చీరలపైకి అదిరిపోయే లాంగ్ గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి
Recommended image3
Microwave Safety: ఈ పదార్థాలు మైక్రోవేవ్ ఓవెన్‌లో అస్సలు పెట్టకూడదు
Related Stories
Recommended image1
Loco pilot salary: రైళ్లను నడిపే లోకో పైలట్ల జీతాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుసా?
Recommended image2
Scooty Seat Cover: ఎండలో బైక్ సీటు కాలిపోతోందా? కూల్‌గా ఉంచే ఈ సీట్ కవర్లు ట్రై చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved