Telugu

బ్రెష్ లేకుండానే బాటిల్ క్లీన్ చేసే ఈజీ టిప్స్!

Telugu

రాగి వాటర్ బాటిల్‌ క్లీనింగ్

రాగి బాటిల్‌లో కొద్దిగా నీళ్లు, నిమ్మరసం, ఉప్పు వేయాలి. బాటిల్‌ను బాగా షేక్ చేసి 20 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే బాటిల్ కొత్తదానిలా మెరుస్తుంది.

Image credits: Chatgpt
Telugu

స్టీల్ వాటర్ బాటిల్‌ క్లీనింగ్

స్టీల్ వాటర్ బాటిల్‌లో ఒక చెంచా బేకింగ్ సోడా, కొన్ని బియ్యం, వేడి నీళ్లు పోయాలి. బాటిల్‌ను బాగా షేక్ చేసి.. 15 నిమిషాల తర్వాత డిష్‌వాష్ లిక్విడ్‌తో కడిగితే మురికి, వాసన పోతాయి.

Image credits: Chatgpt
Telugu

ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్లీనింగ్

ప్లాస్టిక్ బాటిల్‌లో గోరువెచ్చని నీళ్లు, కొద్దిగా వెనిగర్, కొన్ని బియ్యం వేయాలి. బాగా షేక్ చేసి 15 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత లిక్విడ్ సోప్‌తో కడిగితే కొత్తదానిలా మారుతుంది.

Image credits: Chatgpt
Telugu

గాజు వాటర్ బాటిల్‌ క్లీనింగ్

గాజు వాటర్ బాటిల్‌లో కొద్దిగా నీళ్లు, లిక్విడ్ సోప్, ఒక చెంచా బియ్యం వేయాలి. 30 సెకన్ల పాటు గట్టిగా షేక్ చేయాలి. లోపల ఉన్న మురికిని బియ్యం ఈజీగా, పూర్తిగా శుభ్రం చేస్తాయి.

Image credits: Chatgpt
Telugu

సన్నని మూతి ఉన్న బాటిళ్లు

బాటిల్ మూతి సన్నగా ఉండి, బ్రెష్ లోపలికి వెళ్లకపోతే.. బియ్యం, ఉప్పు లేదా బేకింగ్ సోడా వంటివి బాగా ఉపయోగపడతాయి. ఇవి లోపల పేరుకున్న మురికిని సులభంగా తొలగిస్తాయి.

Image credits: Chatgpt

Cardamom Water: పరగడుపున యాలకుల నీళ్లు తాగితే జరిగే మ్యాజిక్ ఇదే!

Washing Machine: నెలలో ఒక్కసారి ఇలా చేస్తే వాషింగ్ మెషీన్ సూపర్ క్లీన్ గా ఉంటుంది

Indoor Plants: రొటీన్ గా పెంచే మొక్కలు కాకుండా ఈ వాటర్ ప్లాంట్స్ ట్రై చేయండి..మీ ఇల్లు నందనవనంలా మారిపోతుంది

Silver Earrings: ఈ వెండి చెవిపోగులు చూశారా.. ఎంత బాగున్నాయో