నెలలో ఒక్కసారి ఇలా చేస్తే వాషింగ్ మెషీన్ సూపర్ క్లీన్ గా ఉంటుంది
life May 21 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
సమయానికి క్లీన్ చేయాలి
వాషింగ్ మెషీన్‌ను సరైన టైంలో క్లీన్ చేయాలి. లేదంటే మురికి, మరకలు పేరుకుపోయి బట్టలు మురికి వదలదు సరికదా…వాషింగ్ మెషీన్‍లో ఉండే మురికి కూడా అంటుకుంటుంది.
Image credits: Getty
Telugu
ఎలాంటి మరకో చెక్ చేయాలి
వాషింగ్ మెషీన్‌లో రకరకాల మరకలు పడుతుంటాయి. శుభ్రం చేసే ముందు, అది ఎలాంటి మరకనో తెలుసుకుంటే క్లీనింగ్ సులభం అవుతుంది. లేదంటే కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అవుతుంది.
Image credits: Getty
Telugu
ఈ క్లీనర్స్ వాడండి
వైట్ వెనిగర్, బేకింగ్ సోడా, నిమ్మరసం, లిక్విడ్ డిష్ సోప్, మైక్రోఫైబర్ క్లాత్ ఉపయోగించి వాషింగ్ మెషీన్‌ను శుభ్రం చేయవచ్చు.
Image credits: Getty
Telugu
డిటర్జెంట్ వేసే డ్రాయర్ క్లీన్ చేయాలి
డిటర్జెంట్ డ్రాయర్‌లో డిటర్జెంట్ పేరుకుపోయే అవకాశం ఎక్కువ. అందుకే గోరువెచ్చని నీటిలో వెనిగర్ కలిపి, అందులో ఈ డ్రాయర్‌ను నానబెట్టండి. ఆ తర్వాత బ్రష్‌తో రుద్దితే సరిపోతుంది.
Image credits: Getty
Telugu
రబ్బర్ సీల్‌ను శుభ్రపరచండి
వాషింగ్ మెషీన్ డోర్ చుట్టూ ఉండే రబ్బర్ సీల్‌లో తేమ, దుమ్ము, ధూళి చేరే అవకాశం చాలా ఎక్కువ. దీన్ని చాలా జాగ్రత్తగా శుభ్రం చేయాలి.
Image credits: social media
Telugu
డ్రమ్‌ను క్లీన్ చేయడం మర్చిపోవద్దు
వాషింగ్ మెషీన్ డ్రమ్‌లో కూడా మరకలు పేరుకుపోతాయి. దీన్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం.
Image credits: freepik
Telugu
మొండి మరకలను వదిలించండి
వాషింగ్ మెషీన్‌లో పట్టిన మొండి మరకలను సరైన క్లీనర్లతో శుభ్రం చేయాలి. నిమ్మరసం, బేకింగ్ సోడా వంటివి బాగా పనిచేస్తాయి.
Image credits: Getty
Telugu
నీటి మరకలు పోవాలంటే..
వాషింగ్ మెషీన్‌పై పడిన నీటి మరకలను వెనిగర్, బేకింగ్ సోడా ఉపయోగించి సులభంగా తొలగించవచ్చు.
Image credits: Getty
Telugu
ఫిల్టర్‌ను క్లీన్ చేయండి
ఫిల్టర్, డ్రెయిన్ హోస్‌లో మురికి, బట్టల పోగులు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. దీన్ని కూడా తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి.