MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Vegetables: మే నెలలో ఈ 3 కూరగాయలు బాగా పెరుగుతాయి.. కుండీల్లోనే పెంచేయండిలా

Vegetables: మే నెలలో ఈ 3 కూరగాయలు బాగా పెరుగుతాయి.. కుండీల్లోనే పెంచేయండిలా

Vegetables: మండే ఎండల్లోనూ కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యంగా పెరుగుతాయి. వీటిని మీరు బాల్కనీలో కుండీల్లో  పచ్చగా పెంచుకోవచ్చు. ఇవి మీకు రెండు నెలల్లోనే తాజా కూరగాయలను కూడా అందిస్తాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : May 06 2026, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వేసవిలో త్వరగా పెరిగే కూరగాయలు
Image Credit : PINTEREST

వేసవిలో త్వరగా పెరిగే కూరగాయలు

మే నెల అంటేనే ఎండలు. ఆ ఎండల్లో కూడా ఆరోగ్యగా పెరిగే కూరగాయల మొక్కలు ఉన్నాయి. పెద్ద పెద్ద పొలాల్లోనే కూరగాయలు పండుతాయనుకోకండి. మీ చిన్న బాల్కనీ లేదా కిచెన్ గార్డెన్‌లో కూడా చాలా వేగంగా తాజా కూరగాయలు పండించవచ్చు. మే నెల ఎండల్లో పెరిగే కొన్ని ప్రత్యేక మొక్కలు ఉన్నాయి. సరైన శ్రద్ధ తీసుకుంటే, ఈ మొక్కలు కేవలం 2 నెలల్లోనే బోలెడన్ని కూరగాయలు ఇస్తాయి. వీటిని పెంచడం కూడా చాలా సులభం.  ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సొరకాయ
Image Credit : Gemini AI

సొరకాయ

వేసవిలో పెంచడానికి అత్యంత సులభమైన కూరగాయల్లో సొరకాయ ఒకటి. దీన్ని మీరు పెద్ద కుండీలో లేదా గ్రో బ్యాగ్‌లో సులభంగా పెంచవచ్చు. ఇది తీగజాతి మొక్క కాబట్టి, రోజూ కొద్దిగా నీరు పోయాలి. తీగ పాకడానికి వీలుగా జాలీ ఏర్పాటు చేయాలి. లేదా తాళ్లతో పైకి పాకేలా ఏర్పాట్లు చేయవచ్చు. 

ఎలా పెంచాలి?
12-15 అంగుళాల కుండీని తీసుకోండి.
మంచి మట్టి, పశువుల ఎరువు, కంపోస్ట్ కలపండి.
విత్తనాన్ని 1 అంగుళం లోతులో నాటండి.
కేవలం 50-60 రోజుల్లో సొరకాయ కోతకు సిద్ధమవుతుంది. ఆ తర్వాత కూడా నిరంతరం కాపునిస్తూనే ఉంటుంది.

Related Articles

Related image1
Transgender Dream: పదేపదే మీ కలలో ఒక ట్రాన్స్ జెండర్ కనిపిస్తున్నారా.. అయితే జరిగేది ఇదే
Related image2
Helmet Cleaning: హెల్మెట్ చెమట వాసనొస్తోందా? ఈ సింపుల్ టిప్స్‌తో క్లీన్ చేయండి
34
బెండకాయ
Image Credit : Getty

బెండకాయ

బెండకాయ వేసవిలో బాగా పెరుగుతుంది.  ఈ మొక్కలను పెంచడం చాలా సులభం. త్వరగా కాపుకొస్తుంది. మీ ఇంట్లోనే చిన్నపాటి కుండీలో దీన్ని పెంచవచ్చు. మొక్కకు రోజుకు కనీసం 6-7 గంటల ఎండ తగిలేలా చూసుకోవాలి. మట్టి కాస్త పొడిగా అయినప్పుడు మాత్రమే నీళ్లు పోయాలి. విత్తనాన్ని 1-2 అంగుళాల లోతులో నాటండి. ఒకే కుండీలో 2-3 విత్తనాలు వేయవచ్చు. సుమారు 45-55 రోజుల్లో బెండకాయలు కోతకు సిద్ధమవుతాయి. రోజూ కొత్త కాయలు కాస్తుంటాయి.

44
పచ్చి మిరపకాయలు
Image Credit : Getty

పచ్చి మిరపకాయలు

పచ్చి మిరప మొక్కను కుండీలో చాలా సులువుగా పెంచేయవచ్చు. తక్కువ స్థలంలో ఎక్కువ కాపునిస్తుంది, చాలా కాలం పాటు దిగుబడి ఇస్తుంది. దీనికి రోజూ ఓ మోస్తరు ఎండ, నీరు అవసరం. ప్రతి 10-15 రోజులకు ఒకసారి సేంద్రియ ఎరువు వేయాలి. 8-10 అంగుళాల కుండీ దీనికి సరిపోతుంది. 50-60 రోజుల్లో మిరపకాయలు కాయడం మొదలవుతుంది. నెలల తరబడి కాపునిస్తూనే ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
తోటపని
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Time to Workouts : ఉదయం వర్కౌట్స్ చేయడం మంచిదా? లేక సాయంత్రమా?
Recommended image2
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Related Stories
Recommended image1
Transgender Dream: పదేపదే మీ కలలో ఒక ట్రాన్స్ జెండర్ కనిపిస్తున్నారా.. అయితే జరిగేది ఇదే
Recommended image2
Helmet Cleaning: హెల్మెట్ చెమట వాసనొస్తోందా? ఈ సింపుల్ టిప్స్‌తో క్లీన్ చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved