MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Viagra History: వయగ్రా ఎందుకోసం తయారు చేశారో తెలుసా? అసలు నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Viagra History: వయగ్రా ఎందుకోసం తయారు చేశారో తెలుసా? అసలు నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Viagra History: వయాగ్రా గురించి తెలియని వారుండరు. పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంచేందుకు దీన్ని తెగ వాడతారు. అందుకే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతోంది. అసలు ఈ వయాగ్రను దేని కోసం తయారు చేశారో తెలుసా? 

2 Min read
Author : Nandini Arava
Published : Mar 27 2026, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వయాగ్రా చరిత్ర
Image Credit : gemini ai

వయాగ్రా చరిత్ర

అనుకున్నది ఒకటి, అయిందొకటి. ఈ వయాగ్రా మెడిసిన్‍ను ముందు ఒకదాని కోసం తయారు చేస్తే ఇప్పుడది పురుషుల లైంగిక సామర్థ్యం కోసం పనిచేస్తోంది. చాలా మంది ఈ పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడతారు. కాకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ పెద్దగా లేకపోవడంతో మార్కెట్లోకి రిలీజ్ చేశారు. చివరకు విప్లవాత్మక మార్పుకు కారణమైంది. లైంగిక సమస్యల నివారణకు పనికొచ్చింది. అసలు దీన్ని ఎందుకోసం తయారు చేశారంటే…

25
గుండె జబ్బుల కోసం
Image Credit : gemini ai

గుండె జబ్బుల కోసం

1980వ దశకం చివరలో ఫైజర్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు 'సిల్డెనాఫిల్' అనే కొత్త కెమికల్ కనుగొన్నారు. దీనిని ప్రాథమికంగా 'ఎంజినా' అనే గుండె సంబంధిత వ్యాధి చికిత్స కోసం సృష్టించారు. ఎంజినా అంటే గుండెకు రక్తప్రసరణ సరిగ్గా అందకపోవడం వల్ల వచ్చే తీవ్రమైన ఛాతీ నొప్పి. రక్తనాళాలను వెడల్పు చేసి, గుండెకు రక్త ప్రవాహాన్ని పెంచడమే ఈ మెడిసిన్ ఉద్దేశం. కానీ 1990 మొదట్లో బ్రిటన్‌లోని స్వాన్సీ హాస్పిటల్‌లో ఈ మందుపై క్లినికల్ ట్రయిల్స్ జరిగాయి. అయితే, శాస్త్రవేత్తలు ఆశించిన స్థాయిలో గుండె జబ్బుల మీద ఈ మందు ప్రభావం చూపలేదు. అంటే ప్రయోగం విఫలమైంది.

Related Articles

Related image1
Viagra Side Effects: అస‌లు వ‌యాగ్రా ట్యాబ్లెట్ ఎలా ప‌ని చేస్తుంది.? త‌ర‌చూ వాడితే ఏమవుతుందో తెలుసా.?
Related image2
Mood Swings: ఎప్పుడూ కోపంగా, బాధగా ఉంటున్నారా? కారణం ఇదే కావచ్చు!
35
వయాగ్రా వింతైన సైడ్ ఎఫెక్ట్స్
Image Credit : chatgpt

వయాగ్రా వింతైన సైడ్ ఎఫెక్ట్స్

ప్రయోగంలో పాల్గొన్న పురుషుల్లో ఒక వింత మార్పు కనిపించింది. ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత వారిలో లైంగిక సామర్థ్యం అనూహ్యంగా పెరిగింది. అంతేకాకుండా అంగస్తంభన సమస్యలు తగ్గడం గమనించారు. శాస్త్రవేత్తలు మొదట దీనిని సైడ్ ఎఫెక్ట్ అనుకున్నారు. కానీ ఆ మెడిసినే ఇప్పుడు విప్లవాత్మక మార్పుకు దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు.

45
లోపం నుండి లాభం వైపు
Image Credit : chatgpt

లోపం నుండి లాభం వైపు

చివరకు శాస్త్రవేత్తలే తమ పరిశోధన దిశనే మార్చేశారు. గుండె కోసం విఫలమైన ఈ మందు, అంగస్తంభన సమస్యలకు పరిష్కారంగా గుర్తించారు. జననేంద్రియాల వద్ద రక్త ప్రసరణను విపరీతంగాపెంచింది. దీనితో 1998లో అమెరికాకు చెందిన FDA (Food and Drug Administration) దీనిని లైంగిక సమస్యలకు మెడిసిన్‍గా ఆమోదం తెలిపింది.

55
వయాగ్రా షాకింగ్ ట్రూత్
Image Credit : chatgpt

వయాగ్రా షాకింగ్ ట్రూత్

ఈ వయాగ్రా కేవలం పురుషులకే కాదు, ఊపిరితిత్తుల్లో రక్తపోటు చికిత్సలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. అయితే మహిళలపై దీని ప్రభావంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. వైద్యుల సలహా లేకుండా దీనిని వాడటం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు, బీపీ మాత్రలు వేసుకునే వారు దీనికి దూరంగా ఉండాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Plant Care: ఎండాకాలంలో మొక్కలు పచ్చగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!
Recommended image2
Chanakya Niti: ముసలోళ్లు అయ్యేలోగా కచ్చితంగా నేర్చుకోవాల్సింది ఇదే..!
Recommended image3
Gold Earrings: 3 గ్రాముల్లో క్యూట్ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్
Related Stories
Recommended image1
Viagra Side Effects: అస‌లు వ‌యాగ్రా ట్యాబ్లెట్ ఎలా ప‌ని చేస్తుంది.? త‌ర‌చూ వాడితే ఏమవుతుందో తెలుసా.?
Recommended image2
Mood Swings: ఎప్పుడూ కోపంగా, బాధగా ఉంటున్నారా? కారణం ఇదే కావచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved