MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Dmart:ఎలాంటి యాడ్స్ ఇవ్వకుండానే.. ఇండియాను ఏలుతున్న డీమార్ట్..ఈ సూపర్ మార్కెట్ సక్సెస్ సీక్రెట్ ఇదే..!

Dmart:ఎలాంటి యాడ్స్ ఇవ్వకుండానే.. ఇండియాను ఏలుతున్న డీమార్ట్..ఈ సూపర్ మార్కెట్ సక్సెస్ సీక్రెట్ ఇదే..!

Dmart: అందరూ ప్రతి నెలా డీమార్ట్ లోనే షాపింగ్ చేస్తూ ఉంటారు. అసలు ఈ డీమార్ట్ జనాల్లోకి ఎలా వెళ్లింది? ఇంత పాపులారిటీ ఎలా సంపాదించింది? ఈ సూపర్ మార్కెట్ సక్సెస్ సీక్రెట్ ఏంటి?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 24 2026, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
డీమార్ట్ లో షాపింగ్ చేస్తున్నారా?
Image Credit : Gemini AI

డీమార్ట్ లో షాపింగ్ చేస్తున్నారా?

మనలో చాలా మంది ప్రతి నెలా కిరాణా సామాను కొనుగోలు చేయడానికి డీమార్ట్ కి వెళ్తూ ఉంటారు. ఏ రోజు ఏ టైమ్ లో డీమార్ట్ లో అడుగుపెట్టినా కూడా... ఫుల్ రష్ గా ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు..డీమార్ట్ తన ఉనికిని చాటుకోవడానికి ఇప్పటి వరకు ఏ ఒక్క టీవీ ప్రకటన ఇవ్వలేదు. పేపర్లలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్ మెంట్లు కూడా వేయలేదు. సోషల్ మీడియాలో కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. మరి, ఎలాంటి యాడ్స్ ఇవ్వకుండానే.. డీమార్ట్ జనాల్లోకి ఎలా వెళ్లింది? ఇంత పాపులర్ ఎలా అయ్యింది? అందరూ అక్కడే సరుకులు కొనడానికి క్యూలు ఎందుకు కడుతున్నారు? దీని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
జీరో-అడ్వర్టైజింగ్ పాలసీ: ప్రకటనల ఖర్చుకు స్వస్తి
Image Credit : Gemini AI

జీరో-అడ్వర్టైజింగ్ పాలసీ: ప్రకటనల ఖర్చుకు స్వస్తి

సాధారణంగా ఏ బ్రాండ్ అయినా మార్కెట్లోకి రావాలన్నా, తన కస్టమర్లను నిలుపుకోవాలన్నా ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ, డీమార్ట్ వ్యవస్థాపకులు రాధాకిషన్ దమానీ మాత్రం మొదట్నుంచీ ఒకే ఒక కఠినమైన రూల్ ఫాలో అవుతున్నారు. అదే 'జీరో-అడ్వర్టైజింగ్ పాలసీ'. మార్కెటింగ్‌పై పెట్టే అనవసరమైన ఖర్చు వల్ల చివరికి ఆ భారం కస్టమర్ల మీదే పడుతుందని ఆయన నమ్మారు. అందుకే ప్రకటనల జోలికి వెళ్లకుండా ఆ డబ్బును పూర్తిగా ఆదా చేశారు.

ఆదా చేసిన నిధులతోనే కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు.. 

ప్రకటనల రూపంలో వృథా అయ్యే కోట్ల రూపాయలను ఆదా చేయడం ద్వారా, డీమార్ట్ ఆ వెసులుబాటును నేరుగా వినియోగదారులకే అందిస్తుంది. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులను విక్రయించడం ప్రారంభించింది. తక్కువ ధరలకే బెస్ట్ ప్రొడెక్ట్స్ దొరుకుతాయి అనే విషయం ఇంటెన్సివ్‌గా మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే ప్రజల్లోకి వెళ్లిపోయింది.

33
నోటి మాట ద్వారానే అద్భుతమైన పబ్లిసిటీ
Image Credit : Gemini AI

నోటి మాట ద్వారానే అద్భుతమైన పబ్లిసిటీ

ఎలాంటి యాడ్స్ లేకపోయినా డీమార్ట్ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం 'వర్డ్ ఆఫ్ మౌత్' పబ్లిసిటీ. డీమార్ట్‌లో తక్కువ ధరకు సామాను కొనుగోలు చేసిన ఒక కస్టమర్, మరో నలుగురికి ఆ విషయాన్ని చెప్పారు. ఇలా ప్రతీ వినియోగదారుడే డీమార్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. కేవలం కస్టమర్ల సంతృప్తి , నమ్మకమే ఈ బ్రాండ్‌ను టాప్ స్థాయికి చేర్చింది.

ఎవ్రీడే లో ప్రైసెస్ (EDLP) వ్యూహం 

డీమార్ట్ అనుసరించే మరో పెద్ద రహస్యం 'ఎవ్రీడే లో ప్రైసెస్' (EDLP) మోడల్. పండుగలు, ప్రత్యేక రోజులు అని కాకుండా ఏడాది పొడవునా అన్ని వస్తువులపై కనీస డిస్కౌంట్లు లభిస్తాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం డీమార్ట్‌ను తమ మొదటి ఆప్షన్‌గా ఎంచుకుంటారు.

ఖర్చులను తగ్గించడం.. 

లాభాలను పెంచుకోవడం డీమార్ట్ తన స్టోర్ల నిర్వహణలో కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. అలంకరణల మీద ఎక్కువ ఖర్చు చేయకుండా, గోడలు, ఫ్లోరింగ్ చాలా సాదాసీదాగా ఉండేలా చూసుకుంటారు. అలాగే సరఫరాదారులకు నగదును వీలైనంత త్వరగా చెల్లించడం ద్వారా వారి నుంచి అత్యంత తక్కువ ధరకు సరుకులను పొందుతారు. ఈ చిన్న చిన్న వ్యాపార సూత్రాలే డీమార్ట్‌ను తిరుగులేని శక్తిగా మార్చాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Lord Venkateswara: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి గడ్డానికి పచ్చ కర్పూరం ఎందుకు పూస్తారు?
Recommended image2
Sarees: ఈ చీరలు ఏ మహిళలకైనా ఇట్టే నచ్చేస్తాయి.. మెరిసిపోతాయి
Recommended image3
Snakes: పాములు మనుషుల బెడ్ మీదకి ఎందుకు వస్తాయి?
Related Stories
Recommended image1
Pressure Cooker: ప్రెజర్ కుక్కర్ లో వంట చేస్తున్నారా? ఈ తప్పులు మాత్రం చేయకండి..!
Recommended image2
Dal: పప్పు ఉడికించేటప్పుడు పైన వచ్చే తెల్లటి నురగ ప్రమాదకరమా? పప్పు అసలు ఎలా వండాలి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved