- Home
- Life
- Hair Growth: జుట్టు రాలిపోతుందని టెన్షన్ పడుతున్నారా? ఇదొక్కటి రోజూ రాస్తే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది..!
Hair Growth: జుట్టు రాలిపోతుందని టెన్షన్ పడుతున్నారా? ఇదొక్కటి రోజూ రాస్తే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది..!
Hair Growth: జుట్టు రాలుతోంది అనగానే చాలా మంది టెన్షన్ పడిపోతారు. కంగారు పడిపోతారు. వెంటనే షాంపూలు, కండిషనర్లు మార్చేస్తూ ఉంటారు. కానీ, ప్రతి రోజూ 5 నిమిషాలు కేటాయించి జుట్టుకు ఒక రకం నూనె రాస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

Hair Oil
ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న పెద్ద సమస్య జుట్టు రాలడం, జుట్టు పల్చగా మారిపోవడం. ఎంత ఖరీదైన షాంపూలు, సీరమ్‌లు వాడినా ఫలితం ఉండట్లేదా? అయితే కెమికల్స్ జోలికి వెళ్లకుండా, మన ఇంట్లోనే సరిగ్గా 5 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే ఒక అద్భుతమైన హోం రెమెడీ ఉంది. అదే ఆముదం హెయిర్ ట్రీట్మెంట్. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. మరి ఆ ఈజీ పద్ధతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాస్టర్ ఆయిల్ హెయిర్ ట్రీట్మెంట్ తయారీ విధానం:
రెండు టేబుల్ స్పూన్ల ఆముదం , కొబ్బరి నూనె లేదా బాదం నూనె ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఆముదం చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి వేరే నూనెతో కలపడం ముఖ్యం. ఒక చిన్న గిన్నెలో ఈ రెండు నూనెలను వేసి బాగా కలపాలి. కావాలంటే గోరువెచ్చని నీళ్ల గిన్నెలో ఈ నూనె గిన్నెను కొద్దిసేపు ఉంచి నూనెను గోరు వెచ్చగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నూనెను వేళ్లతో తలకు ముఖ్యంగా స్కాల్ప్ కి బాగా పట్టించాలి. కుదుళ్ల నుంచి చివర్ల వరకు మసాజ్ చేయాలి. నూనె రాసిన 30 నిమిషాల తర్వాత.. మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
ఈ నూనె రాయడం వల్ల లాభాలు..
ఆముదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ 'ఇ' , ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి, కొత్త జుట్టు త్వరగా మొలకెత్తడానికి సహాయపడుతుంది. జుట్టులో చుండ్రు సమస్యను తగ్గించి, స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్‌పై వేల రూపాయలు ఖర్చు చేసే బదులు, కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నేచురల్ క్యాస్టర్ ఆయిల్ ట్రీట్మెంట్‌ను ట్రై చేయండి. క్రమం తప్పకుండా వాడుతుంటే మీ జుట్టు ఒత్తుగా, మెరిసిపోతూ ఆరోగ్యంగా మారుతుంది.

