MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pressure Cooker: ప్రెజర్ కుక్కర్ లో వంట చేస్తున్నారా? ఈ తప్పులు మాత్రం చేయకండి..!

Pressure Cooker: ప్రెజర్ కుక్కర్ లో వంట చేస్తున్నారా? ఈ తప్పులు మాత్రం చేయకండి..!

Pressure Cooker: వంట సులభంగా, తక్కువ సమయంలో అవ్వాలి అంటే.. కచ్చితంగా ప్రెజర్ కుక్కర్ వాడాల్సిందే. కానీ, ప్రెజర్ కుక్కర్ లో వంట చేసేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 23 2026, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్రెజర్ కుక్కర్ వాడుతున్నారా?
Image Credit : Gemini AI

ప్రెజర్ కుక్కర్ వాడుతున్నారా?

మన దేశంలో దాదాపు ప్రెజర్ కుక్కర్ లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. పులావ్, కిచిడి నుంచి నాన్-వెజ్ కర్రీల వరకు దేనికైనా మనకు టక్కున గుర్తొచ్చేది ప్రెజర్ కుక్కరే. ఇది మన వంట పనిని ఎంతో సులభం చేస్తుంది. అయితే దీన్ని వాడేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తే.. వంట రుచి చెడిపోవడంతో పాటు కుక్కర్ కూడా త్వరగా పాడైపోతుంది. ముఖ్యంగా చాలా మందికి ఈ కుక్కర్ ఎలా వాడాలో సరిగా తెలీదు. దీని వల్ల.. పులావ్ లాంటివి మెత్తగా మారిపోతాయి.. లేదంటే.. మాడిపోతాయి. ఒక్కోసారి సరిగా ఉడకవు కూడా. అలా జరగకుండా ఉండాలన్నా, కుక్కర్ ఎక్కువ రోజులు పని చేయాలన్నా.. కొన్ని సింపుల్ చిట్కాలు పాటించాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1. కుక్కర్‌ను ఓవర్ లోడ్ చేయడం..
Image Credit : Getty

1. కుక్కర్‌ను ఓవర్ లోడ్ చేయడం..

సమయం ఆదా అవుతుందని లేదా ఎక్కువ మొత్తం వండాలని చాలా మంది కుక్కర్‌లో నిండుగా వండేస్తూ ఉంటారు. దీనివల్ల లోపల ఆవిరి సరిగ్గా ప్రసరించక పులావ్ లేదా కూరలు సమానంగా ఉడకవు. కొన్ని పదార్థాలు పచ్చిగా, మరికొన్ని మెత్తగా తయారవుతాయి. ముఖ్యంగా పప్పు లేదా పాస్తా వంటివి వండేటప్పుడు కుక్కర్‌లో సగం మాత్రమే నింపాలి. ఒకేసారి ఎక్కువ వేయడం కంటే, రెండు విడతలుగా వండటం ఎప్పుడూ మేలు.

2. పాలు కలపడం..

మీకు క్రీమీ కూర్మాలు, పన్నీర్ కూరలు ఇష్టమా? అయితే జాగ్రత్త. ప్రెజర్ కుక్కర్‌లో వండేటప్పుడు పాలు, క్రీమ్ లేదా పెరుగును ముందుగా కలిపితే అవి విరిగిపోయే అవకాశం ఉంది. అధిక పీడనం, వేడి కారణంగా పాలలో ఉండే ప్రొటీన్లు దెబ్బతిని గ్రేవీ స్మూత్‌గా కాకుండా గరుకుగా మారుతుంది. దీన్ని నివారించడానికి ప్రెజర్ కుకింగ్ అయిపోయిన తర్వాత, కుక్కర్ చల్లారిన తరువాత మూత తీసి కూరను మంటపై మరిగించేటప్పుడు పాలు, క్రీమ్ లాంటివి కలపాలి.

33
హై మంట మీద వంట చేయడం..
Image Credit : Getty

హై మంట మీద వంట చేయడం..

ప్రెజర్ కుక్కర్ లో వంట చేసేటప్పుడు ఎక్కువ మంట మీద అస్సలు వండకూడదు. ఎక్కువ మంట పెడితే.. కుక్కర్ లో ఫుడ్ మాడిపోయే అవకాశం ఉంది. అంతేకాదు.. సమానంగా కూడా ఉడకదు. అందుకే, మీియం ఫ్లేమ్ మీద మాత్రమే వంట చేయాలి. దీనివల్ల వంటకం మెత్తగా ఉడుకుతుంది. రుచి కూడా అద్భుతంగా వస్తుంది.

4. తగినంత నీరు పోయకపోవడం..

ప్రెజర్ కుక్కర్ ఆవిరి ద్వారా పనిచేస్తుంది. కాబట్టి తగినంత నీరు లేకపోతే అది సరిగ్గా పనిచేయదు. అంతేకాకుండా కుక్కర్ అడుగు మాడిపోయి, పాత్ర దెబ్బతింటుంది. కాబట్టి... దేనికి ఎంత నీరు అవసరమో అంతే పోయాలి. అప్పుడే వంట రుచిగా వస్తుంది.

5. ప్రెజర్‌ను తప్పుగా విడుదల చేయడం..

కుక్కర్‌లోని ఆవిరిని ఎలా బయటకు వదులుతున్నారు అనేదానిపై మీ వంట రుచి ఆధారపడి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే.. కుక్కర్ విజిల్ తీయడానికి ప్రయత్నించొద్దు. ఆఫ్ చేసిన తర్వాత సహజంగా ఆవిరి పోయేంత వరకు ఆగితే.. ఆ వంటకు రుచి పెరుగుతుంది. కమ్మగా కూడా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: పట్టు చీరలపై అదిరిపోయే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్
Recommended image2
బాదం, జీడిపప్పు నెలల తరబడి ఫ్రెష్‌గా నిల్వ ఉండాలంటే ఈ సూపర్ టిప్స్ పాటించండి
Recommended image3
Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
Related Stories
Recommended image1
Weight Loss: ఈ చేపలు తింటే బరువు తగ్గడం చాలా ఈజీ, ఎలా తినాలో తెలుసా?
Recommended image2
Dal: పప్పు ఉడికించేటప్పుడు పైన వచ్చే తెల్లటి నురగ ప్రమాదకరమా? పప్పు అసలు ఎలా వండాలి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved