MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Hill Station: సూర్యోదయం, సూర్యాస్తమయం ఒకే చోట నిలబడి చూడాలా? భారత్ లోని అద్భుత ప్రదేశం..!

Hill Station: సూర్యోదయం, సూర్యాస్తమయం ఒకే చోట నిలబడి చూడాలా? భారత్ లోని అద్భుత ప్రదేశం..!

Hill Station: సాధారణంగా సూర్యోదయం, సూర్యాస్తమయాలు చూడటానికి వేర్వేరు ప్రదేశాలకు వెళ్తుంటాం. కానీ, ఈ వ్యూ పాయింట్ కొండ పైన నిలబడి తూర్పున ఉదయించే సూర్యుడిని, పడమరన అస్తమించే సూర్యుడిని చూడవచ్చు..

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 17 2026, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Hill Station
Image Credit : Chat GPT

Hill Station

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పడమర అస్తమిస్తాడు.. ఇది మనకు తెలిసిన విషయమే. అందుకే.. ఎప్పుడైనా.. ట్రిప్ కోసం హిల్ స్టేషన్స్ కి వెళ్లినప్పుడు.. ఆ కొండపైకి ఎక్కి మరీ.. సన్ రైజ్, సన్ సెట్ రెండూ ఆస్వాదిస్తాం. కానీ, మనం ఈ రెండింటినీ ఆస్వాదించాలి అంటే.. ఒక్కో ప్లేస్ కి వెళ్లాలి. కానీ.. మన దేశంలో ఓ అద్భుతమైన ప్రదేశం ఉంది. ఒకే చోట నిలబడి.. ఉదయాన్నే సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం చూడొచ్చు. మరి, ఈ అద్భుతమైన ప్రదేశం మన దేశంలో ఎక్కడ ఉందో ఇప్పుడు చూద్దాం...

ఈ హిల్ స్టేషన్ ఎక్కడ ఉంది..?

ఈ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్ లో ఉంది. దీని పేరు లాన్స్ డౌన్. ఈ లాన్స్ డౌన్ హిల్ స్టేషన్ కి వెళ్తే.. మీరు అద్భుతాన్ని కళ్లారా వీక్షించొచ్చు. లాన్స్ డౌన్ లోని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో టిప్ ఇన్ టాప్ ఒకటి. చుట్టూ దట్టమైన కొండలు, ఆకుపచ్చని లోయలు, దూరంగా మంచుతో కప్పిన హిమాలయ పర్వత శ్రేణులు ఇక్కడి నుంచి చాలా క్లియర్ గా అద్భుతంగా కనపడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సూర్యోదయం ఒక అద్భుతం..
Image Credit : Chat GPT

సూర్యోదయం ఒక అద్భుతం..

ఉదయాన్నే ఈ టిప్ ఇన్ టాప్ వద్దకు చేరుకుంటే, మంచు పొరల మధ్య కొండల వెనక నుండి నెమ్మదిగా పైకి కదులుతున్న బంగారు రంగులో సూర్యుడిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. సూర్య కిరణాలు హిమాలయ శిఖరాలపై పడినప్పుడు ఆ దృశ్యం వర్ణనాతీతంగా ఉంటుంది.

కనుల విందుగా సూర్యాస్తమయం..

అదే ప్రాంతంలో మీరు నలబడి సాయంత్రం వేళ సూర్యాస్తమయాన్ని ఆస్వాదించొచ్చు. సాయంత్రం అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశం రకరకాల రంగులు మారుస్తూ, కొండల వెనక మాయమౌతుంటే.. చూడటం చాలా బాగుంటుంది.

Related Articles

Related image1
Reverse Waterfall: ఈ వాటర్ ఫాల్ లో నీరు కిందకు రాదు.. పైకి వెళతాయి, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే..!
Related image2
River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?
33
ఒకే ప్రదేశం నుంచి ఎలా సాధ్యం..?
Image Credit : Chat GPT

ఒకే ప్రదేశం నుంచి ఎలా సాధ్యం..?

సూర్యుడు తూర్పున ఉదయించి, పడమరన అస్తమిస్తాడనేది మనందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యూ పాయింట్ కొండ పైన 360 డిగ్రీల విశాలమైన (Panoramic) కోణంలో ఉండటం వల్ల, ఇక్కడి నుంచి తూర్పు, పడమర దిశల్లోని ఆకాశాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒకే చోట నిలబడి స్పష్టంగా చూడవచ్చు. అందుకే ఒకే వ్యూ పాయింట్ నుండి ఉదయం, సాయంత్రం రెండింటినీ ఆస్వాదించే వీలుంది.

ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలి?

ప్రదేశం: టిప్-ఇన్-టాప్ వ్యూ పాయింట్, లాన్స్‌డౌన్, పౌరీ గఢ్వాల్ జిల్లా, ఉత్తరాఖండ్.

చేరుకునే మార్గం: లాన్స్‌డౌన్ ప్రధాన పట్టణ కేంద్రం నుండి ఇది కేవలం 1.5 నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్యాటకులు హాయిగా నడుచుకుంటూ గానీ లేదా వాహనాల ద్వారా గానీ సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. జీవితంలో ఒక్కసారి అయినా అందమైన సూర్యోదయం, సూర్యాస్తమయం చూడాలి అంటే కచ్చితంగా ఈ ప్రదేశానికి వెళ్లాల్సిందే.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Coconut Water: కొబ్బరి నీళ్లు రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Watch: అంబానీ కోడలు రాధిక మర్చంట్ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? ఒక్క వాచ్ ఖరీదుతో లైఫ్ సెటిల్..!
Related Stories
Recommended image1
Reverse Waterfall: ఈ వాటర్ ఫాల్ లో నీరు కిందకు రాదు.. పైకి వెళతాయి, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే..!
Recommended image2
River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved