MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Alcohol Mixing: ఆల్కహాల్‌లో సోడా కలపాలా? లేక నీళ్లు కలపాలా? నిపుణులు చెప్పే నిజాలివే!

Alcohol Mixing: ఆల్కహాల్‌లో సోడా కలపాలా? లేక నీళ్లు కలపాలా? నిపుణులు చెప్పే నిజాలివే!

Alcohol Mixing: మద్యంలో నీళ్లు కలపాలా, సోడా కలుపుకోవాలా అనే సందేహం ఎక్కువ మందిలో ఉంటుంది. కొందరు ఐస్ క్యూబ్స్ వేసుకుంటారు. అసలు ఆల్కహాల్ లో ఏది కలుపుకోవాలి?

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 16 2026, 07:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మద్యంలో ఏం కలపాలి?
Image Credit : AI Image

మద్యంలో ఏం కలపాలి?

మద్యం తాగేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే చాలామందికి ఓ పెద్ద సందేహం ఉంటుంది. డ్రింక్స్‌లో నీళ్లు కలపాలా లేక సోడానా? ఐస్ క్యూబ్స్ ఎందుకు వేసుకోవాలి? ఈ విషయంలో ఉన్న అపోహలపై ప్రముఖ ఆరోగ్య నిపుణుడు డాక్టర్ రాజు సైంటిఫిక్‌గా సమాధానాలు ఇచ్చారు.

డాక్టర్ రాజు చెబుతున్న ప్రకారం మన శరీరంలోని కణాలు, గుండె, లేదా లివర్ ఎప్పుడూ కూడా ఆల్కహాల్‌ లాంటి పానీయం కావాలని కోరుకోవు. అసలు అది శరీరానికి అవసరమే లేదు. కేవలం మానసిక సంతృప్తి కోసం ఆల్కహాల్ తాగుతూ ఉంటారు. మద్యంలో వేర్వేరు ద్రవాలు కలిపినప్పుడు శరీరంపై కలిగే ప్రభావాలు కూడా తేడాగా ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఐస్ క్యూబ్స్ వేస్తే
Image Credit : Getty

ఐస్ క్యూబ్స్ వేస్తే

చాలామంది డ్రింక్స్‌లో ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగడం చూసే ఉంటారు. ఐస్ వల్ల నోటిలోని నరాలు మొద్దుబారిపోతాయి. అందుకే మద్యం చేదుగా అనిపించదని డాక్టర్ రాజు వివరిస్తున్నారు.

సోడా కలిపితే

మద్యంలో సోడా కలిపినప్పుడు, అందులోని గ్యాస్ కడుపులో ఉన్న ఆల్కహాల్‌ను వేగంగా చిన్న ప్రేగులోకి నెడుతుంది. దీనివల్ల ఆల్కహాల్ రక్తంలోకి చాలా స్పీడ్‌గా కలిసిపోయి 'కిక్' తొందరగా వస్తుంది. శరీరంపై వేగంగా ప్రభావం చూపే పద్ధతి ఇది.

కూల్స్ డ్రింక్స్ కలిపితే

స్ప్రైట్ లేదా ఇతర కూల్ డ్రింక్స్ కలిపినప్పుడు, వాటిలో ఉండే అధిక గ్లూకోజ్ (చక్కెర) శరీరంలో షుగర్ లెవెల్స్‌ను పెంచుతుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. అందుకే మరుసటి రోజు తీవ్రమైన హ్యాంగోవర్, తలనొప్పి వస్తాయని డాక్టర్ రాజు హెచ్చరించారు.

Related Articles

Related image1
Tamarind: చింతపండు ఎందుకు తినాలి? అది తినకపోతే మన శరీరానికి ఏమైనా నష్టమా?
Related image2
Miracle Drink: జీలకర్ర, వాము, సోంపు కలిపి నెల రోజులు తాగి చూడండి.. మీరు ఎలా మారిపోతారంటే
33
ఒక గ్లాస్ కాక్ టెయిల్ తాగితే
Image Credit : Asianet News

ఒక గ్లాస్ కాక్ టెయిల్ తాగితే

జ్యూస్‌లు, పండ్లు, రకరకాల ఫ్లేవర్లతో కలిపి చేసే కాక్‌టెయిళ్లలో చక్కెర, క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ రాజు ప్రకారం, ఒక గ్లాస్ కాక్‌టెయిల్ తాగితే, ఒక పూట భోజనం చేసినన్ని క్యాలరీలు శరీరానికి అందుతాయి.

మద్యపానం ఆరోగ్యానికి ఎప్పటికీ మంచిది కాదు. ఒకవేళ ఈ అలవాటును మానుకోలేకపోతే, వీలైనంత తక్కువ మోతాదులో తీసుకోవాలి. శరీరానికి హాని జరగకుండా జాగ్రత్తపడటం చాలా ముఖ్యం అని డాక్టర్ రాజు సూచించారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra Designs: 5 గ్రాముల్లో వచ్చే మంగళసూత్రాలు.. సూపర్ డిజైన్లు!
Recommended image2
Fridge: వీటిని ఫ్రిజ్ లో పెడితేనే తొందరగా పాడైపోతాయి, పొరపాటున కూడా పెట్టకూడదు..!
Recommended image3
Gods Flower: దేవుడిని పూజించిన పూలను బయటపడేయకూడదు, మరి ఏం చేయాలి?
Related Stories
Recommended image1
Tamarind: చింతపండు ఎందుకు తినాలి? అది తినకపోతే మన శరీరానికి ఏమైనా నష్టమా?
Recommended image2
Miracle Drink: జీలకర్ర, వాము, సోంపు కలిపి నెల రోజులు తాగి చూడండి.. మీరు ఎలా మారిపోతారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved