MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Snake: ప్రపంచంలో గూడు కట్టే ఒకే ఒక్క పాము ఇది, ఈ పాములో ఉన్న స్పెషాలిటీ ఇదే..!

Snake: ప్రపంచంలో గూడు కట్టే ఒకే ఒక్క పాము ఇది, ఈ పాములో ఉన్న స్పెషాలిటీ ఇదే..!

Snake: పక్షుల మాదిరి పాములు కూడా గూడు కడతాయా? ప్రపంచంలో ఒకే ఒక్క పాము మాత్రమే.. స్వయంగా గూడు కడుతుంది. ఆ పాము ఏది? ఆ పాము మాత్రమే ఎందుకు ఇలా చేస్తుంది?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 03 2026, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్రపంచంలో ఒకే ఒక్క పాము ఇది..
Image Credit : Chat GPT

ప్రపంచంలో ఒకే ఒక్క పాము ఇది..

మనం చిన్నప్పటి నుంచి ఏం చదువుకున్నాం..? చీమలు పెట్టిన పుట్టల్లో పాములు కొలువు తీరతాయి అని చదువుకున్నాం. అంతేకాదు, పక్షులు గూడు కట్టుకుంటున్నాయి అని మనకు తెలుసు కానీ.. పాములు కూడా గూడు కడతాయని ఎప్పుడైనా విన్నారా? అన్ని పాములు గూడు కట్టలేవు కానీ... ప్రపంచంలో ఒకే ఒక్క పాము మాత్రం.. స్వయంగా తానే ఆకులు ఏరి మరీ గూడు కడుతుంది. ఆ పాము ఏంటి? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గూడు కట్టే ఏకైక పాము...
Image Credit : Gemini AI

గూడు కట్టే ఏకైక పాము...

పాములు సాధారణంగా గుడ్లు పెట్టి వాటిని వదిలేసి వెళ్లిపోతాయి. కానీ.. ఒక పాము మాత్రం మిగతా పాములన్నింటి కంటే భిన్నంగా ప్రవర్తిస్తుంది. అది గుడ్లు పెట్టడమే కాదు.. తమ పిల్లల కోసం ఏకంగా గూడు కడుతుంది. అంతేకాదు, పిల్లలు బయటకు వచ్చే వరకు ఆ గూడు వద్దే కాపలా కూడా కాస్తుంది. అదే కింగ్ కోబ్రా. ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా పాముల జాతులు ఉంటే.. వాటన్నింటిలో..గూడు కట్టే ఒకే ఒక్క పాము కింగ్ కోబ్రా. ముఖ్యంగా ఆడ కింగ్ కోబ్రా అడవిలో ఎండిన ఆకులు, చిన్న కొమ్మలు, గడ్డి వంటివి తన శరీరంతో తోసుకుంటూ ఒక పెద్ద గూడు స్వయంగా తయారు చేస్తుంది. ఈ గూడులో ఆ పాము ఏకంగా 20 నుంచి 40 గుడ్లు పెడుతుంది.

నిజానికి, పాములు.. గుడ్లు పెట్టిన తర్వాత ఆ గూడు అక్కడే వదిలేసి వెళ్లిపోతాయి. కానీ, కింగ్ కోబ్రా.. మాత్రం గుడ్లు పెట్టిన తర్వాత వదిలేసి వెళ్లదు. పిల్లలు బయటకు వచ్చే వరకు చాలా వారాల పాటు గూడు దగ్గరే కాపాలాకాస్తుంది. మిగిలిన పాముల్లో ఇలాంటి లక్షణాలు ఉండటం అరుదు. గూడు కోసం కింగ్ కోబ్రా ఉపయోగించిన ఆకులు కొద్ది రోజులకు కుళ్లిపోతాయి. అలా కుళ్లిపోయినప్పుడు.. వాటి నుంచి సహజంగా వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడికి..గుడ్లు తొందరగా పొదుగుతాయి. ఇక.. పాము పిల్లలు గుడ్డు నుంచి బయటకు వచ్చే సమయానికి.. కింగ్ కోబ్రా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎందుకంటే, ఆ పాములు. పుట్టడం పుట్టడంతోనే విషయంతో పుడతాయి. తల్లి అవసరం లేకుండా స్వతంత్రంగా బతగలవు. అదుకే వెంటనే వాటిని వదిలేసి వెళ్లిపోతుంది. కేవలం అవి బయటకు వచ్చే వరకు మాత్రం కాపలాకాస్తుంది. ఇది కట్టే పాము గూళ్లు మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి.

Related Articles

Related image1
Cooking Tips: కూర వండేటప్పుడు.. మధ్యలో వేడి నీళ్లు పోస్తే ఏమౌతుంది? దీని వెనక సైన్స్ తెలుసా?
Related image2
Chillies: కారం కారంగా తినే మిరపకాయ మనది కాదా? దీని వెనక పెద్ద చరిత్రే ఉంది..!
33
అత్యంత తెలివైన పాము...
Image Credit : stockPhoto

అత్యంత తెలివైన పాము...

అన్ని పాముల్లో కెల్లా ఇది అత్యంత తెలివైన పాము. ఎందుకంటే.. ఏదైనా ప్రమాదం ఉంటే.. అన్నింటికంటే ముందుగా పసిగట్టేస్తుంది. ముఖ్యంగా.. తన గూడు దగ్గరకు ఎవరైనా వస్తున్నారంటే.. చాలా తీవ్రంగా స్పందిస్తుంది. కరవడానికి కూడా ఏ మాత్రం వెనకాడదు. చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. మిగిలిన పాములకీ, కింగ్ కోబ్రాకి ఉన్న తేడా ఇదే.

ప్రపంచంలో అతి పొడవైన విషసర్పం...

ప్రపంచంలో అతి పొడవైన విష సర్పం కూడా ఇదే. ఈ పాము సుమారు 5.5 మీటర్లు పొడవు ఉంటుంది. అంటే 18 అడుగుల వరకు ఈ పాము పొడవు ఉండే అవకాశం ఉంది.

గూడు నిర్మించడం, గుడ్లను రక్షించడం, సహజ వేడితో వాటి అభివృద్ధికి అనుకూల పరిస్థితులు కల్పించడం వంటి లక్షణాల వల్ల కింగ్ కోబ్రా ప్రపంచంలోని అన్ని పాముల్లో అత్యంత ప్రత్యేకమైన జాతిగా గుర్తింపు పొందింది. ఇదే కారణంగా దీనిని గూడు కట్టే ప్రపంచంలోని ఏకైక పాము అని పిలుస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: తండ్రి ఎప్పుడూ కోపంగా ఉంటే పిల్లలు ఎలా మారిపోతారో తెలుసా..?
Recommended image2
Temple: ఒకే దగ్గర 12 జ్యోతిర్లింగాలు, తెలంగాణ మినీ మాల్దీవులు.. హైదరాబాద్ దగ్గరలోనే..
Recommended image3
Bangle Designs: చేతుల అందాన్ని రెట్టింపు చేసే గాజులు.. ఓ లుక్కేయండి!
Related Stories
Recommended image1
Cooking Tips: కూర వండేటప్పుడు.. మధ్యలో వేడి నీళ్లు పోస్తే ఏమౌతుంది? దీని వెనక సైన్స్ తెలుసా?
Recommended image2
Chillies: కారం కారంగా తినే మిరపకాయ మనది కాదా? దీని వెనక పెద్ద చరిత్రే ఉంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved