MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Fan Cleaning: ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతున్నా గాలి రావట్లేదా? ఈ చిన్న పని చేయండి

Fan Cleaning: ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతున్నా గాలి రావట్లేదా? ఈ చిన్న పని చేయండి

Fan Cleaning: వేసవిలో ఉక్కపోత ఎక్కువగా ఉంంటుంది. సీలింగ్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతున్నా చల్లగా గాలి తగలడం లేదా?  కేవలం 2 రూపాయల ఖర్చుతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఏం చేయాలో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 24 2026, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫ్యాన్ తిరుగుతున్నా గాలి రావట్లేదా?
Image Credit : unsplash

ఫ్యాన్ తిరుగుతున్నా గాలి రావట్లేదా?

ఎండలు మండిపోతున్నాయి. ఫ్యాన్ లేకుండా అయిదు నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి. వేడి తగ్గాలని ఫ్యాన్ వేసినా ఒక్కోసారి గాలే తగలదు. ఫ్యాన్ రెక్కలు ఎంత స్పీడుగా తిరిగినా  చల్ల గాలి తగలక ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలాంటి సమస్యతోనే బాధపడుతూ ఉంటే దానికి చిన్న చిట్కా ఉంది.  కేవలం రెండు రూపాయలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఫ్యాన్ గిర గిరా తిరిగేలా చేయవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ పని చేయండి
Image Credit : unsplash

ఈ పని చేయండి

సీలింగ్ ఫ్యాన్ స్పీడుగా తిరుగుతున్నా గాలి తగలకపోవడానికి ప్రధాన కారణం… ఆ రెక్కలపై  పేరుకుపోయిన దుమ్ము. ఈ దుమ్ము వల్ల గాలి రాదు. ఫ్యాన్ మాత్రం తిరుగుతుంది. దుమ్మును తొలగించడానికి మీరు కేవలం రెండు రూపాయలు ఖర్చు పెడితే చాలు. చల్లని గాలి మీ ఇల్లంతా వ్యాపిస్తుంది.

34
షాంపూ ప్యాకెట్
Image Credit : unsplash

షాంపూ ప్యాకెట్

రెండు రూపాయలు పెట్టి షాపు నుంచి ఒక షాంపూ ప్యాకెట్ తీసుకుని రండి. ఒక బకెట్‌లో నీళ్లు తీసుకుని, అందులో షాంపూ వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని ఫ్యాన్ రెక్కలపై ఉన్న దుమ్మును తుడవండి. కానీ దుమ్ము మొత్తం పోదు.

44
టేబుల్ ఫ్యాన్ కూడా
Image Credit : X

టేబుల్ ఫ్యాన్ కూడా

ఆ తరువాత  షాంపూ కలిపిన నీటిలో ఒక వస్త్రాన్ని ముంచి సీలింగ్ ఫ్యాన్‌ను పూర్తిగా శుభ్రం చేయండి. ఆ తర్వాత మరో పొడి క్లాత్ తో ఫ్యాన్‌పై ఉన్న తడిని తుడిచేయాలి. ఆ తరువాత ఫ్యాన్ ఆన్ చేసి చూడండి. ఫ్యాన్ స్పీడుగా తిరగడమే కాదు.. చల్లని గాలి కూడా తగులుతుంది. 

సీలింగ్ ఫ్యాన్ లాగే మీరు టేబుల్ ఫ్యాన్‌ను కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఎయిర్ కూలర్ కూడా చల్లని గాలి ఇవ్వక ఇబ్బంది పెడుతూ ఉంటే దాన్ని కూడా ఇదే విధంగా శుభ్రం చేయండి. కూలర్‌లో గాలి వచ్చే భాగంలో దుమ్ము, చెత్త పేరుకుపోతే గాలి వేగం తగ్గిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
Jobs in Germany: జర్మనీలో భారతీయులకు లక్షల జీతాలతో భారీగా ఉద్యోగ అవకాశాలు, వెంటనే అప్లై చేయండి
Recommended image2
Vijay Rashmika: విజయ్ దేవరకొండ జీవితంలో పెళ్లే చేసుకోనని చెప్పాడు కానీ.. విజయ్ మేనమామ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved