MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • AC Explode: ఈ పొరపాట్లు చేస్తే.. ఏసీలు బాంబ్ లా పేలిపోతాయి..!

AC Explode: ఈ పొరపాట్లు చేస్తే.. ఏసీలు బాంబ్ లా పేలిపోతాయి..!

 AC Explode: ఈ ఎండల్లో ఏసీ లేకుండా గంట కూడా ఉండేలేని వాళ్లు చాలా మందే ఉన్నారు. రోజంతా ఏసీలోనే గడుపుతూ ఉంటారు. అయితే, ఏసీ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పేలిపోయే ప్రమాదం ఉంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 25 2026, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
AC Explode
Image Credit : Getty

AC Explode

దేశంలో రోజు రోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల వేడి నుంచి ఏసీలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. కానీ.. బయట వేడి పెరిగే కొద్దీ.. నిరంతరం ఏసీలో ఉండటం కూడా ప్రమాదకరం. ఎందుకంటే.. ఆ వేడికి ఏసీలు కూడా బాంబుల్లా పేలిపోయే ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలంలో, చాలా చోట్ల ఏసీలు పేలిపోతున్నాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఎలాంటి పొరపాట్లు చేయడం వల్ల ఏసీలు పేలిపోతాయో తెలుసా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఏసీ గదిని చల్లగా మారుస్తుంది. కానీ, దానిని సరిగా నిర్వహించకపోతే, అగ్ని గోళంలా పేలిపోయే ప్రమాదం ఉంది. ఏసీలో పేలుడు సంభవిస్తే.. ఇంట్లో ఉన్నవారికి కూడా ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా మనం చేసే 4 తప్పుల కారణంగా ఏసీలు పేలిపోయే అవకాశం ప్రమాదం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 ఏసీ అవుట్ డోర్ యూనిట్ ఎక్కడ పెట్టారు?
Image Credit : Getty

ఏసీ అవుట్ డోర్ యూనిట్ ఎక్కడ పెట్టారు?

అవుట్ డోర్ ఏసీలలో అగ్నిప్రమాదానినికి అతి పెద్ద కారణం దానిని సరిగా అమర్చకపోవడమే. ఏసీ బయటి భాగాన్ని ఎల్లప్పుడూ గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో ఉంచాలి. ఒకవేళ ఏసీ బయటి భాగం ఇరుకుగా ఉంటే లేదా అవుట్ డోర్ యూనిట్ ని ఇరుకైన ప్రదేశంలో పెడితే, ఏసీ వేడి గాలిని లోపలికి పీల్చుకుంటుంది. అంతేకాకుండా, అవుట్ డోర్ యూనిట్ కి ఎండ తగిలినా కూడా అది పేలే ప్రమాదం ఉంది. కాబట్టి, ఏసీ బయటి భాగాన్ని అమర్చేటప్పుడు.. ఎండ తగలకుండా చూసుకోవాలి.

చాలా కాలం తర్వాత ఏసీ వాడకం..

ఎండాకాలం మొదలవ్వగానే.. అందరూ ఏసీ ని ఆన్ చేస్తారు. వర్షాకాలం, చలికాలంలో మాత్రం ఏసీని వాడకుండా ఉంచుతారు. దీని వల్ల ఏసీ లోపల దుమ్మూ, ధూళి పేరుకుపోతాయి. చాలా కాలంగా ఉపయోగించకపోవడం వల్ల ఏసీ ఫిల్టర్, ఇతర భాగాలపై దుమ్ము పేరుకుపోతుంది. ఎండాకాలం మొదలవ్వగానే ఏసీకి సర్వీసింగ్ చేసి.. ఆ తర్వాత ఉపయోగించాలి. అలా చేయకపోతే.. కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. లేదంటే.. ఏసీ కంప్రెసర్ వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది.

Related Articles

Related image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Related image2
Washing Machine: మీ వాషింగ్ మెషిన్ బాల్కనీలో పెట్టారా? ఈ ఒక్క పొరపాటుతో చాలా నష్టపోతారు..!
33
 ఏసీ నిరంతరాయంగా వాడటం...
Image Credit : Getty

ఏసీ నిరంతరాయంగా వాడటం...

ఏసీని వాడేటప్పుడు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. దానిని ఎక్కువ గంటలు వాడకూడదు. చాలా చోట్లే ఏసీ 10 నుంచి 12 గంటల పాటు నిరంతరాయంగా నడుస్తూ ఉంటుంది. ఏసీని నడిపేటప్పుడు అలాంటి పొరపాట్లు చేయకూడదు. మొదటగా బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ఏసీని 12 గంటల పాటు నిరంతరాయంగా వాడితే.. కంప్రెసర్ వేడి ఎక్కి.. పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, సమ్మర్ లో ఎక్కువ గంటలు ఆన్ లో ఉంటే, దాన్ని ఆపేసి తర్వాత మళ్లీ కాసేపటికి ఆన్ చేస్తే సరిపోతుంది.

గ్యాస్ లీక్...

ఏసీ కొని చాలా సంవత్సరాలు అయితే.. దాని అవుట్ డోర్ యూనిట్ నుండి గ్యాస్ లీక్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. మీరు పాత ఏసీని వాడుతున్నట్లియతే.. అవుట్ డోర్ యూనిట్ లో గ్యాస్ లీక్ ఉందో లేదో తనిఖీ చేయాలి. అవుట్ డోర్ యూనిట్ నుండి గ్యాస్ లీక్ అయితే, అధిక ఉష్ణోగ్రత లేదా అధిక ఓల్టేజ్ కారణంగా అది పేలిపోయే ప్రమాదం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Recommended image2
Washing Machine: మీ వాషింగ్ మెషిన్ బాల్కనీలో పెట్టారా? ఈ ఒక్క పొరపాటుతో చాలా నష్టపోతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved