MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Suitcase: విమాన ప్రయాణికులు... సూట్ కేస్ వీల్స్ కి టేపు ఎందుకు చుడతారు..?

Suitcase: విమాన ప్రయాణికులు... సూట్ కేస్ వీల్స్ కి టేపు ఎందుకు చుడతారు..?

Suitcase: విమాన ప్రయాణికులు.. చాలా మంది తాము లగేజ్ తీసుకొని వెళ్లే సూట్ కేసులకు కింద ఉండే చక్రాలకు టేపు చుడుతూ ఉంటారు. అసలు.. ఇలా ఎందుకు చేయాలి? దీని వెనక కారణం ఏంటి?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 29 2026, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
వీల్స్ కి టేప్ ఎందుకు చుట్టాలి?
Image Credit : Instagram

వీల్స్ కి టేప్ ఎందుకు చుట్టాలి?

విమాన ప్రయాణం అనగానే మనకు ముందుకు గుర్తుకు వచ్చేది పాస్ పోర్టు, ఆ తర్వాత లగేజ్. ముఖ్యంగా విదేశాలకు వెళ్లేవారు అయితే.. తమ లగేజ్ ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటారు. ఎక్కువ లగేజ్ ఉంటే ఎక్కడ అనుమతించరో అని.. పలుమార్లు చెక్ చేసుకుంటారు. అయితే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ విమాన ప్రయాణానికి సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో.. చాలా మంది లగేజ్ వీల్స్ కి టేప్ చుట్టి తీసుకొని వెళ్తున్నారు. అసలు.. సూట్ కేస్ వీల్స్ కి.. టేప్ ఎందుకు చుట్టాలి? దీని వల్ల లాభం ఏంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
మురికి నుంచి రక్షణ...
Image Credit : Gemini ai

మురికి నుంచి రక్షణ...

ప్రయాణ సమయాల్లో ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్స్ లో మనం లగేజ్ ని.. మోయకుండా.. దానిని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాం. దీని వల్ల.. దుమ్మూ, ధూళీ మొత్తం చక్రాలకు అంటుకుంటూ ఉంటుంది. అదే మనం లగేజ్ చక్రాలకు టేపు వేయడం వల్ల... ఆ మురికి చక్రాలకు అంటుకోదు.

ప్రయాణ బీమా సంస్థ ఇన్సూరెన్స్ అండ్ గో సంస్థ నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పబ్లిక్ టాయిలెట్ సీట్లతో పోలిస్తే లగేజీ చక్రాలపై దాదాపు 58 శాతం రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది.

ఈ టేప్ వేయడం వల్ల ఉపయోగం ఏంటి..?

ఎయిర్‌పోర్టు టెర్మినల్స్, రైల్వే స్టేషన్లు, రోడ్లపై దొర్లే లగేజీ చక్రాలు విపరీతమైన ధూళి, దుమ్ము, జుట్టు, చెత్తను పీల్చుకుంటాయి. వీటికి టేప్ చుట్టడం వల్ల చక్రాల ఉపరితలంపై మురికి నేరుగా చేరకుండా తాత్కాలిక అడ్డుకట్ట వేయవచ్చు. ప్రయాణం ముగిశాక ఆ టేప్‌ను తొలగిస్తే, దానితో పాటు కొంత మురికి కూడా బయటికి వచ్చేస్తుంది. దీని వల్ల ఆ దుమ్ము, ధూళి వాటికి చేరుకోదు. బ్యాక్టీరియా కూడా చేరదు.

అయితే, ఈ రూల్ ఫాలో అవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. టేప్‌ను సరిగ్గా చుట్టకపోతే లేదా మందంగా, వదులుగా చుడితే చక్రాలు సరిగ్గా తిరగకపోవచ్చు. అంతేకాకుండా, టేప్ తొలగించిన తర్వాత మిగిలిపోయే జిగురు మరింత ధూళిని ఆకర్షించే అవకాశం ఉంది. ఇది కేవలం తాత్కాలిక చర్య మాత్రమే. ప్రతిసారీ టేప్ చుట్టడానికి బదులుగా, ప్రయాణం అయిపోయిన తర్వాత లగేజీ చక్రాలను శుభ్రం చేసుకోవాలి. వీల్స్ వద్ద ఉన్న జుట్టు, చెత్తను వెంటనే తొలగించాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Money Vastu: ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా? ఈ వారాల్లో పొరపాటున కూడా ఇవ్వకూడదు!
Recommended image2
Poori oil: వేడి నూనెలో ఆ పదార్థాలు వేస్తే పూరీలు, పకోడీలు నూనె పీల్చవా?
Recommended image3
Parenting: మీ పిల్లలు ఎప్పుడూ గొడవ పడుతున్నారా? ఈ 5 చేస్తే వారి మధ్య ప్రేమ పెరగడం పక్కా!
Related Stories
Recommended image1
Mutton: చలికాలంలోనే మటన్ ఎందుకు ఎక్కువ రుచిగా ఉంటుంది..? అసలు కారణం ఇదే..!
Recommended image2
Eggs: రోజుకి ఎన్ని కోడిగుడ్లు తినాలి? మరీ ఎక్కువగా తింటే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved