MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Ginger Storage Tips: అల్లం ఎండిపోకుండా నెలల పాటు తాజాగా ఉంచే సూపర్ టిప్స్ ఇవిగో!

Ginger Storage Tips: అల్లం ఎండిపోకుండా నెలల పాటు తాజాగా ఉంచే సూపర్ టిప్స్ ఇవిగో!

Ginger Storage Tips: మార్కెట్ నుంచి తెచ్చిన అల్లం రెండు, మూడు రోజులకే ఎండిపోతోందా? ఫ్రిజ్‌లో పెట్టినా, గట్టిగా పీచులా మారుతోందా? అయితే మీ కోసమే ఈ వార్త. అల్లాన్ని నెలల పాటు తాజాగా ఉంచే కొన్ని అద్భుతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి ట్రై చేయండి.

2 Min read
Author : Kavitha G
Published : May 15 2026, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అల్లాన్ని తాజాగా ఉంచే చిట్కాలు
Image Credit : Getty

అల్లాన్ని తాజాగా ఉంచే చిట్కాలు

అల్లం.. వంటకాలకు రుచిని పెంచుతుంది. అల్లం లేని టీ, కూర ఊహించుకోలేం. అల్లం.. రుచే కాదు, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ వేసవి వేడికి ఇది త్వరగా ఎండిపోతుంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో అల్లాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
కాటన్ క్లాత్, టిష్యూ వాడకం
Image Credit : Socialmedia

కాటన్ క్లాత్, టిష్యూ వాడకం

అల్లంపై ఉండే తేమ వల్లే అది త్వరగా పాడవుతుంది. అందుకే అల్లాన్ని కొన్న వెంటనే శుభ్రంగా కడిగి, పూర్తిగా ఆరబెట్టాలి. తర్వాత ఒక టిష్యూ లేదా మెత్తని కాటన్ క్లాత్‌లో చుట్టి, గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే అల్లం చాలా రోజులవరకు తాజాగా ఉంటుంది.

37
జిప్‌లాక్ బ్యాగుల వాడకం
Image Credit : AI

జిప్‌లాక్ బ్యాగుల వాడకం

సాధారణ ప్లాస్టిక్ కవర్లకు బదులు జిప్‌లాక్ బ్యాగులు వాడటం చాలా మంచిది. అల్లాన్ని బ్యాగ్‌లో పెట్టిన తర్వాత, లోపల గాలి లేకుండా జాగ్రత్తగా నొక్కి సీల్ చేయాలి. గాలి తగలకపోతే అల్లం ఎండిపోకుండా ఉంటుంది. ఈ జిప్ లాక్ బ్యాగును ఫ్రిజ్‌లో పెడితే వేసవి వేడి వల్ల అల్లం పాడుకాకుండా ఉంటుంది. 

47
ఫ్రీజర్‌లో నిల్వ
Image Credit : Getty

ఫ్రీజర్‌లో నిల్వ

మీ దగ్గర అల్లం ఎక్కువగా ఉండి, పాడవుతుందేమో అని భయపడితే ఫ్రీజింగ్ పద్ధతి ఉత్తమమైనది. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక బాక్స్‌లో పెట్టి ఫ్రీజర్‌లో ఉంచాలి. లేదా అల్లం పేస్ట్ చేసి ఐస్ ట్రేలలో వేసి క్యూబ్స్‌లా తయారు చేసుకోవాలి. ఆ క్యూబ్స్ గడ్డకట్టిన తర్వాత, వాటిని ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి నిల్వ చేసుకోవచ్చు. వంట చేసేటప్పుడు ఒక్కో క్యూబ్ తీసి వాడుకోవచ్చు.

57
వెనిగర్ లేదా నిమ్మరసం
Image Credit : Getty

వెనిగర్ లేదా నిమ్మరసం

అల్లం పొట్టు తీసి, ముక్కలుగా కోసి ఒక గాజు సీసాలో వేయాలి. అల్లం మునిగేంత వరకు వెనిగర్ లేదా నిమ్మరసం పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల అల్లం పాడవకుండా ఉండటమే కాకుండా, దాని రుచి కూడా పెరుగుతుంది. 

67
ఇసుకలో నిల్వ చేయడం
Image Credit : our own

ఇసుకలో నిల్వ చేయడం

ఒకవేళ మీ దగ్గర ఫ్రిజ్ అందుబాటులో లేకపోతే, ఒక వెడల్పాటి పాత్రలో పొడి ఇసుక వేసి, అందులో అల్లాన్ని పాతిపెట్టాలి. ఇది అల్లానికి కావాల్సిన చల్లదనాన్ని ఇస్తూ, బయటి వేడి నుంచి కాపాడుతుంది. మన పూర్వికులు ఇదే పద్ధతిని పాటించేవారట.

77
ఇది ముఖ్యం
Image Credit : AI Image

ఇది ముఖ్యం

అల్లాన్ని పూర్తిగా ఆరబెట్టకుండా నిల్వ చేస్తే లేదా ఎక్కువ తేమ ఉన్న చోట పెడితే అది త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిల్వ చేసే ముందు అల్లం పొడిగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Cooler: మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? కూలర్ వాడేటప్పుడు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే!
Recommended image2
Curry Leaves: జుట్టు ఒత్తుగా పెరగాలా? కరివేపాకును ఇలా వాడితే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved