MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Cooler: మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? కూలర్ వాడేటప్పుడు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే!

Cooler: మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? కూలర్ వాడేటప్పుడు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే!

Cooler: ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో చాలా ఇళ్లలో కూలర్ల వినియోగం సాధారణమైపోయింది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో కూలర్లను ఎక్కువగా వాడుతుంటారు. కానీ అవి పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మీకు తెలుసా? 

2 Min read
Author : Kavitha G
Published : May 13 2026, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిన్న పిల్లల ఆరోగ్యంపై కూలర్ల ప్రభావం
Image Credit : AI

చిన్న పిల్లల ఆరోగ్యంపై కూలర్ల ప్రభావం

వేసవికాలంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి కూలర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో గది చల్లగా ఉండాలని తల్లిదండ్రులు ఎక్కువగా కూలర్లను ఉపయోగిస్తుంటారు. అయితే కూలర్ వల్ల చిన్నపిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. కూలర్ వాడే విధానంలో పొరపాట్లే అందుకు కారణం అంటున్నారు. అవేంటో వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పిల్లలకు ఈ సమస్యలు వచ్చే అవకాశం
Image Credit : Pinterest

పిల్లలకు ఈ సమస్యలు వచ్చే అవకాశం

నిపుణుల ప్రకారం కూలర్‌ను నిర్లక్ష్యంగా వాడితే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ఉష్ణోగ్రత మార్పులకు వారు త్వరగా ప్రభావితమవుతారు. కూలర్ నుంచి వచ్చే చల్లని గాలి నేరుగా పిల్లలపై పడితే జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లల్లో శ్వాస సంబంధిత సమస్యలు కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అలెర్జీ, ఆస్తమా వంటి సమస్యలు ఉన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కూలర్ గాలి నేరుగా పిల్లల ముఖానికి తగలకుండా చూసుకోవాలి.

35
కూలర్ ట్యాంక్ శుభ్రం చేయడం
Image Credit : Pinterest

కూలర్ ట్యాంక్ శుభ్రం చేయడం

కూలర్‌లో ఎక్కువకాలం నీటిని మార్చకుండా ఉంచడం ప్రమాదకరం. నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు, బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సూక్ష్మజీవులు గాలిలో కలిసినప్పుడు పిల్లలకు అలెర్జీలు, చర్మ సమస్యలు లేదా శ్వాసకోశ ఇబ్బందులు రావచ్చు. అందుకే కూలర్ ట్యాంక్‌ను తరచుగా శుభ్రం చేయడం ముఖ్యం. కనీసం వారానికి ఒకసారి నీటిని పూర్తిగా మార్చి, లోపల భాగాలను కడగాలని నిపుణులు సూచిస్తున్నారు.

45
వెంటిలేషన్ లేకపోతే?
Image Credit : chat GPT

వెంటిలేషన్ లేకపోతే?

చాలా మంది కూలర్ వేసుకొని గదిని పూర్తిగా మూసేస్తారు. కానీ కూలర్ సరిగ్గా పనిచేయాలంటే కొద్దిగా గాలి బయటకు వెళ్లేలా వెంటిలేషన్ ఉండాలి. లేకపోతే గదిలో తేమ పెరిగి ఉక్కపోత వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లలకు అసౌకర్యం కలగడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. కాబట్టి కూలర్ ఉపయోగించే సమయంలో కిటికీ లేదా తలుపు కొద్దిగా తెరిచి ఉంచడం మంచిది.

55
ఎక్కువ చల్లదనం వద్దు
Image Credit : chat GPT

ఎక్కువ చల్లదనం వద్దు

పిల్లలను ఎక్కువసేపు చల్లని గదిలో ఉంచడం కూడా మంచిది కాదు. అలాగే బయట వేడి వాతావరణం నుంచి ఒక్కసారిగా పిల్లలను చాలా చల్లని గదిలోకి  తీసుకువెళ్లడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పు ఏర్పడి జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో కూలర్‌ను హై స్పీడులో పెట్టకూడదు. పిల్లలకు సౌకర్యంగా ఉండే స్థాయిలో మాత్రమే చల్లదనం ఉండేలా చూసుకోవాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
చిన్నారుల సంరక్షణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Mobile Phone Safety: మొబైల్ ఫోన్ ని ఈ ప్లేస్ లో పెట్టారో ఇక అంతే సంగతులు!
Recommended image2
Cooler: కొత్త కూలర్ కొనాలనుకుంటున్నారా? మోసపోవద్దంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved