MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Sleep Psychology: రాత్రి ఎక్కువసేపు మెలకువతో ఉండేవాళ్ల గురించి సైకాలజీ ఏం చెప్తోందో తెలుసా?

Sleep Psychology: రాత్రి ఎక్కువసేపు మెలకువతో ఉండేవాళ్ల గురించి సైకాలజీ ఏం చెప్తోందో తెలుసా?

సాధారణంగా రాత్రిపూట అందరూ నిద్రపోతారు. కానీ కొందరికి మాత్రం ఎంత ట్రై చేసినా నిద్రపట్టదు. ఆ టైంలో వారి ఆలోచనలు, క్రియేటివిటీ మరింత పెరుగుతాయి. రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండటం చెడు అలవాటా? లేక శరీర సహజ లక్షణమా? సైకాలజీ ఏం చెబుతోందో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 24 2026, 08:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sleep Psychology
Image Credit : Getty

Sleep Psychology

రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరికి చదువు, ఉద్యోగం, క్రియేటివ్ పనుల వల్ల ఈ అలవాటు ఉంటే, మరికొందరికి సహజమైన శరీర గడియారం కారణంగా ఉంటుంది. సైకాలజీ ప్రకారం మన శరీరంలో పనిచేసే సర్కేడియన్ రిథమ్ అనే జీవ గడియారం నిద్ర చక్రాన్ని నియంత్రిస్తుంది. ఈ జీవ గడియారం ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా మారుతుంది. రాత్రిళ్లు చురుకుగా ఉండే వారిని సాధారణంగా నైట్ అవుల్స్ అంటారు. కొందరు ఉదయం వేళల్లో చురుకుగా ఉంటే, మరికొందరు రాత్రి వేళల్లో మంచి పనితీరును కనబరుస్తారు. అందువల్ల రాత్రి మెలకువగా ఉండటం చెడు అలవాటు కాదు, అది సహజ స్వభావం కూడా కావచ్చని సైకాలజీ చెబుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
క్రియేటివిటీ ఎక్కువ..
Image Credit : Getty

క్రియేటివిటీ ఎక్కువ..

సైకాలజీ ప్రకారం రాత్రిళ్లు మెలకువగా ఉండే వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉండే అవకాశముంది. చుట్టూ సైలెన్స్, తక్కువ డిస్టబెన్స్, ఒత్తిడి లేని పరిస్థితులు, లోతైన ఆలోచనలకు దోహదం చేస్తాయి. కొందరు రచయితలు, కళాకారులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు తమకు రాత్రి సమయం అత్యంత అనుకూలమైందిగా చెబుతుంటారు. వ్యక్తుల క్రమశిక్షణ, బాధ్యతాభావం, ఆత్మనియంత్రణ వంటి అంశాలు కూడా నిద్రపాటుపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.

35
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
Image Credit : stockPhoto

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

సైకాలజీ నిపుణుల ప్రకారం ఎక్కువకాలం తక్కువ నిద్రపోవడం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. డిప్రెషన్, ఆందోళన, చిరాకు వంటి సమస్యలు నిద్రలేమితో పెరుగుతాయి. సాధారణంగా పెద్దవారికి 7–9 గంటల నిద్ర అవసరం. అంతకంటే తక్కువగా నిద్రపోతే మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, భావోద్వేగ నియంత్రణ దెబ్బతినే అవకాశం ఉంటుంది. రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండి, ఉదయం త్వరగా లేవాల్సి వస్తే నిద్ర తగ్గుతుంది. ఇది దీర్ఘకాలంలో మానసిక ఒత్తిడిని పెంచుతుంది.

45
రాత్రి నిశబ్ధంలో..
Image Credit : Getty

రాత్రి నిశబ్ధంలో..

కొందరికి రాత్రి సమయం ఎమోషనల్ గా కాస్త సున్నితంగా ఉంటుంది. పగలు పనులతో బిజీగా ఉండి మనసులోని ఆలోచనలు బయటపడకపోయినా, రాత్రి నిశబ్దంలో అవి స్పష్టంగా ఎదురవుతాయి. ఒక విషయం గురించి మళ్లీ మళ్లీ ఆలోచించడం.. ఆందోళన, నిద్రలేమికి దారితీస్తుంది. సైకాలజీ ప్రకారం, రాత్రి పడుకునే ముందు డిజిటల్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం, కెఫిన్‌ను సాయంత్రం తర్వాత తీసుకోకపోవడం, ధ్యానం లేదా శ్వాస అభ్యాసం చేయడం వంటి అలవాట్లు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి.

55
నిద్రను ప్రభావితం చేసే అంశాలు
Image Credit : our own

నిద్రను ప్రభావితం చేసే అంశాలు

మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, రాత్రి మెలకువగా ఉండే వారిలో స్వతంత్ర భావాలు, సృజనాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వారు సాధారణ నియమాలకు భిన్నంగా ఆలోచించే ధోరణి కలిగి ఉండవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించదు. వ్యక్తి జీవనశైలి, పని సమయం, శారీరక ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు వంటి అనేక అంశాలు నిద్రను ప్రభావితం చేస్తాయి. రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండటం ఒక లక్షణం కావచ్చు, కానీ అది ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండేలా చూసుకోవడం అత్యంత ముఖ్యమని సైకాలజీ నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
భోజనం తర్వాత నెయ్యి, చిన్న బెల్లం ముక్క కలిపి ఎందుకు తినాలి?
Recommended image2
Lemon: నిమ్మరసం, కొబ్బరి నూనెతో చుండ్రును వదిలించుకోండిలా
Recommended image3
Blouse: పింక్ చీరకు ఏ రంగు బ్లౌజ్ బాగా సెట్ అవుతుందో చూడండి
Related Stories
Recommended image1
Love Psychology: సైకాలజీ ప్రకారం ప్రేమలో ఉన్నవాళ్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే!
Recommended image2
Relationship Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని నిజంగా మిస్ అయ్యేవారు చేసే 5 పనులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved