వీటిని ఎక్కువగా తినకండి.. లేదంటే గుండె జబ్బులొస్తయ్ జాగ్రత్త..
ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన వాటినే తినాలి. కానీ కొంతమంది ఆరోగ్యాన్ని పాడుచేసే వాటినే ఎక్కువగా తింటుంటారు. మీకు తెలుసా.. నోటికి రుచిగా ఉన్నాయని కొన్నింటిని ఎక్కువగా తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

heart attack
మన తాతలు, ముత్తాతలు బతికిన లైఫ్ స్టైల్ కు, మనం బతుకున్న లైఫ్ స్టైల్ కు చాలా తేడా ఉంటుంది. వాళ్లు తినే ఫుడ్, బతికే విధానం వంటివన్నీ మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. కానీ ఇప్పుడున్న మన అలవాట్లు ఎన్నో రోగాలను పుట్టించేవిగానే ఉన్నాయి. ముఖ్యంగా రుచిగా ఉన్నాయని, అందంగా కనిపిస్తున్నాయని ఏవి పడితే అవి తింటే ఆరోగ్యం రిస్క్ లో పడినట్టే. ముఖ్యంగా కొన్నింటిని ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులచ్చే అవకాశం ఉంది. అయినా ఈ మధ్యకాలంలో 25 నుంచి 30 ఏండ్ల వారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దీనికి కారణం శారీరక శ్రమ లేకపోవడం, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను ఎక్కువగా తినడం.
heart attack
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ రక్తనాళాలకు అడ్డుపడుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఆల్కహాల్, సిగరేట్
ఆల్కహాల్ ను అప్పుడప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. సిగరేట్ మాత్రం అస్సలు మంచిది కాదు. ఈ అలవాట్ల వల్ల కాలెయం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అంతేకాదు గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల బీపీ బాగా పెరుగుతుంది. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఈ అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండాలి.
కూల్ డ్రింక్స్
ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా.. ఆల్కహాల్ తో పాటుగా కూల్ డ్రింక్స్ కూడా పక్కాగా ఉంటాయి. వేసవిలో అయితే వీటిని రోజూ తాగుతుంటారు. కానీ ఇవి మన పాణానికి అంత మంచివి కావు. ఎందుకంటే వీటిలో ఉండే సోడియం గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
ఆయిల్ ఫుడ్స్
ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే ఆయిలీ ఫుడ్స్ ను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది. ఇది కాస్త గుండె జబ్బులకు దారితీస్తుంది. అందుకే ఆయిలీ ఫుడ్స్ ను ఎక్కువగా తినకూడదు.
ప్రాసెస్డ్ మీట్
మాంసం ద్వారా మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. కానీ ప్రాసెస్ట్ మీట్ అంత మంచిది కాదు. ఎందుకంటే వీటిలో సాల్ట్ ఎక్కువుంటుంది. ఈ ఉప్పు రక్తపోటుకు పెంచుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది.