MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Soya: సోయా బీన్స్ Vs సోయా చంక్స్.. రెండింటికీ తేడా ఏంటి? ఏది మంచిది?

Soya: సోయా బీన్స్ Vs సోయా చంక్స్.. రెండింటికీ తేడా ఏంటి? ఏది మంచిది?

Soya: వెజిటేరియన్స్ కి ఉన్న ప్రోటీన్ సోర్స్ లలో సోయా కూడా ఒకటి. మరి, సోయా ఎలా తీసుకుంటే మంచిది? సోయా బీన్స్ లేదా సోయా చంక్స్.. రెండింటిలో దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 17 2026, 05:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Soya
Image Credit : Getty

Soya

నాన్ వెజ్ ప్రియులకు ప్రోటీన్ సోర్స్ అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ, వెజిటేరియన్స్ కి పనీర్ తప్ప మరేదీ ఉండదు అని అనుకుంటారు. కానీ, పనీర్ కంటే ఎక్కువ ప్రోటీన్ సోయాలో ఉంటుంది. అయితే.. సోయాని ఎలా తీసుకోవాలి అనే విషయంలోనే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సోయా బీన్స్ తినాలా? లేక సోయా చంక్స్ తినాలా? ఏది ఎక్కువ ఆరోగ్యకరం..? దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సోయా వల్ల ఆరోగ్య ప్రయోజనాలు:
Image Credit : Getty

సోయా వల్ల ఆరోగ్య ప్రయోజనాలు:

తక్కువ కొవ్వు: సోయాలో సహజంగానే కొవ్వు తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉండదు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: గుండె జబ్బులను నివారించడంలో, వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

ఖనిజాల ఖజానా: కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి కీలక పోషకాలు ఇందులో లభిస్తాయి.

సంపూర్ణ ప్రొటీన్: తొమ్మిది రకాల అవసరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉండే అతికొద్ది శాకాహారాలలో సోయా ఒకటి.

33
సోయా గింజలు vs సోయా చంక్స్: దేనిలో ఎక్కువ ప్రొటీన్?
Image Credit : Asianet News

సోయా గింజలు vs సోయా చంక్స్: దేనిలో ఎక్కువ ప్రొటీన్?

పలు పరిశోధనల్లో తెలిపిన వివరాల ప్రకారం.. 100 గ్రాముల సోయా గింజలలో 36 గ్రాముల ప్రొటీన్ ఉండగా, అదే 100 గ్రాముల సోయా చంక్స్‌లో ఏకంగా 52 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది.

సోయా చంక్స్‌లో ప్రొటీన్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? సోయా గింజల్లో సహజంగానే కొంత కొవ్వు ఉంటుంది. సోయాబీన్ నూనెను తీసివేయగా మిగిలిన పిండితో సోయా చంక్స్‌ను తయారు చేస్తారు. అందుకే ఇవి దాదాపు కొవ్వు రహితంగా ఉండి, ప్రొటీన్‌ను అత్యధిక సాంద్రతలో కలిగి ఉంటాయి. అంటే సోయా చంక్స్ అనేవి నూనె తొలగించిన సోయా గింజలే.

సోయాను ప్రతిరోజూ తినవచ్చా? 

సోయా మంచిదే అయినప్పటికీ, దీనిని మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, దీని వెనక కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.. జన్యు మార్పిడి (GMO): దాదాపు 90 శాతానికి పైగా సోయా పంటలు జన్యుమార్పిడికి గురైనవే.

థైరాయిడ్ సమస్యలు: సోయా వినియోగం వల్ల థైరాయిడ్ హార్మోన్ (TSH) స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.

హార్మోన్ల అసమతుల్యత: సోయాలో ఉండే ఫైటోఈస్ట్రోజెన్లు రుతుక్రమంపై ప్రభావం చూపవచ్చు.

అధిక ప్రాసెసింగ్: ప్రాసెస్ చేసిన సోయా ఉత్పత్తులలో అనవసరమైన కేలరీలు పెరిగే ప్రమాదం ఉంది.

మొత్తంగా చూస్తే సోయా గింజలు, చంక్స్ రెండూ మంచివే అయినప్పటికీ, తక్కువ కొవ్వు శాతం కారణంగా సోయా చంక్స్‌లో ప్రొటీన్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా సోయాను మితంగా, సరైన పద్ధతిలో తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Lungs: ఇలాంటి పనులు చేశారంటే మీ ఊపిరితిత్తులు త్వరగా దెబ్బతింటాయి
Recommended image2
Country Chicken : నాటుకోడికి పసుపు ఎందుకు రాస్తారో తెలుసా? ఈ సీక్రెట్ తెలిస్తే మీరూ ట్రై చేస్తారు
Recommended image3
ఆఫీస్ వేర్ కోసం అదిరిపోయే గోల్డ్ స్టడ్స్
Related Stories
Recommended image1
Bathroom Cleaning: ఈ ఒక్క పౌడర్ చల్లితే.. మీ బాత్రూమ్ టైల్స్ కొత్త వాటిలా మెరిసిపోతాయి..!
Recommended image2
Coffee Powder: కాఫీ పౌడర్ గడ్డకడుతోందా? ఇలా చేస్తే..కాఫీ పొడి ఎన్నిరోజులైనా ఫ్రెష్ గా ఉంటుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved