శాకాహారుల కోసం ఉత్తమ ప్రోటీన్ వనరులు
మాంసాహారులు అయితే మాంసం నుంచి ప్రోటీన్లను పొందుతారు. కానీ శాఖాహారులు ప్రోటీన్లను పొందడం చాలా కష్టం. ఎందుకంటే మాంసాహారానికి సమానంగా ప్రోటీన్లను కనుక్కోవడం కొంచెం కష్టం.
protein
ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రోటీన్లే మన శరీరానికి శక్తిని అందిస్తాయి. ఎముకలకు బలాన్ని ఇస్తాయి. కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. అయితే మాంసాహారులకు మాంసాల రూపంలో ప్రోటీన్లు కావాల్సినంతగా పొందుతాయి. కానీ శాకాహారులకు మాంసాహారులకు సమానమైన తగినంత ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలేంటో తెలుసుకోవడం కొంచెం కష్టమే. మన శరీరంలో ప్రోటీన్లు తగినంతగా లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.
శాకాహారులు తగినంత ప్రోటీన్ ను ఎలా పొందుతారు?
చికెన్, మటన్, వంటి మాంసాలల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ఎలాంటి ప్రోటీన్ల లోపం ఉన్నా పోతుంది. కానీ శాకాహారులు మాంసాహారుల్లా ప్రోటీన్లను పొందలేరు. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. శాకాహారులు కొన్ని ఆహారాలను తింటే ప్రోటీన్లను బాగా పొందుతారు. అవేంటంటే
గుడ్లు
గుడ్లు ప్రోటీన్లకు మంచి వనరులు. శాకాహారులు రోజువారీ ప్రోటీన్ ను పొందడానికి గుడ్లు మంచి ఎంపిక. రోజుకు 6 గ్రాముల గుడ్డును తింటే శరీరంలో ప్రోటీన్ల లోపం ఉండదు. గుడ్లను అనేక పద్దతుల్లో తినొచ్చు. ఉడకబెట్టి తింటే ఇంకా మంచి ఫలితాలను పొందుతారు.
peanut butter
వేరుశెనగ వెన్న
వేరుశెనగ వెన్న ఎంతో టేస్టీగా ఉంటుంది. నిజానికి వేరుశెనగ వెన్నలో ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజుకు 2 టేబుల్ స్పూన్లు అంటే 8 గ్రాములు వేరుశెనగ వెన్నను తీసుకుంటే మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఈ వేరుశెనగ వెన్నను ఇంట్లో కూడా తయరుచేసుకోవచ్చు. ఇదే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
చిక్పీస్
చిక్పీస్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. గుండెకు మేలు చేసే అన్ని రకాల ప్రోటీన్లు దీనిలో ఉంటాయి. ఇందుకోసం ప్రతిరోజూ కనీసం 2 టేబుల్ స్పూన్లు అంటు 2 గ్రాముల చిక్పీస్ ను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని సలాడ్లు, మిశ్రమ కూరగాయల వంటకాల్లో వేస్తుంటారు.
పాలు
పాలలో కాల్షియం మాత్రమే కాదు ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ 4 గ్రాముల అంటే 4 ఔన్స్ పాలను తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాదా పాలను తాగడం ఇష్టం లేకపోతే స్మూతీలు లేదా తృణధాన్యాలు, లేదా వోట్మీల్ ను తయారుచేయడానికి వీటిని ఉపయోగించండి. అయితే పాలలో పసుపును వేసుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో పసుపు పాలను తాగితే జలుబు, దగ్గు నుంచి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి.
Image: Getty Images
విత్తనాలు
విత్తనాల్లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ గుప్పెడు అంటే 2 టేబుల్ స్పూన్లు లేదా 1 గ్రా విత్తనాలను తీసుకోవాలి. విత్తనాలను గింజలతో కలిపి రోజూ తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
walnuts
వాల్ నట్స్
వాల్ నట్స్ ప్రోటీన్ కు మంచి వనరులు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ గుప్పెడు వాల్ నట్స్ ను తినాలి. ఒక వడ్డింపులో 2 టేబుల్ స్పూన్లు అంటే 2 గ్రాములను తినాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని పానీయాలు, షేక్స్ లల్లో, సలాడ్లు వంటి ఆహారాల్లో వేసుకుని తినొచ్చు.