MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • AC Water Reuse: ఏసీ వేస్ట్ వాటర్‌ పడేస్తున్నారా? ఇలా చేస్తే 30 లీటర్ల నీరు ఆదా అవుతుంది

AC Water Reuse: ఏసీ వేస్ట్ వాటర్‌ పడేస్తున్నారా? ఇలా చేస్తే 30 లీటర్ల నీరు ఆదా అవుతుంది

AC Water Reuse: ఎండల తీవ్రత పెరుగుతోంది. వేసవి తాపం తట్టుకోవాలంటే ఏసీ ఉండాల్సిందే. కానీ ఎప్పుడైనా ఆలోచించారా..ఏసీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ గురించి?. నీళ్లు వృథా అవుతోందని అనిపించిందా? అయితే ఇలా చేస్తే మాత్రం రోజుకు 20-30 లీటర్ల నీటిని సేవ్ చేయొచ్చు.

2 Min read
Author : Nandini Arava
Published : Apr 23 2026, 08:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఏసీ వాటర్‌ వృథాకాకుండా సూపర్ ట్రిక్
Image Credit : AI Image

ఏసీ వాటర్‌ వృథాకాకుండా సూపర్ ట్రిక్

వేసవిలో ఏసీ వాడకం ఎక్కువ కాబట్టి, డ్రెయిన్ పైపు నుంచి చాలా నీరు వృథాగా పోతుంది. ఒక సాధారణ ఏసీ రోజుకు సుమారు 20 నుంచి 30 లీటర్ల నీటిని బయటకు వదులుతుంది. ఈ నీటిని తెలివిగా ఎలా వాడుకోవాలో తెలిస్తే, వేసవి నీటి కొరత నుంచి మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఏసీ నుంచి వచ్చే నీటిని ఇంట్లో ఎలా వాడుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
జాగ్రత్త..తాగడానికి, వంటకు పనికిరావు
Image Credit : Chat GPT

జాగ్రత్త..తాగడానికి, వంటకు పనికిరావు

ఏసీ నుంచి వచ్చే నీరు డిస్టిల్డ్ వాటర్ లాంటిది. ఇందులో క్లోరిన్ లేదా ఇతర మినరల్స్ ఉండవు. అందుకే మొక్కలకు, కారు కడగడానికి, ఇల్లు శుభ్రం చేయడానికి దీన్ని వాడొచ్చు. కానీ, గాలిలోని బ్యాక్టీరియా ఇందులో చేరే అవకాశం ఉన్నందున తాగడానికి, వంట చేయడానికి అస్సలు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ నీటిని బకెట్‌లో పట్టుకోవడం ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చు.

Related Articles

Related image1
Power Saving Tips: AC, కూలర్, ఫ్యాన్ ఎక్కువగా వాడినా కరెంట్ బిల్లు తగ్గాలా? ఇలా చేస్తే చాలు!
Related image2
AC: ఏసీ పేలిపోకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరి! ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు..
37
మొక్కలకు నీరు పోయడం
Image Credit : chat gpt

మొక్కలకు నీరు పోయడం

ఏసీ నీరు సాఫ్ట్ వాటర్. ఇందులో క్లోరిన్ ఉండదు. కాబట్టి మొక్కల పెరుగుదలకు ఇది చాలా మంచిది. మీ పెరట్లో లేదా బాల్కనీలోని మొక్కలకు ఈ నీటిని ఎలాంటి సందేహం లేకుండా పోయవచ్చు.
47
వాహనాలు కడగడానికి
Image Credit : Getty

వాహనాలు కడగడానికి

కారు లేదా బైక్ కడగడానికి ఈ నీరు బాగా పనిచేస్తుంది. కుళాయి నీటితో కడిగితే కొన్నిసార్లు వాహనాలపై తెల్లటి మరకలు పడతాయి. కానీ ఏసీ నీటితో ఆ సమస్య ఉండదు.

57
ఇంటి పనుల కోసం
Image Credit : Getty

ఇంటి పనుల కోసం

ఇల్లు తుడవడానికి (మాపింగ్), కిటికీ అద్దాలు శుభ్రం చేయడానికి లేదా టాయిలెట్లలో ఫ్లష్ చేయడానికి ఈ నీటిని ఉపయోగించవచ్చు. దీనివల్ల మీరు రోజూ మంచి నీటిని గణనీయంగా ఆదా చేయవచ్చు.
67
స్టీమ్ ఐరన్ చేసుకోవడానికి
Image Credit : Getty

స్టీమ్ ఐరన్ చేసుకోవడానికి

బట్టలు ఐరన్ చేసేటప్పుడు స్టీమ్ ఐరన్ బాక్సుల్లో ఈ నీటిని పోయవచ్చు. సాధారణ నీటిలోని మినరల్స్ వల్ల ఐరన్ బాక్సులు త్వరగా పాడవుతాయి. కానీ, ఏసీ నీరు డిస్టిల్డ్ వాటర్ కాబట్టి ఐరన్ బాక్స్ ఎక్కువ కాలం మన్నుతుంది.
77
నీటిని వృథా చేయకుండా అవసరమైనంత మాత్రమే ఉపయోగించండి.
Image Credit : Freepik

నీటిని వృథా చేయకుండా అవసరమైనంత మాత్రమే ఉపయోగించండి.

ఏసీ నీటిని పొరపాటున కూడా తాగడానికి, స్నానం చేయడానికి లేదా వంట చేయడానికి వాడకూడదు. ఏసీ కాయిల్స్ నుంచి దుమ్ము, ధూళి ఈ నీటిలో కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కేవలం శుభ్రపరిచే పనులకే పరిమితం చేయాలి. నీటి కొరత పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ నీటిని ఒక వనరుగా చూడటం చాలా ముఖ్యం. రేపటి నుంచి మీ ఏసీ పైపు కింద ఓ బకెట్ పెట్టి చూడండి!

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
Power Saving Tips: AC, కూలర్, ఫ్యాన్ ఎక్కువగా వాడినా కరెంట్ బిల్లు తగ్గాలా? ఇలా చేస్తే చాలు!
Recommended image2
AC: ఏసీ పేలిపోకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరి! ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved