MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Gold Buying Tips: బంగారం కొంటున్నారా? బీ కేర్ ఫుల్.. ఇవి తెలియకపోతే నష్టమే!

Gold Buying Tips: బంగారం కొంటున్నారా? బీ కేర్ ఫుల్.. ఇవి తెలియకపోతే నష్టమే!

బంగారం కొనడం అనేది చాలామంది జీవితంలో ఒక పెద్ద పెట్టుబడి. కానీ, సరైన అవగాహన లేకపోతే చిన్న తప్పుల వల్ల కూడా పెద్ద నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోసపోయే అవకాశాల గురించి ఇక్కడ క్లియర్‌గా తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Mar 31 2026, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : Getty

బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బంగారం కొనేటప్పుడు మొదట BIS హాల్‌మార్క్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. దేశంలో బంగారం నాణ్యతను నిర్ధారించేది Bureau of Indian Standards (BIS). ఈ BIS హాల్‌మార్క్ లేకపోతే బంగారాన్ని కొనకూడదు. 22 క్యారెట్ అంటే 916 స్టాంప్ ఉండాలి. HUID నంబర్ కూడా ఉండాలి. ఇవి లేకపోతే, అది నకిలీ లేదా తక్కువ శుద్ధి బంగారం కావచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
బిల్ తీసుకోవడం తప్పనిసరి
Image Credit : Asianet News

బిల్ తీసుకోవడం తప్పనిసరి

బంగారం కొనేటప్పుడు ఎప్పుడూ GST బిల్ తీసుకోవాలి. బిల్ లేకపోతే తర్వాత అమ్మేటప్పుడు సమస్యలు వస్తాయి. వారంటీ/ఎక్స్చేంజ్ కూడా కష్టమవుతుంది.

మేకింగ్ ఛార్జీలు చెక్ చేయడం

కొన్ని షాపులు 5% నుంచి 25% వరకు మేకింగ్ ఛార్జీలు వేస్తాయి. తక్కువ ధర చెప్పి ఎక్కువ మేకింగ్ ఛార్జీలు వేయడం కామన్ ట్రిక్. కాబట్టి కొనే ముందు మొత్తం ధర బ్రేకప్ అడగడం మంచిది.

37
22 క్యారెట్, 24 క్యారెట్ కి తేడా తెలుసుకోవడం
Image Credit : Getty

22 క్యారెట్, 24 క్యారెట్ కి తేడా తెలుసుకోవడం

24 క్యారెట్ గోల్డ్ అంటే.. పెట్టుబడి కోసం వాడతారు. ఇది బిస్కెట్లు, కాయిన్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ నగల తయారీలో వాడతారు. కొన్నిసార్లు నగలు కొంటే 24 క్యారెట్ పేరుతో 22 క్యారెట్ గోల్డ్ నే అమ్ముతారు. అంటే 22 క్యారెట్ బంగారానికి 24 క్యారెట్ ధర వేస్తారు. ఇది చెక్ చేసుకోవాలి.

47
బరువు చెక్ చేయడం
Image Credit : Getty

బరువు చెక్ చేయడం

రాళ్లు, ముత్యాలు ఉన్న నగల్లో బరువు ఎక్కువ చూపిస్తారు. ఆ రాళ్ల బరువుకి కూడా బంగారం ధర వేస్తారు. ఇది గమనించి, నెట్ గోల్డ్ వెయిట్ ని ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవాలి.

రోజువారీ ధరలు చెక్ చేయడం

ప్రతి రోజు బంగారం ధరలు మారుతూ ఉంటాయి. కాబట్టి ముందుగా మార్కెట్ రేటు తెలుసుకుని వెళ్లడం మంచిది.

57
ఈ విషయాల్లో కూడా మోసపోవచ్చు
Image Credit : Getty

ఈ విషయాల్లో కూడా మోసపోవచ్చు

కొన్ని లోకల్ షాపులు హాల్‌మార్క్ లేకుండా తక్కువ ధరకు అమ్ముతాయి. ఇలా చేస్తే, తర్వాత అమ్మేటప్పుడు విలువ తగ్గుతుంది.

కొన్ని షాపుల్లో తక్కువ రేటు అని ఆకర్షించి, మేకింగ్ ఛార్జీలు ఎక్కువ వేస్తుంటారు. అలాగే తరుగు పేరుతో అదనంగా డబ్బులు లాగే ప్రయత్నం చేస్తుంటారు.

స్టోన్ జ్యువెలరీలో విషయంలో కూడా మోసాలు జరుగుతూ ఉంటాయి. బంగారంతో సమానంగా రాళ్ల ధర వేసి బిల్లు పెంచుతుంటారు.

67
ఈ మోసాలు ఎక్కువ
Image Credit : Getty

ఈ మోసాలు ఎక్కువ

అలాగే, ఎక్స్చేంజ్ సమయంలో మోసం జరిగే ఛాన్స్ ఉంది. పాత బంగారం ఇచ్చినప్పుడు.. తక్కువ శుద్ధి అని చెప్పి విలువ తగ్గించడం, మెషిన్ లేకుండా అంచనా వేసి మోసం చేయడం చేస్తారు.

ఇక ఆన్లైన్ మోసాలకు అంతుపొంతూ లేదు. సోషల్ మీడియాలో చూసి మోసపోకండి. ఫేక్ యాడ్స్ ద్వారా చీటింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ నమ్మకమైన బ్రాండ్లు మాత్రమే ఉపయోగించాలి.

ఇక నో మేకింగ్ ఛార్జెస్ ఆఫర్లు పెద్ద ఉచ్చు అని చెప్పాలి. మేకింగ్ ఛార్జీలు చూపించకుండా ధరలో కలిపేస్తారు. లేదా బంగారం ప్యూరిటీ తక్కువగా ఉంటుంది.

77
నిర్లక్ష్యం వద్దు
Image Credit : Getty

నిర్లక్ష్యం వద్దు

సేఫ్‌గా బంగారం కొనాలంటే.. పేరున్న, నమ్మకమైన జ్యువెలరీ షాపులు మాత్రమే ఎంచుకోవాలి. బిల్, హాల్‌మార్క్ తప్పనిసరి ఉండేలా చూడాలి. రెండు మూడు షాపుల్లో ధర పోల్చుకోవాలి.

బంగారం కొనడం అనేది కేవలం కొనుగోలు కాదు. అది ఒక పెట్టుబడి, ఒక భద్రత. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీస్తుంది. కాబట్టి హాల్‌మార్క్, బిల్, బరువు, మేకింగ్ ఛార్జీలు.. ఇలా అన్నీ క్లియర్ గా చెక్ చేసి మాత్రమే కొనాలి. జాగ్రత్తగా ఉంటే బంగారం మీకు లాభమవుతుంది. లేకపోతే నష్టం తప్పదు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంగారం
వ్యాపారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026 Telugu Wishes: వినాయక చవితికి మీ స్నేహితులకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి
Recommended image2
Gold Rings: 1గ్రాము బంగారంతో అదిరిపోయే ఉంగరాల డిజైన్లు
Recommended image3
Stone Anklets: కలర్ స్టోన్ పట్టీల డిజైన్లు.. చీరలపై చక్కగా నప్పుతాయి
Related Stories
Recommended image1
Gold Earrings: సింపుల్ సింగిల్ చైన్ ఇయర్ రింగ్స్- పెట్టుకుంటే అదుర్స్!
Recommended image2
Gold Earrings: ట్రెండీ డిజైన్ బ్లూ స్టోన్ ఇయర్ రింగ్స్.. ట్రై చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved