MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • DMart : శని, ఆదివారాలు కాదు, ఈ 2 రోజులు డీమార్ట్ లో షాపింగ్ చేశారో.. 15-20% ఖర్చు సేవ్

DMart : శని, ఆదివారాలు కాదు, ఈ 2 రోజులు డీమార్ట్ లో షాపింగ్ చేశారో.. 15-20% ఖర్చు సేవ్

సామాన్య, మిడిల్ క్లాస్ ప్రజలకు బాగా దగ్గరైన సూపర్ మార్కెట్ డిమార్ట్. చాలామంది వీకెండ్ లో నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు కొనేందుకు వెళుతుంటారు… కానీ వీక్ డే లో వెళితేనే డీమార్ట్ లో మంచి ఆఫర్లు పొందవచ్చట. ఏఏ రోజుల్లో డీమార్ట్ వెళితే లాభమో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 08 2026, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డిమార్ట్ షాపింగ్ టిప్స్
Image Credit : Gemini AI

డిమార్ట్ షాపింగ్ టిప్స్

సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌లో నెలవారీ సరుకుల ఖర్చే చాలా కీలకం. తక్కువ ధరకే ఎక్కువ సరుకులు కొనుగోలుచేసి డబ్బులు ఆదా చేసుకోవాలని చాలామంది భావిస్తారు… ఇలాంటివారిని డిమార్ట్ ఆకట్టుకుంటోంది. మార్కెట్లో మరెక్కడా దొరకనంత తక్కువ ధరకు ఇక్కడ కొన్ని సరుకులు, వస్తువులు లభిస్తాయి… ఇంకొన్ని MRP కంటే తక్కువకే వస్తాయి. అందుకే వీకెండ్ వచ్చిందంటే చాలు డిమార్ట్ జనాలతో నిండిపోతుంది.

ఉద్యోగాలు, వ్యాపార పనుల్లో వారమంతా బిజిబిజీగా ఉండేవారు శని, ఆదివారం సెలవులను కుటుంబ పనులకు కేటాయిస్తారు. అందుకే డిమార్ట్ లో సరుకులను కొనేందుకు ఎక్కువమంది ఈరోజుల్లోనే వెళుతుంటారు. కానీ వీకెండ్ లో కాకుండా వీక్ డే లో డీమార్ట్ లో షాపింగ్ చేస్తే ఎక్కువ డబ్బులు ఆదా చేయవచ్చట. మరీముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో డీమార్ట్ కు వెళితే ఎక్కువ డిస్కౌంట్స్, ఆఫర్లు పొందవచ్చట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డిమార్ట్ లో ఎప్పుడు షాపింగ్ చేయాలి?
Image Credit : Gemini AI

డిమార్ట్ లో ఎప్పుడు షాపింగ్ చేయాలి?

చాలామంది శని, ఆదివారాల్లోనే డి-మార్ట్‌కు వెళ్తుంటారు. కానీ వీకెండ్స్‌లో జనం ఎక్కువగా ఉండటం వల్ల కొత్త ఆఫర్లు లేదా స్పెషల్ డిస్కౌంట్లు దొరకడం కష్టం… అసలు ట్రాలీ పట్టుకుని నడిచేందుకే వీలుండదు. అదే సరిగ్గా వారంమధ్యలో అంటే మంగళ, బుధవారాల్లో డిమార్ట్‌కు వెళితే ఎక్కువ లాభం ఉంటుంది.

డిమార్ట్ లో వారానికోసారి మరీముఖ్యంగా మంగళ, బుధవారాల్లో తాజా కూరగాయలు, పండ్లు, సరుకులపై కొత్త ఆఫర్లు పెడతారు… కాబట్టి ఈరోజుల్లో అయితే మంచి సరుకు, తక్కువ ధరకు పొందవచ్చు. అంతేకాదు వర్కింగ్ డేస్‌లో జనం తక్కువగా ఉంటారు కాబట్టి కంగారు లేకుండా ప్రతి వస్తువు ధరను పోల్చి చూసుకుని నిదానంగా కొనుక్కోవచ్చు.

ఇక ప్రతినెల ఆరంభంలో కూడా డిమార్ట్ లో కస్టమర్స్ రద్దీ ఎక్కువగా ఉంటుంది… కాబట్టి సరైన ఆఫర్లు, డిస్కౌంట్స్ ను పొందలేం. కాబట్టి నెల మొదటి వారం కంటే 15 నుంచి 25వ తేదీల మధ్య వెళ్తే రద్దీ తక్కువగా ఉండి, మంచి డిస్కౌంట్లు దొరుకుతాయి.

34
ఉదయమే డిమార్ట్ కు వెళ్లండి..
Image Credit : Getty

ఉదయమే డిమార్ట్ కు వెళ్లండి..

ఇక చాలామంది సాయంత్రం సమయంలో డిమార్ట్ కు వెళుతుంటారు… కాానీ ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య వెళితే ఫ్రెష్ స్టాక్‌తో పాటు ఆ రోజు స్పెషల్ ఆఫర్లను ముందుగా సొంతం చేసుకోవచ్చు.

డిమార్ట్ సొంత బ్రాండ్లయిన 'D-Mart Premia', 'Homesail' వస్తువులు బయటి బ్రాండ్ల కంటే 20% నుంచి 40% తక్కువ ధరకే దొరుకుతాయి.

పండగ సమయాల్లో లేదా వారం మధ్యలో వచ్చే కాంబో ఆఫర్లను ఎంచుకుంటే మీ డబ్బు ఇంకా ఆదా అవుతుంది. కాబట్టి శనివారం రద్దీలో ఇబ్బంది పడే బదులు, మంగళ లేదా బుధవారాల్లో ఉదయం పూట డిమార్ట్‌కు వెళ్లి ప్లాన్ ప్రకారం సరుకులు కొనుక్కోండి.

44
డిమార్ట్ కు వెళ్లేముందు ఈ పని చేయండి..
Image Credit : Gemini AI

డిమార్ట్ కు వెళ్లేముందు ఈ పని చేయండి..

సరుకులు కొనడానికి వెళ్లే ముందే, ఇంట్లో ఏమేం కావాలో చూసుకుని కచ్చితమైన 'షాపింగ్ లిస్ట్' (Shopping List) రాసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల అనవసరమైన వస్తువులు కొనకుండా మీ బడ్జెట్ దాటకుండా చూసుకోవచ్చు.

అలాగే 'డిమార్ట్ రెడీ యాప్' (DMart Ready App) ద్వారా ముందుగానే ఆఫర్లను చెక్ చేసుకోవచ్చు. బిల్లు కట్టేటప్పుడు, కొన్ని ప్రత్యేక బ్యాంకుల డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా 'యూపీఐ' (UPI) క్యాష్‌బ్యాక్ ఆఫర్లను వాడితే ఇంకాస్త డబ్బు మిగులుతుంది.

ఇలా చిన్నచిన్న టిప్స్ పాటిస్తూ డిమార్ట్ లో షాపింగ్ చేస్తే మీ నెలవారీ సరుకుల బడ్జెట్‌లో కనీసం 15% నుంచి 20% వరకు డబ్బును ఈజీగా ఆదా చేసుకోవచ్చు. ఇది మీ కుటుంబ ఖర్చుల భారాన్ని కాస్త తగ్గించి ఊరట ఇస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: దసరా నవరాత్రులకు అదిరిపోయే చీరలు.. ఏరోజు ఏ రంగు చీర?
Recommended image2
Gold Bangles: కళ్లు చెదిరే డిజైన్ లో బంగారు గాజులు.. ఎంత బాగున్నాయో!
Recommended image3
Chana Dal: శనగపప్పు తొందరగా ఉడకడం లేదా? ఈ ఒక్క ట్రిక్ పాటిస్తే 10 నిమిషాల్లో మెత్తగా ఉడికిపోతుంది..!
Related Stories
Recommended image1
DMart : రూ.400-500 వస్తువులు కేవలం రూ.199కే.. డిమార్ట్ లో అదిరిపోయే ఆఫర్స్, మిస్ అవ్వకండి
Recommended image2
DMart : డీమార్ట్‌లో ఏ వస్తువులు, ఎలా కొనాలి? ఈ స్మార్ట్ షాపింగ్ టిప్స్ ఫాలోకండి.. వేలకు వేలు ఆదా చేసుకొండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved