MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Train: మన దేశంలో సైకిల్ కంటే నెమ్మదిగా వెళ్లే రైలు ఏదో తెలుసా? ఎక్కడ ప్రయాణిస్తుందంటే...

Train: మన దేశంలో సైకిల్ కంటే నెమ్మదిగా వెళ్లే రైలు ఏదో తెలుసా? ఎక్కడ ప్రయాణిస్తుందంటే...

Train: మన దేశంలో వేగంగా దూసుకుపోయే రైళ్లు ఎన్ని ఉన్నాయో.. నెమ్మదిగా వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా, సైకిల్ కంటే నెమ్మదిగా కదిలే రైలు కూడా ఒకటి ఉందని మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 13 2026, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
train
Image Credit : Pixabay

train

మనలో చాలా మంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. ముఖ్యంగా మన దేశంలో.. లాంగ్ జర్నీ చేయాలి అంటే ఎక్కువ మంది రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ఇండియన్ రైల్వేలో కొన్ని రైళ్లు గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంగా దూసుకుపోయేవి కూడా ఉన్నాయి. అయితే.. సైకిల్ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? అదే.. తమిళనాడులోని ‘నీలగిరి మౌంటైన్ రైల్వే’.

మేట్టుపాళయం నుంచి ఊటీ వరకు సాగే ఈ రైలు ప్రయాణం సాధారణ రైలు ప్రయాణంలా ఉండదు. కేవలం 46 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి దాదాపు ఐదు గంటల సమయం పడుతుంది. ఇంత తక్కువ దూరానికి అంత సమయం ఎందుకు పడుతుందో తెలుసా? దీని వెనక ఉన్న కారణం ఏంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సైకిల్ కంటే నెమ్మదిగా వెళ్తుందా?
Image Credit : Asianet News

సైకిల్ కంటే నెమ్మదిగా వెళ్తుందా?

సాధారణంగా ఒక వ్యక్తి రోడ్డుపై సైకిల్ తొక్కితే గంటకు 10 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలడు. కానీ, నీలగిరి మౌంటైన్ రైల్వే ప్రయాణ సమయాన్ని బట్టి చూస్తే, ఈ రైలు సగటు వేగం గంటకు కేవలం 9 కిలోమీటర్లు మాత్రమే. ఈ రైలు ఇంత నెమ్మదిగా వెళ్లడం వెనక కారణం ఏంటి అంటే.. ఈ రైలు ప్రయాణం నార్మల్ గా ఉండదు. కొండల మీద ప్రయాణించాలి. చాలా మలుపులు ఉంటాయి. చాలా స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. అందుకే.. చాలా నెమ్మదిగా వెళ్తుంది. అందుకే.. సైకిల్ కంటే నెమ్మదిగా వెళ్లే రైలు అని పిలుస్తుంటారు. అయితే, అంత నెమ్మదిగా వెళ్లినా కూడా.. ఈ రైలు ప్రయాణం చాలా అందంగా సాగుతుంది.

మేట్టుపాళయం నుంచి ఊటీ వరకు అద్భుత ప్రయాణం 

ఈ రైలు మేట్టుపాళయం నుంచి ప్రారంభమై కూనూర్ మీదుగా పర్యాటక ప్రాంతమైన ఊటీకి చేరుకుంటుంది. మైదాన ప్రాంతం నుంచి కొండల వైపు ప్రయాణం సాగుతున్న కొద్దీ ప్రకృతి దృశ్యాలు మారిపోతాయి. పచ్చని కొండలు, లోయలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈ రైల్వే మార్గం మొత్తం 46 కిలోమీటర్లు. మేట్టుపాళయం సముద్ర మట్టానికి 326 మీటర్ల ఎత్తులో ఉంటే, ఊటీ ఏకంగా 2,203 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే ఈ ప్రయాణంలో రైలు దాదాపు 1,877 మీటర్ల ఎత్తుకు ఎక్కాల్సి ఉంటుంది. ఈ మార్గంలో రైలు గరిష్ఠ వేగం గంటకు 30 కిలోమీటర్లు మాత్రమే. ఎత్తైన కొండలు, నిటారైన ఎక్కుడు ఉన్న చోట భద్రత దృష్ట్యా వేగాన్ని మరింత తగ్గిస్తారు.

33
వినూత్న టెక్నాలజీ..
Image Credit : Asianet News

వినూత్న టెక్నాలజీ..

సాధారణంగా రైలు చక్రాలు, పట్టాల మధ్య ఉండే పట్టుదల ద్వారా రైలు ముందుకు సాగుతుంది. కానీ కొండపై బాగా నిటారుగా ఉన్న చోట ఈ విధానం పనిచేయదు.

అందుకే మేట్టుపాళయం నుంచి కూనూర్ మధ్య నిటారైన మార్గంలో పట్టాల మధ్య ‘పళ్లు (Teeth)’ ఉన్న ప్రత్యేక ర్యాక్ సిస్టమ్‌ను అమర్చారు. ఇంజిన్‌లోని ‘పినియన్ గేర్’ ఈ పళ్లతో అనుసంధానమై రైలు కిందకు జారిపోకుండా కొండపైకి సురక్షితంగా ఎక్కిస్తుంది. ఈ సాంకేతికతే నీలగిరి రైలును ఎంతో ప్రత్యేకంగా నిలబెట్టింది.

రైలు ప్రయాణం ఎన్ని గంటలు పడుతుంది..? ఊటీ మున్సిపాలిటీ అధికారిక వెబ్‌సైట్ షెడ్యూల్ ప్రకారం.. మేట్టుపాళయం నుంచి ఉదయం 7:10 గంటలకు బయలుదేరే రైలు మధ్యాహ్నం 12:00 గంటలకు ఊటీ చేరుకుంటుంది. అంటే సరిగ్గా 4 గంటల 50 నిమిషాలు పడుతుంది. అలాగే తిరుగు ప్రయాణం ఊటీ నుండి మేట్టుపాళయం వరకు.. 3 గంటల 35 నిమిషాల సమయం పడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Brain Fog : బ్రెయిన్ ఫాగ్ అంటే ఏమిటి? ఇది ఆరోగ్య సమస్యా లేక మానసిక సమస్యా?
Recommended image2
Amla Pickle Recipe: టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి.. సింపుల్ రెసిపీ మీకోసం!
Recommended image3
Dry Fish : ఎండు చేపల కోసం మార్కెట్ దాకా వెళ్లక్కర్లేదు..ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి
Related Stories
Recommended image1
Fish: నదిలో పుట్టి.. సముద్రంలో పెరిగి, చావు కోసం మళ్లీ పుట్టిన నదికే వచ్చే చేప ఇది..!
Recommended image2
River: ఈ రెండు నదులు పక్కపక్కనే ప్రవహించినా కలవని నదులు ఇవి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved