MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • River: ఈ రెండు నదులు పక్కపక్కనే ప్రవహించినా కలవని నదులు ఇవి..!

River: ఈ రెండు నదులు పక్కపక్కనే ప్రవహించినా కలవని నదులు ఇవి..!

River: ప్రపంచంలో చాలా నదులు ఉన్నాయి. ఒక నది మరో నదితో కలిసి సంగమాలు కూడా ఏర్పరుస్తాయి. ఆ నదులు కలిసిన తర్వాత.. ఏ నీరు ఏ నది కి చెందినది అని మనం చెప్పలేం. కానీ, ఈ రెండు నదులు కలిసిపోయినా కూడా రెండు రంగుల్లో కనిపిస్తాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 13 2026, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
నదుల కలయిక..
Image Credit : Gemini ai

నదుల కలయిక..

ఒక నది మరో నదితో కలవడం చాలా సహజం. నదుల కలయికను మనం సంగమం అని పిలుస్తాం. అయితే, రెండు నదులు కలిసినా కూడా... అవి వేటికవి సపరేటుగా కనిపించే రెండు అరుదైన నదుల గురించి మీకు తెలుసా? ఒక నది నీలం లేదా నలుపు రంగులో ఉంటే.. మరో నది ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది. ఈ రెండు రంగుల నీళ్లు కలిసిపోకుండా పక్కపక్కనే ప్రవహిస్తూ, మధ్యలో ఒక స్పష్టమైన గీత గీసినట్లుగా ఉండిపోతాయి. ఈ రెండు నదులు కలిసినా కూడా.. నీటి రంగు ఎందుకు మారదు. కలిసినా కూడా.. ఎందుకు ఈ నదులు భిన్నంగా కనిపిస్తాయి..? అసలు ఈ నదులు ఎక్కడ ఉన్నాయి?

ఈ నదులు ఎక్కడ ఉన్నాయంటే...

ఈ అరుదైన నదులు బ్రెజిల్ లోని మనౌస్ నగరం సమీపంలో కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో అక్కడ నల్లటి రంగులో ప్రవహించే ‘రియో నీగ్రో’ నది, గోధుమ రంగులో ఉండే ‘సోలిమోయెస్ నది ఒక దానికొకటి కలుస్తాయి. ఈ రెండూ కలిసే అరుదైన దృశ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ‘ మీటింగ్ ఆఫ్ ది వాటర్స్’ అని కూడా పిలుస్తారు. ఈ రెండు నదులు కలిసినా కూడా.. డిఫరెంట్ గా రెండూ పక్క ప్రక్కనే ప్రవహిస్తున్నట్లు క్లియర్ గా కనపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
నదులు వేర్వేరు రంగుల్లో ఉండటం వెనక కారణం ఏంటి?
Image Credit : chat gpt

నదులు వేర్వేరు రంగుల్లో ఉండటం వెనక కారణం ఏంటి?

రియో నీగ్రో నది: ఈ నది దట్టమైన అటవీ ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో చెట్ల ఆకులు, మొక్కల అవశేషాలు కుళ్ళిపోయి నీటిలో కలిసే సేంద్రియ పదార్థాల వల్ల నీటికి ముదురు నలుపు లేదా నీలం రంగు వస్తుంది.

సోలిమోయెస్ నది: ఈ నది ఆండీస్ పర్వత ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చే భారీ మొత్తంలో మట్టి, ఇసుక, అవక్షేపాలను తనతో పాటు మోసుకొస్తుంది. ఆ మట్టి అవశేషాలు నీటిలో తేలుతుండటం వల్ల ఇది కాఫీ లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది.

కలిసిన వెంటనే నీరు ఒకే రంగులోకి ఎందుకు మారదు?

రెండు నదులు కలిసినప్పటికీ నీరు వెంటనే ఒకదానితో ఒకటి కలిసిపోయి నీటి రంగు మారదు. దీని వెనక కారణాలు కూడా ఉన్నాయి. రెండు నదుల నీరు ప్రవహించే వేగంలో తేడా ఉంటుంది. నీటి ఉష్ణోగ్రతలు వేర్వేరుగా ఉంటాయి. నీటిలోని సేంద్రియ పదార్థాలు, అవక్షేపాల వల్ల సాంద్రతలో మార్పు ఉంటుంది.

ఈ వ్యత్యాసాల కారణంగా నీరు వెంటనే కలిసిపోకుండా, దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు పక్కపక్కనే ప్రవహిస్తుంది. అయితే ఈ నీరు అసలు కలవదని అనుకోవడం పొరపాటే. నీరు క్రమంగా కలుస్తూనే ఉంటుంది, కానీ పూర్తిగా ఒకే రంగులోకి మారడానికి చాలా సమయం పడుతుంది.

ఇది నిజంగానే ఒక అద్భుతమా? శాస్త్రీయంగా చూస్తే ఇది ఒక సాధారణ భౌగోళిక, ప్రవాహ ప్రక్రియే. అయితే రెండు నదుల భౌతిక లక్షణాలు పూర్తిగా భిన్నంగా ఉండటం వల్ల ఈ కలయిక చూడటానికి వింతలా కనిపిస్తుంది. ఇది అక్కడికి వచ్చే పర్యాటకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bird’s Paradise Lake: ప్రపంచంలో ఎన్నో సరస్సులు ఉన్నా కొల్లేరు మాత్రం చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?
Recommended image2
Guava Capital: దేశంలోనే జామపండ్లకు స్పెషల్ సిటీ.. కేరాఫ్ అడ్రస్‌ ఎక్కడో తెలుసా?
Recommended image3
Vegetable Prices : కిలో బెండకాయలు రూ.1000..! యూకేలో ఏ కూరగాయ ధర ఎంతుంటుందో తెలుసా?
Related Stories
Recommended image1
Fish: నదిలో పుట్టి.. సముద్రంలో పెరిగి, చావు కోసం మళ్లీ పుట్టిన నదికే వచ్చే చేప ఇది..!
Recommended image2
Blood River: నీళ్లు కాదు.. రక్తం ఏరులైపారే నది మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved