Sitting health risks: ఒకే దగ్గర అదే పనిగా కూర్చుంటున్నారా? ఆ జబ్బులొస్తయ్ జాగ్రత్త..
Sitting health risks: గంటలకు గంటలు ఒకే దగ్గర కూర్చీలో కూర్చోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని అయిపోయాక కూడా మీరు కుర్చీకే పరిమితమైతే మాత్రం హాస్పటళ్ల పాలు కావడం పక్కాగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Sitting health risks: ప్రస్తుతం చాలా మంది వర్క్ ఫ్రం హోం యే చేస్తున్నారు. బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే పనిచేయడం వల్ల లాభాలు ఎన్నున్నాయో.. అంతకంటే ఎక్కువ నష్టాలే ఉన్నాయి. ఎందుకంటే.. ఈ వర్క్ వల్ల చాలా మంది కూర్చీకే పరిమితమైతున్నారు. అది పని ఉన్నా.. లేకున్నా.. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆఫీసుల్లో ఏసీలు, ఫ్యాన్ల కింద పనిచేసే వారు సైతం కుర్చీలకే అతుక్కుపోతున్నారు. పని ఎంతున్నా మధ్య మధ్యలో నడవక పోతే మాత్రం ఖచ్చితంగా హాస్పటల్ల చుట్టూ తిరగడం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూర్చొని పక్కవారితో కబుర్లు చెప్పుకుంటే వచ్చే ఉల్లాసం, ఆనందం సంగతి పక్కన పెడితే.. ఇలా కూర్చోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలొస్తాయో తెలుసుకుందాం పదండి..
వర్క్ అయిపోయాకా కూడా.. మీరు అలాగే కుర్చీకి అతుక్కుపోతే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శారీరక శ్రమ, ప్రతి దినం వ్యాయామం చేయడం ఎంతో అవసరం. ఇవి లేకుంటే మీకు అనేక రోగాలు అటాక్ చేసే ప్రమాదం పొంచి ఉంది.
ఎక్కువ సేప కూర్చోవడం వల్ల మీ ఒంట్లో కొవ్వు నిల్వలు బాగా పెగిరిపోతాయి. దీంతో మీరు ఊబకాయం బారిన పడతారు. అంతేకాదు మధుమేహం కూడా అటాక్ చేయొచ్చు.
ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్నెముకపై చెడు ప్రభావం పడుతుంది. కంటిన్యూగా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్నెముక దెబ్బతినే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ఎక్కువ సేపు ఒకే దగ్గర కూర్చోవడం వల్ల కళ్లు, మొహం ఉబ్బిపోతాయి. అంతేకాదు నీరసంగా, నిస్సత్తువగా కనిపిస్తూ తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది.
కదలకుండా కూర్చోవడం వల్ల తుంటి కండరాలు బిగుసుకు పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు ఒక్కో సారి తొడ కండరాలు పట్టేసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీనివల్ల blood vessels లో బ్లడ్ నిల్వ ఉంటుందట. దీంతో సిరలు ఉబ్బిపోయే అవకాశం ఉంది. అంతేకాదు inner veins లో రక్తం చిన్న చిన్న గడ్డలుగా తయారవుతుంది. ఇది గనుక ఊపిరితిత్తులకు చేరితే మాత్రం ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
గంటల తరబడి కూర్చోవడం వల్ల పేగుల కదలిక తగ్గిపోతుంది. దీంతో Digestion మెరుగ్గా పనిచేయలేదు. దీంతో మీరు అజీర్థి సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఎక్కువ సేపు కూర్చొని పనిచేయాల్సి వచ్చినప్పుడు మధ్య మధ్యలో కొద్ది సేపు నడవండి. గంట గంటకు మధ్యలో నడిస్తే మీ ఆరోగ్యం సేఫ్. లేదంటే హాస్పటల్ పాలవ్వడం తప్పదు మరి. కాబట్టి ప్రతి రోజూ శారీరక శ్రమ చేస్తూ, క్రమం తప్పకుండా వ్యాయమం చేయండి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.