MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cleaning Hacks: ప్లాస్టిక్ డబ్బాల్లో దుర్వాసన పోగొట్టే సింపుల్ ట్రిక్స్ ఇవిగో!

Cleaning Hacks: ప్లాస్టిక్ డబ్బాల్లో దుర్వాసన పోగొట్టే సింపుల్ ట్రిక్స్ ఇవిగో!

మనం వంటింట్లో ప్లాస్టిక్ డబ్బాలను ఎక్కువగా వాడుతుంటాం. పసుపు, కారం నుంచి కూరగాయల వరకు చాలా పదార్థాలను వాటిలో స్టోర్ చేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు వాటి నుంచి ఒక రకమైన వాసన వస్తుంటుంది. ఈ దుర్వాసన పోగొట్టే కొన్ని సింపుల్ చిట్కాలు మీకోసం. ట్రై చేయండి

2 Min read
Author : Kavitha G
Published : Feb 26 2026, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Plastic Box Cleaning Tips
Image Credit : Asianet News

Plastic Box Cleaning Tips

ప్రస్తుతం కిచెన్ లో ప్లాస్టిక్ డబ్బాల వినియోగం బాగా పెరిగిపోయింది. ఉప్పు, పసుపు, కారం, పచ్చళ్లు ఇలా ప్రతీది ప్లాస్టిక్ డబ్బాల్లోనే స్టోర్ చేస్తున్నారు. అయితే ఇలా స్టోర్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బాల నుంచి ఒకరకమైన వాసన వస్తుంటుంది. ఎన్నిసార్లు కడిగినా ఆ వాసన పూర్తిగా పోదు. ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం వాసన ప్లాస్టిక్‌లో ఇమిడిపోతుంది. అయితే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ప్లాస్టిక్ డబ్బాలను మళ్లీ కొత్తవాటిలా మెరిసేలా చేయవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామా..

26
బేకింగ్ సోడా
Image Credit : Getty

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా సహజమైన డియోడరైజర్‌లా పనిచేస్తుంది. ప్లాస్టిక్ డబ్బాలో గోరువెచ్చని నీరు పోసి, అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఆ డబ్బాను మూత పెట్టి కనీసం 2 నుంచి 3 గంటలు అలాగే ఉంచాలి. ఒకవేళ వానస ఎక్కువగా ఉంటే రాత్రంతా నానబెట్టాలి. తర్వాత సాధారణ డిష్ వాష్‌తో కడిగితే వాసన తగ్గిపోతుంది.

Related Articles

Related image1
Weight Loss Drinks: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు!
Related image2
Neem Leaves: రోజూ గుప్పెడు వేపాకులు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
36
వెనిగర్ వినియోగం
Image Credit : Getty

వెనిగర్ వినియోగం

వెనిగర్‌లో ఉన్న ఆమ్ల గుణాలు దుర్వాసనను న్యూట్రలైజ్ చేస్తాయి. గోరువెచ్చని నీటిలో వెనిగర్ కలిపి డబ్బాలో పోసి 1–2 గంటలు ఉంచాలి. తర్వాత బాగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. దాంతో ప్లాస్టిక్‌లో ఇమిడిన దుర్వాసన తగ్గిపోతుంది. ముఖ్యంగా ఫిష్ లేదా ఎగ్ స్మెల్ పోగొట్టడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

46
నిమ్మరసం
Image Credit : Pixabay

నిమ్మరసం

నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ దుర్వాసనను తొలగించడమే కాకుండా తాజా సువాసనను ఇస్తుంది. ఒక నిమ్మకాయను పిండి దాని రసాన్ని డబ్బాలో రాసి, కొద్దిసేపు అలాగే ఉంచాలి. లేదా నిమ్మ తొక్కలను డబ్బాలో వేసి మూతపెట్టి కొన్ని గంటలపాటు ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే డబ్బా ఫ్రెష్‌గా మారుతుంది.

56
సూర్యరశ్మి
Image Credit : our own

సూర్యరశ్మి

బాగా కడిగిన ప్లాస్టిక్ డబ్బాలను నేరుగా ఎండలో 4–5 గంటలు ఉంచాలి. యూవీ కిరణాలు బ్యాక్టీరియాను నశింపజేసి వాసనను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా తక్కువ స్మెల్ వచ్చినప్పుడు ఈ పద్ధతి సరిపోతుంది. అయితే ఎక్కువసేపు ప్లాస్టిక్ డబ్బాలను ఎండలో ఉంచడం మంచిది కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

66
పేపర్ ముక్కలు
Image Credit : Getty

పేపర్ ముక్కలు

ప్లాస్టిక్ డబ్బాను పూర్తిగా ఆరబెట్టిన తర్వాత లోపల పేపర్ ముక్కలను పెట్టి మూతపెట్టి రాత్రంతా ఉంచాలి. పేపర్ దుర్వాసనను పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది. మరుసటి రోజు పేపర్ తీసేసి నార్మల్ గా కడిగితే వాసన తగ్గిపోతుంది. ఇదే విధంగా కాఫీ పొడి కూడా వాసనను తగ్గించడంలో సహాయపడతుంది.

ప్లాస్టిక్ డబ్బాలు ఉపయోగించే ముందు పూర్తిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం. తడి ఉన్నప్పుడు మూతపెట్టి ఉంచితే వాసన మరింత పెరుగుతుంది. అలాగే ఘాటైన వాసన వచ్చే పదార్థాలను గాజు లేదా స్టీల్ కంటైనర్లలో నిల్వ చేయడం ఉత్తమం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dark Earrings: 1 గ్రాము బంగారంలో క్యూట్ ఇయర్ రింగ్స్
Recommended image2
Gas Burner: గ్యాస్ స్టవ్ మంట తగ్గిందా? బర్నర్‌ను 15 నిమిషాల్లో కొత్తదానిలా మార్చే కిచెన్ టిప్స్
Recommended image3
Cucumber Benefits: ఎండాకాలంలో కీరదోస తింటే ఏమౌతుంది?
Related Stories
Recommended image1
Weight Loss Drinks: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు!
Recommended image2
Neem Leaves: రోజూ గుప్పెడు వేపాకులు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved