Telugu

Home Decor: రూ.500 ఉంటే చాలు..మీ ఇంటికి కొత్తందం తెచ్చిపెడుతుంది

Telugu

రూ.500తో ఇంటి అలంకరణ

ఇంటికి అందమైన, లగ్జరీ లుక్ రావాలంటే భారీ బడ్జెట్ అక్కర్లేదు. కొంచెం ఆలోచిస్తే రూ.500 కంటే తక్కువ ఖర్చుతోనే మీ పాత ఇంటిని కొత్తగా, స్టైలిష్‌గా మార్చుకోవచ్చు.  అదిరిపోద్ది కూడా.

Image credits: Instagram
Telugu

వాల్ ఫ్రేమ్స్

రూ.100-300 ధరలో దొరికే మినిమలిస్ట్ వాల్ ఫ్రేమ్స్ ఇంటికి మోడరన్, ఎలిగెంట్ టచ్ ఇస్తాయి. లివింగ్ రూమ్, బెడ్‌రూమ్ లేదా స్టడీ కార్నర్‌లో 2-3 ఫ్రేమ్‌లతో చిన్న గ్యాలరీ సెటప్ చేయండి.
Image credits: Pinterest
Telugu

కుషన్ కవర్లు మార్చేయండి

ఎంబ్రాయిడరీ, జ్యామెట్రిక్ లేదా బోహో ప్రింట్స్ ఉన్న కుషన్ కవర్లు పాత సోఫాకు కూడా కొత్త లుక్ ఇస్తాయి. రూ.200 నుంచి రూ.500 లోపు 2 నుంచి 4 కుషన్ కవర్లు వస్తాయి.

Image credits: INSTAGRAM
Telugu

LED ఫెయిరీ లైట్స్ వాడండి

ఫెయిరీ లైట్స్ పండుగలకు మాత్రమే కాదు.. బెడ్ హెడ్‌బోర్డ్, బాల్కనీ, వాల్ షెల్ఫ్‌పై అలంకరించవచ్చు. హ్యాంగింగ్ లైట్స్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. రూ.100-రూ.250లోనే ఇది మంచి డెకార్ అప్‌గ్రేడ్.

Image credits: Pinterest
Telugu

ఫాక్స్ ప్లాంట్స్‌తో గ్రీన్ కార్నర్

మొక్కల సంరక్షణకు టైం లేకపోతే, చిన్న ఫాక్స్ ప్లాంట్స్ , ఆర్టిఫిషియల్ సక్యూలెంట్స్‌ను షెల్ఫ్, సెంటర్ టేబుల్ లేదా టీవీ యూనిట్‌పై పెట్టండి. రూ.150 -రూ.400 లో దొరుకుతాయి.

Image credits: ChatGPT
Telugu

ట్రే, షోపీస్ కాంబినేషన్

అందమైన ట్రేలో చిన్న షోపీస్, కొవ్వొత్తి లేదా మినీ ప్లాంట్ పెట్టండి. ఇది హోటల్స్, లగ్జరీ ఇళ్లలో ఉన్నట్లుగా లుక్ ఇస్తుంది. రూ.300 -రూ.500 లో దొరుకుతుంది.

Image credits: Pinterest
Telugu

సెల్ఫ్-అడెసివ్ వాల్‌పేపర్

గోడ వెలిసిపోయినట్లు ఉంటే, సెల్ఫ్-అడెసివ్ వాల్‌పేపర్ ఒక అద్భుతమైన DIY ఆప్షన్. మార్బుల్, వుడెన్  టెక్స్చర్డ్ డిజైన్ వాల్‌పేపర్లు తక్కువ ధరలో ఉన్నాయి. ప్రీమియం ఫీల్ ఇస్తాయి.

Image credits: pinterest

Eyes: కళ్ల కోసం కచ్చితంగా వీటినైతే తినాల్సిందే

Gold Lockets: చిన్న పిల్లల కోసం అదిరిపోయే గోల్డ్ లాకెట్స్.. చూసేయండి

Baby Earrings: 1 గ్రాములో బేబీ ఇయర్ రింగ్స్.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో

Temple Jhumka: ఈ టెంపుల్ ఇయర్ రింగ్స్ తో.. చీరకు రాయల్ లుక్ గ్యారెంటీ