MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Jasmine Storage Tips: మల్లెపూలు ఎక్కువ రోజులు ఫ్రెష్‍గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

Jasmine Storage Tips: మల్లెపూలు ఎక్కువ రోజులు ఫ్రెష్‍గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

మల్లెపూలు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. వాటి సువాసన అలాంటిది. రోజూ పెట్టుకున్నా మహిళలకు వీటిపై ఆశ తీరదు. అయితే ఇవి ఎంత అందంగా ఉంటాయో అంతే త్వరగా వాడిపోతుంటాయి. మరి మల్లెపూలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 24 2026, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మల్లెపూలను తాజాగా ఉంచే చిట్కాలు
Image Credit : AI Generated

మల్లెపూలను తాజాగా ఉంచే చిట్కాలు

మల్లెపూలు వాటి రంగు, వాసన, అందంతో ఎవ్వరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. పండగలు, పూజలు, వ్రతాలకే కాదు.. సాధారణ రోజుల్లోనూ మహిళలు మల్లెపూలను ఇష్టంగా పెట్టుకుంటారు. అయితే ఈ పూలు కాస్త త్వరగా వాడిపోతుంటాయి. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో వీటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు. ఎలాగో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నాణ్యత ముఖ్యం
Image Credit : Asianet News

నాణ్యత ముఖ్యం

సాధారణంగా చాలామంది మల్లెపూలను బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తుంటారు. అయితే కొనుగోలు చేసే సమయంలో వాటి నాణ్యత గమనించడం చాలా ముఖ్యం. అప్పుడే కోసిన పూలు తాజాగా, మంచి తెలుపు రంగులో, కాంతివంతంగా ఉంటాయి. కొంచెం ముదురు లేదా వాడినట్లుగా కనిపించే పూలను తీసుకోకపోవడం మంచిది.

36
క్లాత్, కాగితం వాడకం
Image Credit : Asianet News

క్లాత్, కాగితం వాడకం

అలాగే ఇంటికి తీసుకొచ్చిన వెంటనే, పూలను ప్లాస్టిక్ కవర్లో వేసి బిగుతుగా ముడివేయకూడదు. ఎందుకంటే అందులో గాలి ప్రవాహం లేకపోవడం వల్ల పూలు త్వరగా వాడిపోతాయి. దానికి బదులు పూలను తేలికపాటి బట్టలో లేదా కాగితంలో చుట్టి ఉంచడం మంచిది.

మల్లెపూలు ఎక్కువ కాలం తాజాగా ఉండటానికి తేమ చాలా అవసరం. అందుకే ఒక చిన్న గిన్నెలో నీటిని తీసుకొని, దానిపై పలుచని బట్ట వేసి, ఆ బట్టపై పూలను ఉంచితే అవి తేమను పీల్చుకొని ఎక్కువసేపు తాజాగా ఉంటాయి.

46
ఫ్రిజ్‍లో నిల్వ చేయడం
Image Credit : Asianet News

ఫ్రిజ్‍లో నిల్వ చేయడం

అలాగే మల్లెపూలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం కూడా ఒక మంచి పద్ధతి. అయితే ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు పూలను ఎయిర్‌టైట్ కంటైనర్‌లో కాకుండా, కొద్దిగా గాలి వెళ్లేలా ఉన్న డబ్బాలో ఉంచాలి. ఫ్రిజ్‌లోని చల్లదనం పూలను వాడిపోకుండా కాపాడుతుంది.

మల్లెపూలను నేరుగా నీటిలో ముంచకూడదు, దానివల్ల అవి తడిగా మారి త్వరగా చెడిపోతాయి. అయితే కొద్ది కొద్దిగా నీటి చినుకులు చల్లడం మంచిది. పూలను ఎండలో లేదా వేడి దగ్గర ఉంచకూడదు. అధిక ఉష్ణోగ్రత పూలలోని తేమను తగ్గించి అవి త్వరగా వాడిపోవడానికి కారణమవుతుంది. పూలను ఎప్పుడూ చల్లని ప్రదేశంలో ఉంచడం ఉత్తమం.

56
తరచుగా చెక్ చేయడం
Image Credit : pixabay

తరచుగా చెక్ చేయడం

మల్లెపూలను రాత్రి సమయంలో పెట్టుకోవాలి అనుకునంటే, వాటిని సాయంత్రం వరకు ఫ్రిజ్‌లో ఉంచి, అవసరమైనప్పుడు బయటకు తీసుకుంటే అవి తాజాగా కనిపిస్తాయి. కొందరు పూలపై కొద్దిగా చక్కెర నీరు లేదా తేలికపాటి ఉప్పునీరు కూడా చల్లుతుంటారు. ఈ పద్ధతి పూలకు తాజాదనం ఇస్తుంది. అలాగే పూలను తరచుగా చెక్ చేస్తూ, వాడిపోయిన పూలను తొలగించడం కూడా అవసరం, ఎందుకంటే ఒకటి చెడిపోతే మిగతావి కూడా త్వరగా చెడిపోతాయి.

66
సున్నితంగా పట్టుకోవడం
Image Credit : pixabay

సున్నితంగా పట్టుకోవడం

అలాగే పూలను ఉపయోగించే ముందు వాటిని సున్నితంగా హ్యాండిల్ చేయాలి. గట్టిగా పట్టుకోవడం వల్ల అవి నలిగిపోతాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్‌ పాటిస్తే మల్లెపూలను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు. అందమైన సువాసనతో మన రోజును మరింత ఆనందంగా మార్చుకోవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
Gardening Tips: ఈ సింపుల్ టిప్స్ తో చిన్న బాల్కనీలో కూడా అదిరిపోయే గార్డెన్ రెడీ!
Recommended image2
Gardening Tips: పైసా ఖర్చు లేకుండా బాల్కనీలో గార్డెన్.. మీ ఇంటిని అందంగా మార్చే సింపుల్ టిప్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved