MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Monsoon Home Care : ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు.. వానాకాలంలో మీరు, మీ ఇల్లు సేఫ్

Monsoon Home Care : ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు.. వానాకాలంలో మీరు, మీ ఇల్లు సేఫ్

వర్షాకాలం రాగానే వాతావరణం చల్లబడుతుంది... ఎండల నుంచి ఉపశమనం దొరుకుతుంది. కానీ ఇదే సమయంలో కొన్ని రకాల సమస్యలు కూడా ఎదురవుతాయి. మరి ఈ వానాకాలంలో ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకూడదంటే ముందస్తుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

1 Min read
Author : Arun Kumar P
| Updated : May 30 2026, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైరింగ్ విషయంలో జాగ్రత్త
Image Credit : Freepik

వైరింగ్ విషయంలో జాగ్రత్త

వానాకాలంలో ఇంట్లోని ఎలక్ట్రిక్ స్విచ్‌లు, వైర్లలోకి తేమ చేరకుండా చూసుకోవాలి. తేలిన వైర్లు, పాడైపోయిన స్విచ్ లతో వర్షకాలం ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి వర్షాకాలం మొదలవకముందే పాడైన స్విచ్‌లు, లూజ్‌గా ఉన్న వైర్లను వెంటనే మార్చేయాలి. వాటర్‌ప్రూఫ్ బాక్సులను ఉపయోగించి వాటిని సురక్షితంగా ఉంచడం మంచిది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డ్రైనేజీ పైపులు క్లీన్ చేయండి
Image Credit : Asianet News

డ్రైనేజీ పైపులు క్లీన్ చేయండి

ఎండాకాలంలో ఇంటి పరిసరాల్లోని చెట్లు, పొదలు ఎండిపోతాయి... ఆకులు, కొమ్మలు నేలరాలుతాయి. వర్షాకాలం రాగానే ఈ చెత్తాచెదారం డ్రైనేజీలో పేరుకుపోయి వాననీరు వెళ్లకుండా పైపులు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే డ్రైనేజీ శుభ్రం చేయాలి. అవసరమైతే ప్లంబర్ ను పిలిపించి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను చెక్ చేయించండి... ప్రాబ్లం ఉన్నచోట రిపేర్లు చేయించండి

35
తలుపులు, కిటికీలు పాడవకుండా చూడండి
Image Credit : AI - image (Gemini)

తలుపులు, కిటికీలు పాడవకుండా చూడండి

వానాకాలంలో చెక్కతో చేసిన తలుపులు, కిటికీలు తేమను పీల్చుకుని ఉబ్బిపోతాయి. దీనివల్ల అవి సరిగ్గా మూసుకుపోవు… ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్లు ఉంటే వీటిని మూయలేరు.. పెద్దవాళ్లకు కూడా కష్టమవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వర్షంలో నానే అవకాశాలున్న కిటికీలు, తలుపులకు వార్నిష్ లేదా కొత్త ఫినిషింగ్ వేయించడం మంచిది.

45
వాటర్ లీకేజీలను అరికట్టండి
Image Credit : Getty

వాటర్ లీకేజీలను అరికట్టండి

వర్షాకాలంలో ఇంటి గోడలు, పైకప్పు (రూఫ్) నుంచి నీళ్లు లీక్ అవ్వకుండా చూసుకోవాలి… ఇలా జరిగితే ఇళ్లు మొత్తం పాడైపోయే అవకాశాలుంటాయి. అందుకే వర్షాలు మొదలవకముందే లీకేజీలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. వాటర్‌ప్రూఫ్ పెయింట్లు వాడటం, లీకేజీ ఉన్న చోట్ల సీల్ చేయడం వంటి పనులు పూర్తి చేయాలి.

55
ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకొండి
Image Credit : chat gpt

ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకొండి

ఎండాకాలంలో క్లీన్ గా ఉండే ఇంటి పరిసరాలు వర్షకాలంలో పిచ్చి మొక్కలతో నిండిపోతాయి. దీంతో పాములు. తేళ్లు వంటి విషపూరిత జంతువులు వీటిలోకి చేరతాయి.. అక్కడినుండి ఇంట్లోకి వస్తుంటాయి. ఇది చాలా ప్రమాదకరం.. కాబట్టి వర్షాకాలంలో తరచూ ఇంటి పరిసరాలను క్లీన్ చేసుకుంటూ ఉండాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Care: నార్మల్ టీ కాదు.. ఈ ‘టీ’ వాటర్ వాడితే.. జుట్టు రాలడం కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది..!
Recommended image2
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image3
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Related Stories
Recommended image1
Home Loan: హోమ్ లోన్ ఈఎంఐల నుంచి త్వరగా బయటపడటం ఎలా? ఈ స్మార్ట్ చిట్కాలు మీకోసమే..
Recommended image2
Home Decor: ఈ గోల్డెన్ డెకర్ ఐటమ్స్‌తో మీ ఇల్లు రాజభవనంలా వెలిగిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved